తెలుగు న్యూస్  /  Business  /  Gold Price March 21 2023 Gold And Silver Rate Declines Today

Gold Price Today: కాస్త శాంతించిన బంగారం ధర: నేడు తులం రేటు ఎంతంటే!

21 March 2023, 5:33 IST

    • Gold Price Today: దేశీయ మార్కెట్లో బంగారం ధర కాస్త దిగివచ్చింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. నేడు పసిడి, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (REUTERS)

నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Gold Price Today: ఇటీవల అమాంతం పైపైకి వెళుతున్న బంగారం ధరలు కాస్త శాంతించాయి. మూడు రోజుల భారీ పెరుగుదల తర్వాత కాస్త దిగివచ్చాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) పసిడి ధర రూ.500 తగ్గి.. మంగళవారం ఉదయం సమయానికి రూ.54,800 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.540 తగ్గి రూ.59,780కు చేరింది. కిందటి రోజు ఈ ధర రూ.60వేల మార్కును దాటిపోయింది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‍తో పాటు దేశంలోని వివిధ సిటీల్లో బంగారం, వెండి తాజా ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Ampere Nexus e-scooter: రివర్స్ మోడ్, 136 కిమీ రేంజ్ తో భారత్ లోకి యాంపియర్ నెక్సస్ ఈ-స్కూటర్

ITR filing 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఫామ్ 16 గురించి ఈ విషయాలు తెలుసుకోండి

Air India-Vistara merger: ఎయిర్ ఇండియా - విస్తారా విలీనంపై కీలక అప్ డేట్ ఇచ్చిన టాటా సన్స్

Changes from May 1 : మే 1 నుంచి ఈ విషయాల్లో భారీ మార్పులు.. కచ్చితంగా తెలుసుకోవాలి

Gold Price Today in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.54,950కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.59,930గా ఉంది.

Gold Price Today in Hyderabad: హైదరాబాద్ మార్కెట్‍లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.54,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి పసిడి రేటు రూ.59,780 వద్దకు దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్‍లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

Gold Price Today: బెంగళూరు, అహ్మదాబాద్‍లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.54,850గా ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.59,830కు చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800కు వెళ్లింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.60,870 వద్ద ఉంది.

Gold Price Today: ముంబై, కోల్‍కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం రేటు రూ.54,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి వెల రూ.59,780కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‍లోనూ..

Gold Price Today: అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ మార్కెట్‍లోనూ పసిడి పరుగులు పెడుతోంది. సోమవారం సెషన్‍లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర ఓ దశలో 2,000 డాలర్ల ఎగువకు చేరింది. అయితే ఆ తర్వాత కాస్త తగ్గి ప్రస్తుతం 1,977 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే బ్యాంకింగ్ రంగంపై ఆందోళనలు ఇంకా తొలగిపోని నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగానే కనిపిస్తోంది. మరోవైపు డాలర్ విలువ కూడా ఒడిదొడుకుల మధ్య ఉంది. మరో రెండు రోజుల్లో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించే వడ్డీ రేటు నిర్ణయం ప్రభావం కూడా పసిడిపై పడే అవకాశం అవకాశం ఉంది.

స్వల్పంగా తగ్గిన వెండి

Silver Price Today: దేశీయ మార్కెట్‍లో వెండి (Silver) ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రేటు రూ.100 తగ్గి మంగళవారం ఉదయం నాటికి రూ.72,000కు చేరింది.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.74,600కు చేరింది. ఢిల్లీ, కోల్‍కతా, ముంబై మార్కెట్లలో రూ.72,000 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‍లో ఔన్సు సిల్వర్ ధర 22.52 డాలర్ల వద్ద ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)