తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Heritage Foods Q4 Results: 52 వారాల గరిష్టానికి హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు; Q4 లో భారీ లాభాలు; డివిడెండ్

Heritage Foods Q4 results: 52 వారాల గరిష్టానికి హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు; Q4 లో భారీ లాభాలు; డివిడెండ్

HT Telugu Desk HT Telugu

25 May 2023, 20:24 IST

    • Heritage Foods Q4 results: 2022 -23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23) లో హెరిటేజ్ ఫుడ్స్ మంచి ఫలితాలను సాధించింది. దాంతో, గురువారం హెరిటేజ్ ఫుడ్స్ షేర్స్ విలువ 9% పెరిగి 52 వారాల గరిష్టానికి చేరింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (MINT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

2022 -23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23) లో హెరిటేజ్ ఫుడ్స్ మంచి ఫలితాలను సాధించింది. దాంతో, గురువారం హెరిటేజ్ ఫుడ్స్ షేర్స్ విలువ 9% పెరిగి 52 వారాల గరిష్టానికి చేరింది. Q4FY23లో సంస్థ నికర ఆదాయం రూ. 820.96 కోట్లకు చేరింది. Q4FY22 లో హెరిటేజ్ ఫుడ్స్ సాధించిన నికర ఆదాయం రూ. 698.35 కోట్లతో పోలిస్తే Q4FY23 లో సంస్థ 17.93% అధికంగా ఆదాయం సముపార్జించింది.

ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

Heritage Foods dividend: రూ. 2.50 డివిడెండ్

Q4FY23 ఫలితాలతో పాటు ఫైనల్ డివిడెండ్ ను కూడా హెరిటేజ్ ఫుడ్స్ ప్రకటించింది. రూ. 5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 2.50 డివిడెండ్ గా ఇవ్వాలని నిర్ణయించింది. ఆగస్ట్ 29 వ తేదీ లోగా షేర్ హోల్డర్లకు డివిడెండ్ మొత్తాన్ని చెల్లిస్తామని ప్రకటించింది. Q4FY23 లో హెరిటేజ్ ఫుడ్స్ రూ. 17.93 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. Q4FY22 లో హెరిటేజ్ ఫుడ్స్ ఆర్జించిన రూ. 12.68 కోట్ల నికర లాభాలతో పోలిస్తే, Q4FY23 లో హెరిటేజ్ ఫుడ్స్ ఆర్జించిన నికర లాభాలు 41.36% అధికం. హెరిటేజ్ ఫుడ్స్ ఎర్నింగ్స్ పర్ షేర్ (EPS) కూడా రూ. 1.39 నుంచి రూ. 1.93 కి చేరింది. Q4FY23 లో సంస్థ సగటు పాల సేకరణ రోజుకు 14.30 లక్షల లీటర్లని సంస్థ వెల్లడించింది. ఇది Q4FY22 లో 12.16 లక్షల లీటర్లను తెలిపింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వృద్ధి ని కొనసాగించామని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తెలిపారు. సంస్థ గణనీయమైన లాభాలను ఆర్జించడం వెనుక హెరిటేజ్ బ్రాండ్ పై వచ్చిన వ్యాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (VAP) సాధించిన విజయం కూడా ఉందన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ షేర్ వ్యాల్యూ గురువారం రూ. 189.2 వద్ద ప్రారంభమై, 52 వారాల గరిష్టానికి చేరి, రూ. 206 వద్ద ముగిసింది.