తెలుగు న్యూస్  /  బిజినెస్  /  50 Years Of Mobile Phone: ఇటుక సైజు నుంచి ఫోల్డబుల్ వరకు;మొబైల్ ఫోన్ కు 50 ఏళ్లు

50 years of mobile phone: ఇటుక సైజు నుంచి ఫోల్డబుల్ వరకు;మొబైల్ ఫోన్ కు 50 ఏళ్లు

30 March 2023, 15:53 IST

  • మొబైల్ ఫోన్ (Mobile Phone) 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటోంది. మొదటి మొబైల్ ఫోన్ ను కొన్ని సంవత్సరాల పరిశోధనల అనంతరం 1973లో ఆవిష్కరించారు. 

తొలి మొబైల్ ఫోన్ సృష్టికర్త మార్టిన్ కూపర్
తొలి మొబైల్ ఫోన్ సృష్టికర్త మార్టిన్ కూపర్

తొలి మొబైల్ ఫోన్ సృష్టికర్త మార్టిన్ కూపర్

మొదట్లో ఇటుక సైజులో, కేజీకి పైగా బరువుతో ఉండే మొబైల్ ఫోన్ (mobile phone).. 50 ఏళ్ల ప్రస్థానంలో సైజు తగ్గుతూ, బరువు తగ్గుతూ, కొత్త ఫీచర్లను యాడ్ చేసుకుంటూ, కేవలం కాల్స్ చేసుకునే స్థాయి నుంచి కంప్యూటర్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగి, సింపుల్ గా మీ ప్యాకెట్ లో కూర్చునే స్థాయి వరకు చేరింది. భవిష్యత్తులో టచ్ స్క్రీన్ స్థానంలో ఇన్ విజిబుల్ స్క్రీన్ కూడా రాబోతోంది. మొబైల్ ఫోన్ ఈ 50 ఏళ్ల ప్రస్థానం వివరాలు క్లుప్తంగా ఇక్కడ..

ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

1973: తొలి మొబైల్ కాల్ ‘హెలో మోటో’

  • 1973: మొదటి మొబైల్ ఫోన్ (mobile phone) 1973లో రూపొందింది. అమెరికా కంపెనీ మోటొరోలా DynaTAC పేరుతో తొలి మొబైల్ ఫోన్ (mobile phone) ను రూపొందించింది. దీన్ని రూపొందించిన ఇంజినీర్ మార్టిన్ కూపర్ (Martin Cooper). తను రూపొందించిన మొబైల్ ఫోన్ నుంచి ఆయన తొలి కాల్ ను 1973 ఏప్రిల్ 3వ తేదీన బెల్ ల్యాబ్స్ లో ఇంజినీర్ గా ఉన్న మిత్రుడు, కాంపిటీటర్ జోయెల్ ఎంగెల్ (Joel Engel) కు చేశారు. విశేషం ఏంటంటే, జోయెల్ ఎంగెల్ కూడా మొబైల్ ఫోన్ (mobile phone) ను రూపొందించే పనిలోనే ఉన్నాడు. తొలి మొబైల్ ద్వారా ‘హెలో మోటో’ (Hello, moto) అంటూ జోయెల్ ఎంగెల్ ను మార్టిన్ కూపర్ పలకరించాడు. వారిద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణే తొలి మొబైల్ కాల్.

1983: మార్కెట్లోకి తొలి మెబైల్ ఫోన్

  • 1983: తొలి మొబైల్ కాల్ ప్రసారం అయన 10 సంవత్సరాలకు గానీ తొలి మొబైల్ ఫోన్ (mobile phone) ను మార్కెట్ లోకి తీసుకురావడం సాధ్యం కాలేదు. 1983లో మొటోరోలా తన తొలి మొబైల్ మోడల్ DynaTAC 8000X ను అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ మొబైల్ ఫోన్ (mobile phone) ధరను 3,995 డాలర్లుగా నిర్ణయించింది. ఆ మొబైల్ ఫోన్ నిక్ నేమ్ బ్రిక్ (brick). అది సుమారు ఒక కేజీ బరువుండేది. 33 సెంటీమీటర్ల పొడవు ఉండేది.

1992: మొట్ట మొదటి టెక్స్ట్ మెసేజ్ ‘మెర్రీ క్రిస్ట్ మస్’

  • తొలి మొబైల్ ఫోన్ మార్కెట్లోకి వచ్చిన 9 ఏళ్లకు మొబైల్ ఫోన్ (mobile phone) నుంచి మొదటి టెక్స్ట్ మెసేజ్ వెళ్లింది. 1992 డిసెంబర్ 3న వొడాఫోన్ (Vodafone) ఉద్యోగి రిచర్డ్ జార్విస్ (Richard Jarvis) ఈ మొదటి టెక్స్ట్ మెసేజ్ ను అందుకున్నారు. ఆ మెసేజ్ ఏంటో తెలుసా.. మెర్రీ క్రిస్ట్ మస్ (Merry Christmas). ఈ మెసేజ్ (message) 2021లో 1.5 లక్షల డాలర్లకు వేలంలో అమ్ముడు పోయింది.

1997: నోకియా విప్లవం ప్రారంభం.. స్నేక్ గేమ్ ఆరంభం

  • 1997: 1997 లో మొబైల్ ఫోన్ (mobile phone) ప్రపంచంలోకి ఫిన్ ల్యాండ్ కంపెనీ నోకియా (Nokia) రంగ ప్రవేశం జరిగింది. మొబైల్ ఫోన్ల రూపకల్పనలో ఎన్నో అత్యుత్తమ మార్పులను ఈ (Nokia) కంపెనీ చేపట్టింది. ఇదే సంవత్సరం మొబైల్ ఫోన్ (mobile phone) లోకి మొబైల్ గేమ్ (mobile game) లు అడుగుపెట్టింది. మొబైల్ ఫోన్ లో వచ్చిన తొలి గేమ్ ఏంటో తెలుసా?,. ‘స్నేక్ (Snake)’. మనలో చాలా మంది ఈ గేమ్ ను ఆడి ఉంటారు కదా.. ఆ గేమ్ ను నోకియా (Nokia) తన 6110 మోడల్ మొబైల్ ఫోన్ (6110 model Nokia phone) లో ప్రవేశపెట్టింది.

1999: మొబైల్స్ లోకి ఇంటర్నెట్

  • మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ వినియోగం 1999 లో ప్రారంభమైంది. వైర్ లెస్ నెట్ వర్క్ ద్వారా బ్రోజింగ్ చేసే వీలును నోకియా (Nokia) తన 7110 మోడల్ లో కల్పించింది. అదే సంవత్సరం తన 3210 మోడల్ మొబైల్ ఫోన్ (mobile phone) లో ప్రెడిక్టివ్ రైటింగ్ ఆప్షన్ ను కూడా ప్రారంభించింది. అలాగే, ఇదే సంవత్సరం మొబైల్ ఫోన్ లో కెమెరాను అమర్చడం ప్రారంభమైంది. 1999 లో Kyocera VP-210 మోడల్ లో, 2000 సంవత్సరంలో Sharp SH04 మోడల్ లో కెమెరాను పొందుపర్చారు.

2003: రికార్డు సృష్టించిన నోకియా 1100 మోడల్

  • 2003 సంవత్సరంలో అందుబాటు ధరలో 1100 మోడల్ మొబైల్ ఫోన్ (1100 model Nokia mobile phone) ను నోకియా (Nokia) మార్కెట్లోకి తీసుకువచ్చింది. చరిత్రలోనే అది అత్యంత ఎక్కువగా అమ్ముడైన మొబైల్ ఫోన్ (mobile phone). అప్పట్లోనే 25 కోట్లకు పైగా ఈ మోడల్ ఫోన్స్ అమ్ముడుపోయాయి.

2001: 3 జీ సేవలు ప్రారంభం

  • ఈ సంవత్సరంలో జపాన్ లో 3జీ (3G) మొబైల్ సేవలు ప్రారంభమయ్యాయి. 3జీ మొబైల్ నెట్ వర్క్ సేవలను ప్రారంభించిన తొలి దేశం జపాన్. తద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు పొందడం ప్రారంభమైంది. ఈ నెట్ వర్క్ తో వీడియో కాలింగ్ సులభమైంది.

2007: యాపిల్ ఫస్ట్ ఐ ఫోన్

  • యాపిల్ (Apple) సంస్థ తమ మొదటి ఐ ఫోన్ (iPhone) ను 2007లో మార్కెట్లోకి తీసుకువచ్చింది. తొలి యాప్ స్టోర్ 2008 లో ప్రారంభమైంది. అదే సంవత్సరం హెచ్ టీసీ సంస్థ తన హెచ్ టీసీ డ్రీమ్ (HTC Dream) మోడల్ ఫోన్ లో మొదటి సారి గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (Google's Android operating system)ను అమర్చంది.

2009: వాట్సాప్ ప్రస్థానం ప్రారంభం

  • షార్ట్ మెసేజింగ్ విప్లవం ప్రారంభమైంది. 2009లో వాట్సాప్ (WhatsApp) ప్రారంభమైంది. ఆ తరువాత వరుసగా iber, WeChat, Telegram, Signal మొదలైన షార్ట్ మెసేజింగ్ యాప్స్ వచ్చాయి. అయితే, మొబైల్ నెట్ వర్క్ ను కాకుండా ఇంటర్నెట్ ను ఉపయోగించుకునే ఈ యాప్స్ సంప్రదాయ ఎస్ఎంఎస్ (SMS) కన్నా త్వరిత గతిన పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా 2012 నుంచి వీటి పాపులారిటీ చాలా పెరిగింది. ఇదే సంవత్సరం స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో తొలి 4జీ (4G) నెట్ వర్క్ ప్రారంభమైంది.

2011: వాయిస్ అసిస్టెంట్ల పోటీ

  • ఎమోజీ (emoji) ల పరంపర ప్రారంభమైన సంవత్సరం ఇది. వాయిస్ అసిస్టెంట్ సిరి (Siri) కూడా ఈ సంవత్సరమే వచ్చింది. యాపిల్ ఐ ఫోన్ 4 ఎస్ (Apple's iPhone 4S) నుంచి సిరి సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత 2012లో గూగుల్ (google), ఆమెజాన్ (amazon) లు కూడా వాయిస్ అసిస్టెంట్లను రూపొందించాయి.

2019: 5 జీ సేవలు ప్రారంభం

  • ప్రపంచంలో తొలిసారి 5 జీ సేవలు ప్రారంభమయ్యాయి. 5 జీ ప్రారంభించిన తొలి దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. అదే సంవత్సరం దక్షిణ కొరియా సంస్థ సామ్సంగ్ (Samsung), చైనా సంస్థ హువాయి (Huawei) ఫోల్డబుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్స్ (foldable screen smartphones) ను రూపొందించాయి.