తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Flipkart Black Friday Sale: స్మార్ట్ ఫోన్స్ పై ఈ ఆఫర్స్ ను అస్సలు మిస్ కావద్దు

Flipkart Black Friday sale: స్మార్ట్ ఫోన్స్ పై ఈ ఆఫర్స్ ను అస్సలు మిస్ కావద్దు

HT Telugu Desk HT Telugu

26 November 2022, 18:46 IST

  • ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ ఆఫర్స్ ను ప్రకటించింది. ఎలక్ట్రానిక్ కన్సూమర్ గూడ్స్ పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

‘బ్లాక్ ఫ్రైడే సేల్’లో భాగంగా ఫ్యాషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఎఫ్ఎంసీజీలపై ఆకర్షణీయ ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై మునుపెన్నడు లేనంత డిస్కౌంట్ అందుబాటులో ఉందని తెలిపింది. 5జీ సదుపాయం ఉన్న స్మార్ట్ ఫోన్లు కూడా ఆఫర్లలో లభిస్తున్నాయని వెల్లడించింది. ప్లిప్ కార్ట్ అందిస్తున్న ఈ ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్, బ్యాంక్ ఆఫర్స్

డిస్కౌంట్లతో పాటు నో కాస్ట్ ఈ ఎమ్ఐ, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్, ఫ్లిప్ కార్ట్ పే లేటర్ లాంటి ఆఫర్లు కూడా కస్లమర్లకు అందుబాటులో ఉన్నాయి. అలాగే, స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసి ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్, సిటీ బ్యాంక్ కార్డ్స్, లేదా కోటక్ బ్యాంక్ కార్డ్స్ తో చెల్లించిన వారికి ధరలో 12% తక్షణ తగ్గింపు ఉంది. ఆకర్షణీయమైన ఆఫర్లున్న ఈ స్మార్ట్ ఫోన్లను ఒకసారి చూడండి..

- మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా 5జీ (Motorola Edge 30 Ultra 5G)

మోటొరోలా నుంచి వచ్చిన 5జీ ఫోన్ ఇది. 127 జీబీ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ ప్రాసెసర్ సహా అత్యాధునిక ఫీచర్లన్నీ ఉన్నాయి. అంతేకాదు, 200 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాను ఇందులో పొందుపర్చారు. ఈ స్మార్ట్ ఫోన్ వాస్తవ ధర రూ. 59,999 కాగా, ఫ్లిప్ కార్ట్ ‘బ్లాక్ ఫ్రైడే సేల్’లో రూ. 5 వేల డిస్కౌంట్ తో 54,999కే లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లు అదనం.

యాపిల్ ఐ ఫోన్ 11 (Apple iPhone 11)

స్మార్ట్ ఫోన్ అంటే ఐ ఫోనే అనుకునే యాపిల్ ఫ్యాన్స్ చాలామందే ఉంటారు. వారి కోసమే ఈ ఐ ఫోన్ 11 ఆఫర్. 64 జీబీ స్టోరేజ్ తో వచ్చే ఈ ఫోన్ అసలు ధర 43,900 కాగా, ‘బ్లాక్ ఫ్రైడే సేల్’లో రూ. 39,999కి లభిస్తుంది. రూ. 17500 వరకు ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా ఉంది. బ్యాంక్ ఆఫర్లు అదనం. ఈ ఫోన్ లో ఏ 13 బయోనిక్ చిప్ ప్రాసెసర్ ను అమర్చారు. 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా హెచ్ డీ డిస్ ప్లే దీని ప్రత్యేకత. ఈఫోన్ కు వెనుకవైపు డ్యుయల్ కెమెరా ఉంటుంది.

వివో వీ 25 ప్రొ 5జీ (vivo V25 Pro 5G)

8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వచ్చిన ఈ వివో వీ 25 ప్రొ 5జీ (vivo V25 Pro 5G) ఫోన్ ధర రూ. 39999 కాగా, సేల్ లో రూ. 35999 కి లభిస్తోంది. ఈ ఫోన్ కు కూడా రూ. 17500 ఎక్స్ చేంజ్ ఆఫర్ ఉంది. ఇది 6.56 అంగుళాల ఎఫ్ హెచ్ డీ డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది.

రియల్ మి జీటీ నియో 3టీ (realme GT Neo 3T)

అత్యాధునిక ఫీచర్లను అందుబాటు ధరలో అందించే రియల్ మి నుంచి వచ్చిన ఫోన్ ఇది. 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ తో వచ్చే ఈ ఫోన్ పై కూడా రూ. 17500 ఎక్స్ చేంజ్ ఆఫర్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 36999 కాగా, సేల్ లో రూ. 31,999 కి వస్తుంది. ఈ ఫోన్ కి 6.62 అంగుళాల FHD+ అమొలెడ్ డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది.