Rakhi Gift: సామ్సంగ్ ప్రీమియం ఫోన్ ఇప్పుడు 46 శాతం భారీ డిస్కౌంట్ తో..-rakhi gift samsung galaxy s21 fe just got a huge 46 percent price cut check flipkart deal now ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rakhi Gift: సామ్సంగ్ ప్రీమియం ఫోన్ ఇప్పుడు 46 శాతం భారీ డిస్కౌంట్ తో..

Rakhi Gift: సామ్సంగ్ ప్రీమియం ఫోన్ ఇప్పుడు 46 శాతం భారీ డిస్కౌంట్ తో..

HT Telugu Desk HT Telugu
Aug 29, 2023 07:13 PM IST

Rakhi Gift: మీ సోదరికి రాఖీ పౌర్ణమి రోజు మంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్లిప్ కార్ట్ లో సామ్సంగ్ ప్రీమియం ఫోన్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ (Samsung Galaxy S21 FE) భారీ డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. చెక్ చేయండి..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Samsung)

Rakhi Gift: మీ సోదరికి రాఖీ పౌర్ణమి రోజు మంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్లిప్ కార్ట్ లో సామ్సంగ్ ప్రీమియం ఫోన్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ (Samsung Galaxy S21 FE) భారీ డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. చెక్ చేయండి..

46% డిస్కౌంట్

సామ్సంగ్ గెలాక్సీ సిరీస్ లో వచ్చిన ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ ఒకటి. ఇప్పుడు ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. లాంచ్ అయిన నాటి నుంచి సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ కు మంచి రివ్యూస్ వచ్చాయి. సామ్సంగ్ గెలాక్సీ సిరీస్ లో వచ్చిన సక్సెస్ ఫుల్ మోడల్స్ లో సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ కూడా ఒకటి. సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ 5జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో 46% డిస్కౌంట్ తో లభిస్తోంది.

బ్యాంక్ కార్డ్స్ తో మరింత డిస్కౌంట్

లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ. 74999 కాగా, ఇప్పుడు ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో 46% డిస్కౌంట్ తో రూ. 39999 లకు లభిస్తుంది. అంతేకాకుండా, ఎక్స్ చేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గుతుంది. సామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే 10% లేదా గరిష్టంగా రూ. 1500 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, వర్కింగ్ కండిషన్ లో ఉన్న స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 39400 వరకు ఎక్స్ చేంజ్ బోనస్ పొందవచ్చు. అంటే మీ ఓల్డ్ స్మార్ట్ ఫోన్ కు గరిష్ట ఎక్స్చేంజ్ ధర లభిస్తే,కేవలం రూ. 599 చెల్లించి మీరు ప్రీమియం ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ ను సొంతం చేసుకోవచ్చు.

ఫోన్ స్పెసిఫికేషన్స్

సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ లో 6.4 ఇంచ్ల సూపర్ అమొలెడ్ డిస్ ప్లే, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ఇందులో పవర్ ఫుల్ స్నాప్ డ్రాగన్888 చిప్ సెట్ ను అమర్చారు. అలాగే, 12 ఎంపీ ప్లస్ 12 ఎంపీ ప్లస్ 8 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

WhatsApp channel