Toyota HyRyder : కొనకుండానే.. టయోటా ‘హైరైడర్’​ను మీ సొంతం చేసుకోండిలా!-want to own toyota urban cruiser hyryder without buying check this out ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Toyota Hyryder : కొనకుండానే.. టయోటా ‘హైరైడర్’​ను మీ సొంతం చేసుకోండిలా!

Toyota HyRyder : కొనకుండానే.. టయోటా ‘హైరైడర్’​ను మీ సొంతం చేసుకోండిలా!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 29, 2022 08:05 AM IST

Own Toyota HyRyder without buying it : టయోటా అర్బన్​ క్రూయిజర్​ హైరైడర్​ను కొనుగోలు చేయకుండానే మీరు మీ సొంతం చేసుకోవచ్చు! ఇది ఎలా అంటే..

టయోటా హైరైడర్​
టయోటా హైరైడర్​ (HT Auto)

Toyota Urban Cruiser HyRyder : టయోటా అర్బన్​ క్రూయిజర్​ హైరైడర్​ ఎస్​యూవీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. కస్టమర్లు ఈ ఎస్​యూవీపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టయోటా సంస్థ కస్టమర్లకు బంపర్​ ఆఫర్​ ఇచ్చింది. ఇప్పుడు.. కొనుగోలు చేయకుండానే టయోటా అర్బన్​ క్రూయిజర్​ హైరైడర్​ను మీరు సొంతం చేసుకోవచ్చు!

ఇలా దక్కించుకోండి..

అర్బన్​ క్రూయిజర్​ హైరైడర్​కు 'సబ్​స్క్రిప్షన్​ మోడల్​'ను ప్రవేశపెట్టింది టయోటా. ఎస్​యూవీని కొనుగోలు చేయకుండా.. నెలకు కొంత మొత్తం చెల్లిస్తూ కారును కస్టమర్లు వినియోగించుకోవచ్చు!

Toyota Urban Cruiser HyRyder subscription model : ఈ ఏడాది సెప్టెంబర్​లో.. టయోటా అర్బన్​ క్రూయిజర్​ హైరైడర్​.. ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టింది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 10.48లక్షల వద్ద ప్రారంభమవుతుంది. అయితే.. సబ్​స్క్రిప్షన్​ మోడల్​లో భాగంగా.. టాప్​ ఎండ్​ 2డబ్ల్యూడీ నియో డ్రైవ్​ ఆటోమెటిక్​ వేరియంట్​ను ఇస్తోంది టయోటా.​ దీని ఎక్స్​షోరూం ధర రూ. 17.09లక్షలు.

సబ్​స్క్రిప్షన్​ మోడల అనేది కాల వ్యవధి.. ప్రయాణించే కిలోమీటర్లపై ఆధారపడి ఉంటుంది. లీజింగ్​ ప్లాట్​ఫామ్​ మైలీజ్​లో ఈ కారును ఆఫర్​ చేస్తోంది టయోటా. స్కీమ్​లో భాగంగా.. ఏడాది- నాలుగేళ్ల కాల వ్యవధిని టయోటా అర్బన్​ క్రూయిజర్​ హైరైడర్​ను లీజ్​కు తీసుకొవచ్చు. కాల వ్యవధి కాకపోతే, ప్రయాణించే కిలోమీటర్ల చొప్పున( వార్షికంగా 12,000- 24,000 కి.మీలు) కూడా కారును సొంతం చేసుకోవచ్చు.

Toyota Urban Cruiser HyRyder price : ఏడాదికి 12000 కి.మీలు అని టెన్యూర్​ తీసుకుంటే.. నెలకు రూ. 56,473 చెల్లించాల్సి ఉంటుంది. అదే.. నాలుగేళ్ల కాల వ్యవధి (ఏడాదికి 24,000కిమీలు దాటకూడదు) ఆప్షన్​ తీసుకుంటే.. నెలకు రూ. 47,729 చెల్లించాలి.

టయోటా అర్బన్​ క్రూయిజర్​ హైరైడర్​ వీ ఏటీ నియో డ్రైవ్​ వేరియంట్​లో 1.5లీటర్​, 4 సిలిండర్​ కే15సీ సిరీస్ హైబ్రీడ్​ పవర్​ట్రైన్​తో కూడిన​ పెట్రోల్​ ఇంజిన్​ఉంటుంది. ఇది 102బీహెచ్​పీ పవర్​, 137ఎన్​ఎం పీక్​ టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ దీని సొంతం.

ఈ హైరైడర్​.. కియా సెల్టోస్​, మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా, స్కోడా కుషాక్, వోక్స్​వ్యాగన్​ టైగన్​, టాటా హ్యారియర్​కు బలమైన పోటీనిస్తోంది.​

Whats_app_banner

సంబంధిత కథనం