తెలుగు న్యూస్  /  Business  /  Google To End Support Of Chrome Browser On Windows 7 Windows 8 Check Details

Chrome browser: ఈ కంప్యూటర్లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ పనిచేయదు

HT Telugu Desk HT Telugu

27 October 2022, 11:07 IST

    • Chrome browser on windows: గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఇక కొన్ని కంప్యూటర్లలో పనిచేయదు.
విండోస్ 7, విండోస్ 8.1 వెర్షన్లను సపోర్ట్ చేసే క్రోమ్ బ్రౌజర్ చివరి వెర్షన్ క్రోమ్ 110 మాత్రమేనని గూగుల్ ప్రకటన
విండోస్ 7, విండోస్ 8.1 వెర్షన్లను సపోర్ట్ చేసే క్రోమ్ బ్రౌజర్ చివరి వెర్షన్ క్రోమ్ 110 మాత్రమేనని గూగుల్ ప్రకటన (Photo by Nathana Rebouças on Unsplash)

విండోస్ 7, విండోస్ 8.1 వెర్షన్లను సపోర్ట్ చేసే క్రోమ్ బ్రౌజర్ చివరి వెర్షన్ క్రోమ్ 110 మాత్రమేనని గూగుల్ ప్రకటన

2023 ప్రారంభంలో Windows 7, అలాగే Windows 8.1 ఉన్న కంప్యూటర్ సిస్టమ్స్‌పై Chrome బ్రౌజర్ సపోర్ట్ చేయడాన్ని నిలిపివేస్తామని Google తెలియజేసింది. దాని అఫీషియల్ సపోర్ట్ పేజీలో పోస్ట్ చేసిన నోట్‌లో Chrome 110 ఈ రెండు పాత Microsoft Windows వెర్షన్‌లకు మద్దతు ఇచ్చే చివరి వెర్షన్ అని పేర్కొంది. క్రోమ్ 110 తాత్కాలికంగా ఫిబ్రవరి 7, 2023న విడుదల కానుంది.

జనవరి 10, 2023న విండోస్ 7 ఎక్స్‌టెండెడ్ సపోర్ట్ అప్‌డేట్, విండోస్ 8.1 ఎక్స్‌టెండెడ్ సపోర్ట్‌ నిలిపివేయాలనే మైక్రోసాఫ్ట్ నిర్ణయానికి అనుగుణంగా ఈ చర్య ఉందని గూగుల్ పేర్కొంది.

‘మేం విండోస్ 7, విండోస్ 8, విండోస్ 8.1కి సపోర్ట్ చేయడం నిలిపివేస్తున్నాం. క్రోమ్ 110 (తాత్కాలికంగా ఫిబ్రవరి 7, 2023న విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు) ఈ విండోస్ వెర్షన్‌లలో పని చేసే క్రోమ్ చివరి వెర్షన్..’ అని గూగుల్ సపోర్ట్ పేజీలో వెల్లడించింది.

క్రోమ్ వెర్షన్ 110పై విండోస్ 7, విండోస్ 8.1లో పని చేస్తుంది. అయితే వారు రాబోయే అప్‌డేట్ వెర్షన్‌ల కోసం అర్హులు కారు.

‘మీరు ప్రస్తుతం విండోస్ 7 లేదా విండోస్ 8.1లో ఉన్నట్లయితే, మీరు తాజా సెక్యూరిటీ అప్‌డేట్స్, క్రోమ్ ఫీచర్స్ అందుకోవడం కొనసాగించేందుకు సపోర్ట్ చేసే విండోస్ వెర్షన్‌కి వెళ్లాలని మేము సిఫార్సు చేస్తున్నాం..’ అని గూగుల్ తెలిపింది.

మైక్రోసాఫ్ట్ ప్రకటన

మైక్రోసాఫ్ట్ జనవరి 10, 2023న విండోస్ 7 ఈఎస్‌యూ (సెక్యూరిటీ అప్‌డేట్), విండోస్ 8.1కు మద్దతు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

‘విండోస్ 8.1లో రన్ అయ్యే కంప్యూటర్లు పని చేస్తూనే ఉంటాయి, అయితే మైక్రోసాఫ్ట్ ఇకపై సాంకేతిక సహాయాన్ని అందించదు. విండోస్ 8.1ని ఉపయోగిస్తున్న వినియోగదారులు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌కు అప్‌డేట్ చేయగలుగుతారు. కానీ వారు ఏ సెక్యూరిటీ అప్‌డేట్ అందుకోలేరు..’ అని తెలిపింది.

‘విండోస్ 8.1తో నడుస్తున్న కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ చేయకుండానే ఉపయోగిస్తుంటే మాల్వేర్, వైరస్‌ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విండోస్ కొత్త వెర్షన్‌కి మారాలని మేం సూచిస్తున్నాం..’ అని మైక్రోసాఫ్ట్ అధికారిక వెబ్‌సైట్ ఎఫ్ఏక్యూ పేజీ పేర్కొంది.