తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Flipkart Year End Sale Ends Today:ఫ్లిప్ కార్ట్ ఈయర్ ఎండ్ సేల్ ఈ రోజే లాస్ట్; ఈ స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ ఆఫర్స్..

Flipkart Year End Sale ends today:ఫ్లిప్ కార్ట్ ఈయర్ ఎండ్ సేల్ ఈ రోజే లాస్ట్; ఈ స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ ఆఫర్స్..

HT Telugu Desk HT Telugu

16 December 2023, 15:12 IST

  • Flipkart Year End Sale: ఫ్లిప్ కార్ట్  ఈయర్ ఎండ్ సేల్ (Flipkart Year End Sale) డిసెంబర్ 16వ తేదీతో ముగుస్తుంది. ఈ సేల్ లో ప్రీమియం బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స సహా పలు ఎలక్ట్రానిక్ డివైజెస్ పై ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్‌లు ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Flipkart Year End Sale: ఫ్లిప్ కార్ట్ ఈయర్ ఎండ్ సేల్ (Flipkart Year End Sale) డిసెంబర్ 16వ తేదీతో ముగుస్తుంది. ఈ సేల్ లో సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా (SAMSUNG Galaxy S23 Ultra 5G), ఐఫోన్ 14 (APPLE iPhone 14), నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2), గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a), మొటొరోలా ఎడ్జ్ 40 నియో (MOTOROLA Edge 40 Neo) సహా పలు స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్‌లు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

iVOOMi JeetX ZE: ఐవూమి నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, రేంజ్ ల్లో దీనికి సాటి లేదు..

Discounts on Hyundai cars: ఎక్స్టర్ ఎస్యూవీ సహా టాప్ మోడళ్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన హ్యుందాయ్

2024 Maruti Suzuki Swift: 2024 మారుతి సుజుకీ స్విఫ్ట్ రేపు లాంచ్: టాప్ మైలేజ్ ఇచ్చే హ్యాచ్ బ్యాక్ ఇదే..

EPFO alert: ఉద్యోగులకు షాక్; గ్రాట్యుటీ పరిమితి పెంపు అమలుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

నేడే లాస్ట్.

ఫ్లిప్ కార్ట్ ఈయర్ ఎండ్ సేల్ (Flipkart Year End Sale) డిసెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. క్రిస్ట్మస్, న్యూఈయర్ సందర్భంగా కొత్త ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ఈ సేల్ లో ఈ టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ పై మంచి ఆఫర్స్ ఉన్నాయి.

SAMSUNG Galaxy S23 Ultra 5G: సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ

ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 1,24,999కి అందుబాటులో ఉంది. డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు రూ. 25000 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ (Samsung Galaxy S23 Ultra 5G) స్మార్ట్ ఫోన్ లో శక్తివంతమైన క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే, ఇందులో 12GB RAM, 256GB స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ 6.8-అంగుళాల క్వాడ్ HD+ డిస్ప్లే ను కలిగి ఉంటుంది. ఇందులో వెనుకవైపు 200MP క్వాడ్-కెమెరా సెటప్, ముందు 12MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

APPLE iPhone 14: ఐ ఫోన్ 14

128GB స్టోరేజ్ వేరియంట్ ఐ ఫోన్ 14 ధర ఫ్లిప్ కార్ట్ లో రూ. 58999 లుగా ఉంది. బ్యాంక్ ఆఫర్స్ అదనం. ఈ స్మార్ట్‌ఫోన్ లో 15.49 cm (6.1-అంగుళాల) Super Retina XDR డిస్‌ప్లే ఉంటుంది. దీని కెమెరా సెటప్‌లో 12MP డ్యూయల్ రియర్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 6-కోర్ ప్రాసెసర్‌తో A15 బయోనిక్ చిప్‌తో ఇది పని చేస్తుంది.

Nothing Phone 2: నథింగ్ ఫోన్ 2

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 44999 లకు లభిస్తుంది. నథింగ్ ఫోన్ 2 12GB RAM, 512GB స్టోరేజ్ తో లభిస్తుంది. ఇందులో 17.02 cm (6.7-అంగుళాల) ఫుల్ HD+ LTPO AMOLED డిస్‌ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్ రేటు 120 హెర్జ్స్ వరకు ఉంటుంది. ఇందులో కూడా Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌ను అమర్చారు. డ్యూయల్ 50MP(OIS) వెనుక కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Google Pixel 7a: గూగుల్ పిక్సెల్ 7 ఏ

గూగుల్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 37999 ధరకు అందుబాటులో ఉంది. Google Pixel 7a సమర్థవంతమైన టెన్సర్ G2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 8GB RAM, 128GB ROMతో శక్తిమంతమైన పనితీరును చూపుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 15.49 సెం.మీ (6.1-అంగుళాల) ఫుల్ HD+ డిస్‌ప్లే తో వస్తుంది. కెమెరా సెటప్‌లో 64MP(OIS) + 13MP రియర్ కెమెరా సెటప్, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

MOTOROLA Edge 40 Neo: మొటొరోలా ఎడ్జ్ 40 నియో

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 22,999 లకు లబిస్తుంది. MOTOROLA Edge 40 Neo శక్తివంతమైన డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌తో పాటు 8GB RAM, 128GB ROMని కలిగి ఉంది. దీని 16.64 సెం.మీ (6.55-అంగుళాల) ఫుల్ HD+ డిస్‌ప్లే శక్తివంతమైన విజువల్స్‌ని అందిస్తుంది. కెమెరా సెటప్‌లో 50MP + 13MP డ్యుయల్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంటుంది.