Toyota Urban Cruiser Hyryder Neodrive । టొయోటా హైరైడర్ నియోడ్రైవ్ లాంచ్, ధరలు ఇలా ఉన్నాయి!
టొయోటా నుంచి సరికొత్త Toyota Urban Cruiser Hyryder Neodrive కార్ లాంచ్ అయింది. ఈ మైల్డ్- హైబ్రిడ్ SUV ధరలు రూ. 10.48 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.
టొయోటా కిర్లోస్కర్ ఇండియా తమ సరికొత్త Toyota Urban Cruiser Hyryder హైబ్రిడ్ వాహనానికి సంబంధించి Neodrive శ్రేణి ధరలను తాజాగా ప్రకటించింది. భారత మార్కెట్లో టొయోటా హైరైడర్ SUV నియోడ్రైవ్ శ్రేణి ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 10.48 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. టొయోటా నుంచి తేలికపాటి-హైబ్రిడ్ వెర్షన్ అయినటువంటి ఈ Neodrive కార్ మోడల్ కూడా మిగతా హైరైడర్ మోడళ్లలాగే నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. E, S, G అలాగే V అనే వేరియంట్‌లలో ఎంపిక చేసుకోవచ్చు. అన్నింటిలో ఆటోమేటిక్ లేదా మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. వేరియంట్ ఆధారంగా కార్ ధరల్లో మార్పు ఉంటుంది.
టొయోటా- హైరైడర్ నియోడ్రైవ్‌లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ అలాగే 12-వోల్ట్ బ్యాటరీ ఉంటుంది. ఈ మోటార్ 102bhp శక్తిని, 136.8Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేసి ఉంటుంది. అంతేకాకుండా, మాన్యువల్ ఆల్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.
టొయోటా- హైరైడర్ నియోడ్రైవ్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలించండి.
Toyota Urban Cruiser Hyryder Neodrive Range Prices
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియోడ్రైవ్ E MT – రూ 10.48 లక్షలు
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియోడ్రైవ్ S MT – రూ 12.28 లక్షలు
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియోడ్రైవ్ G MT – రూ 14.34 లక్షలు
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియోడ్రైవ్ V MT – రూ 15.89 లక్షలు
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియోడ్రైవ్ V MT AWD - రూ 17.19 లక్షలు
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియోడ్రైవ్ S AT - రూ. 13.48 లక్షలు
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియోడ్రైవ్ G AT - రూ. 15.54 లక్షలు
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియోడ్రైవ్ V AT - రూ 17.09 లక్షలు.
Toyota Urban Cruiser Hyryder Neodrive ఫీచర్లు
ఫీచర్ హైలైట్‌లలో LED హెడ్‌ల్యాంప్‌లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, రిక్లైనింగ్ సీట్లు, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నాయి.
భద్రతపరంగా Toyota Urban Cruiser Hyryderలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్‌తో యాంటీలాకింగ్ బ్రేక్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, TPMS, EBDతో కూడిన ABS, హిల్ హోల్డ్ కంట్రోల్, వెనుక 3-పాయింట్ సీట్ బెల్ట్, ఆల్ వీల్ డిస్క్‌లను కలిగి ఉంటుంది. బ్రేక్, ఫ్రంట్ సీట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సంబంధిత కథనం