తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Storage To 1tb: గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్.. స్టోరేజ్ ఇక 1 టీబీకి

Google storage to 1TB: గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్.. స్టోరేజ్ ఇక 1 టీబీకి

HT Telugu Desk HT Telugu

01 November 2022, 9:40 IST

    • Google storage to 1TB: గూగుల్ స్టోరేజ్ కెపాసిటీ 15 జీబీ నుంచి 1 టీబీకి పెంచబోతోంది.
15 జీబీ నుంచి 1 టీబీకి పెరగనున్న గూగుల్ స్టోరేజ్ కెపాసిటీ
15 జీబీ నుంచి 1 టీబీకి పెరగనున్న గూగుల్ స్టోరేజ్ కెపాసిటీ

15 జీబీ నుంచి 1 టీబీకి పెరగనున్న గూగుల్ స్టోరేజ్ కెపాసిటీ

గూగుల్ యూజర్లకు పెద్ద ఊరటనిచ్చే వార్త ఇది. జీమెయిల్ ఇన్‌బాక్స్ నిండిపోయినప్పుడల్లా వాటిని డిలీట్ చేయడం పెద్ద తలనొప్పిగా ఉంటుంది. కేవలం 15జీబీ నిల్వ సామర్థ్యం ఉండడంతో అటు మెయిల్స్, ఇటు డ్రైవ్ బ్యాలెన్స్ చేసుకోలేక ఇబ్బంది పడేవాళ్లం. 

ఇప్పుడు గూగుల్ ఈ 15జీబీ స్టోరేజీ సామర్థ్యాన్ని కాస్త 1టీబీ సామర్థ్యానికి పెంచుతోంది. ప్రతి గూగుల్ వర్క్‌స్పేస్ వ్యక్తిగత ఖాతాలో ఆటోమేటిగ్గా 1 టీబీ నిల్వ సామర్థ్యం ఉండేలా అప్‌గ్రేడ్ చేయనుంది. ఈమేరకు గూగుల్ తన తాజా బ్లాగ్ పోస్టులో ఈ సమాచారాన్ని వెల్లడించింది.

గూగుల్ డ్రైవ్ దాదాపు 100 రకాల ఫైల్స్ నిల్వ ఉంచుకునేందుకు అనుమతిస్తుంది. పీడీఎఫ్, సీఏడీ, జేపీజీ తదితర రకాల ఫైల్స్ స్టోర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. వీటిని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫైల్స్‌లా కన్వర్ట్ చేసుకోకుండానే ఎడిట్ చేసేలా ఆప్షన్స్ ఇప్పుడు ఎనేబుల్ చేస్తోంది. దీనికి తోడు గూగుల్ డ్రైవ్ ఇప్పుడు మాల్వేర్, స్పామ్, రాన్సమ్‌వేర్ నుంచి రక్షణగా బిల్ట్ ఇన్ ప్రొటెక్షన్ ఫీచర్లను అందించనుంది.

గూగుల్ మెయిల్‌లో సరికొత్త ఫీచర్

ఒకే మెయిల్‌ను వందలాది మందికి పంపినప్పుడు వారికోసం ప్రత్యేకంగా వెళ్లినట్టు ఉండదు. అయితే గూగుల్ వర్క్‌స్పేస్ ఇప్పుడు @firstname ఫీచర్ తీసుకొస్తోంది. ఈ టాగ్ ఉపయోగించడం ద్వారా మెయిల్ మెర్జ్ చేయొచ్చు. అప్పుడు ఆ మెయిల్ రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వారి కోసం ప్రత్యేకంగా పంపిన మెయిల్‌లా అనిపిస్తుంది. గూగుల్ మల్టీ సెండ్ ఈమెయిల్స్‌లో కూడా అన్‌సబ్‌స్క్రైబ్ లింక్ యాడ్ అయి ఉంటుంది. ఈ మెయిల్ స్వీకరించిన వారు ఇక అవి అవసరం లేదనుకున్నప్పుడు అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.

Google Workspace వ్యక్తిగత ఖాతాను మరిన్ని కొత్త దేశాలు, ప్రాంతాలకు కూడా విస్తరించింది. కొత్త దేశాల జాబితాలో ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, తైవాన్, థాయిలాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, బెల్జియం, ఫిన్లాండ్, గ్రీస్, అర్జెంటీనా ఉన్నాయి.