Best mileage cars in India : ది బెస్ట్​ మైలేజ్​ ఇస్తున్న కార్స్​ ఇవే..-list of best mileage cars in india in 2023 check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Mileage Cars In India : ది బెస్ట్​ మైలేజ్​ ఇస్తున్న కార్స్​ ఇవే..

Best mileage cars in India : ది బెస్ట్​ మైలేజ్​ ఇస్తున్న కార్స్​ ఇవే..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 01, 2023 11:27 AM IST

Best mileage cars in India : మంచి మైలేజ్​ ఇచ్చే కారు తీసుకోవాలని మీరు చుస్తున్నారా? ఇండియాలో ది బెస్ట్​ మైలేజ్​ ఇస్తున్న కార్ల వివరాలు మీకోసం..

మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా..
మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా..

Best mileage cars in India : నూతన ఏడాదిలో కొత్త కారు తీసుకోవాలని చూస్తున్నారా? మంచి మైలేజ్​ వచ్చే వాహనాన్ని కొనాలని భావిస్తున్నారా? అయితే ఇండియాలో.. ది బెస్ట్​​ మైలేజ్​ను ఇచ్చే వెహికిల్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా..

2022లో లాంచ్​ అయిన గ్రాండ్​ విటారా.. గ్రాండ్​ సక్సెస్​ అయ్యింది. అయితే.. మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా స్ట్రాంగ్​ హైబ్రీడ్​ వేరియంట్​.. 27.97కేఎంపీఎల్​ మైలేజ్​ని ఇస్తోంది. మార్కెట్​లో గ్రాండ్​ విటారా ధర రూ. 10.45లక్షలు- రూ. 19.65లక్షల వరకు ఉంది.

టయోటా హైరైడర్​..

Toyota Hyryder mileage : స్పెసిఫికేషన్స్​లో గ్రాండ్​ విటారాను పోలి ఉండే.. టయోటా హైరైడర్​ కూడా 27.97 కేఎంపీఎల్​ మైలేజ్​ని ఇస్తోంది. మార్కెట్​లో టయోటా హైరైడర్​ ధర రూ. 10.48లక్షలు- రూ. 18.99లక్షల మధ్యలో ఉంది.

హోండా సిటీ హైబ్రీడ్​..

హోండా సిటీ హైబ్రీడ్​ వెహికిల్​ 26.5కేఎంపీఎల్​ మైలేజ్​ని ఇస్తోంది. ఇందులో 1498సీసీ ఇంజిన్​ ఉంటుంది. ఇది 96.55బీహెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. దీని ధర రూ. 19.89లక్షలు.

మారుతీ సుజుకీ ఆల్టో కే10..

Maruti Suzuki Alto K10 mileage : ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా కొనసాగుతోంది మారుతీ సుజుకీ ఆల్టో కే10. ఇది 24.90కేఎంపీఎల్​ మైలేజ్​ని ఇస్తోంది. ఇందులో 1 లీటర్​ డ్యూయెల్​ జెట్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. 5స్పీడ్​ మేన్యువల్​/ 5స్పీడ్​ ఆటోమెటిక్​ వేరియంట్స్​ ఉన్నాయి. దీని ధర రూ. 3.99లక్షలు- రూ. 5.95లక్షల మధ్యలో ఉంటుంది.

మారుతీ సుజుకీ బలెనో పెట్రోల్​ ఏఎంటీ..

మారుతీ సుజుకీ బలెనోకు అప్డేటెడ్​ వర్షెన్​ 2022లో లాంచ్​ అయ్యింది. కాగా.. బలెనో పెట్రోల్​ ఏఎంటీ వేరియంట్​ 22.94కేఎంపీఎల్​ మైలేజ్​ను ఇస్తోంది. దీని ధర. రూ. 9. 70లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

కియా కారెన్స్​ డీజిల్​ మేన్యువల్​..

దేశంలో వేగంగా వృద్ధిచెందుతున్న ఆటో సంస్థల్లో కియా మోటార్స్​ ఒకటి. కియా కారెన్స్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ కియా కారెన్స్​ డీజిల్​ మేన్యువల్​ వేరియంట్​ 21.3కేఎంపీఎల్​ మైలేజ్​ని ఇస్తోంది. కియా కారెన్స్​ ధర రూ. 10లక్షలు- రూ. 18లక్షల మధ్యలో ఉంటుంది.

టయోటా ఇన్నోవా హైక్రాస్​ స్ట్రాంగ్​ హైబ్రీడ్​..

టయోటా ఇన్నోవా హైక్రాస్​ ఇటీవలే లాంచ్​ అయ్యింది. ఇందులోని స్ట్రాంగ్​ హైబ్రీడ్​ వేరియంట్​.. 21.1కేఎంపీఎల్​ మైలేజ్​ని ఇస్తోంది. హైక్రాస్​ ధర రూ. 18.30లక్షలు- రూ. 28.97లక్షల మధ్యలో ఉంటుంది.

Toyota Innova Hycross స్పెసిఫికేషన్స్​తో పాటు ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6..

మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6కు కూడా డిమాండ్​ ఎక్కువగా ఉంది. ఈ ఎక్స్​ఎల్​6 పెట్రోల్​ మేన్యువల్​ వేరియంట్​ 20.97కేఎంపీఎల్​ మైలేజ్​ను ఇస్తోంది. ఎక్స్​ఎల్​6 ధర రూ. 11.29లక్షలు- రూ. 14.55లక్షల మధ్యలో ఉంటుంది.

మారుతీ సుజుకీ బ్రెజా..

Maruti Suzuki Brezza mileage : మారుతీ సుజుకీ బ్రెజాకు అప్డేటెడ్​ వర్షెన్​ 2022లో లాంచ్​ అయ్యింది. కాగా.. ఇందులోని పెట్రోల్​ మేన్యువల్​ వేరియంట్​ 20.15కేఎంపీఎల్​ మైలేజ్​ని ఇస్తోంది. బ్రెజా ధర రూ. 7.99లక్షలు- రూ. 13.96లక్షల మధ్యలో ఉంటుంది.

* పైన చెప్పిన ధరలన్నీ ఎక్స్​షోరూం ప్రైజ్​లు.

సంబంధిత కథనం