తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google To Lay Off 12,000 Employees: గూగుల్ నుంచి కూడా ఉద్యోగులకు ఉద్వాసన

Google to lay off 12,000 employees: గూగుల్ నుంచి కూడా ఉద్యోగులకు ఉద్వాసన

HT Telugu Desk HT Telugu

20 January 2023, 16:57 IST

  • Google to lay off 12,000 employees: అన్ని మేజర్ టెక్ కంపెనీలు, ఈ కామర్స్ దిగ్గజాలు  ఇప్పుడు ‘లే ఆఫ్ (lay off)’ బాట పట్టాయి. ఆమెజాన్, ట్విటర్, మైక్రోసాఫ్ట్.. తదితర సంస్థలు ఇప్పటికే తమ ఉద్యోగుల ఉద్వాసనపై ప్రకటనలు చేయగా.. తాజాగా గూగుల్ (Google) మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్(Alphabet Inc)’ కూడా ఉద్యోగుల లే ఆఫ్(lay off) పై కీలక ప్రకటన చేసింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆర్థిక మాంద్యం, ఆదాయంలో తగ్గుదల.. మొదలైన ప్రతికూలతల నేపథ్యంలో అన్ని మేజర్ టెక్, ఈ కామర్స్ సంస్థలు పొదుపు బాట పట్టాయి. అందులో భాగంగా, ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమవుతున్నాయి. ఆమెజాన్, ట్విటర్, మైక్రోసాఫ్ట్.. తదితర సంస్థలు ఇప్పటికే తమ ఉద్యోగుల ఉద్వాసనపై ప్రకటనలు చేశాయి. తాజాగా, గూగుల్ నుంచి కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటన వెలువడింది.

ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

Google to lay off 12,000 employees: గూగుల్ నుంచి 12 వేల ఉద్యోగాలు..

తాజాగా, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాటెక్ కూడా సంస్థ నుంచి 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్టాఫ్ కు ఒక మెమో ను షేర్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ మానవవనరుల రీస్ట్రక్చరింగ్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంజినీరింగ్,ప్రొడక్ట్, కార్పొరేట్ ఫంక్షన్స్, రిక్రూటింగ్.. తదితర విభాగాలు ఈ లేఫ్ డెసిషన్ తో ప్రభావితం కానున్నాయి. ముందుగా, అమెరికాలో ఈ లే ఆఫ్ లను ప్రారంభించనున్నారు. రెండు రోజుల క్రితమే 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు మైక్రోసాఫ్ట్ (Microsoft Corp) సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా దాదాపు అన్ని మేజర్ సంస్థలు కృత్రిమ మేథ, రోబోటిక్స్ కు సంబంధించిన జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (generative artificial intelligence) లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడ్తున్నాయి.

టాపిక్