Hyundai electric car : 2025లో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. క్రేటా ఈవీ?
02 June 2024, 15:28 IST
- Hyundai electric car : హ్యుందాయ్ తన మొదటి మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ ఆఫర్‌ని 2025 ప్రారంభంలో లాంచ్ చేస్తున్నట్టు ధ్రువీకరించింది. అది క్రేటా ఈవీ అవుతుందని టాక్ నడుస్తోంది. పూర్తి వివారాల్లోకి వెళితే..
ఇద హ్యుందాయ్ క్రేటా ఈవీ..!
Hyundai Creta EV launch : హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ఈవీ ప్రణాళికలను వివరించింది . వాహన తయారీదారు 2030 నాటికి ఐదు కొత్త స్థానికంగా నిర్మించిన ఆఫర్లను రెడీ చేస్తోంది. దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ ఇప్పుడు తన మొదటి మేడ్-ఇన్-ఇండియా ఆల్-ఎలక్ట్రిక్ ఆఫర్స్‌ని 2025 ప్రారంభంలో లాంచ్ చేస్తున్నట్టు ధృవీకరించింది. చెన్నై సమీపంలోని ఫెసిలిటీలో దానిని నిర్మిస్తున్నట్టు స్పష్టం చేసింది. హ్యుందాయ్ ఇండియా మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు క్రెటా ఈవీనే అని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. టెస్టింగ్ దశలో ఉన్న ఈ మోడల్.. అనేకమార్లు భారతీయ రోడ్లపై దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ క్రేటా ఈవీ..!
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ (గ్రూప్ లేదా హెచ్ఎంజి) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ యుసున్ చుంగ్ ఈ వారం భారతదేశానికి వచ్చారు. హ్యుందాయ్, కియా బ్రాండ్లను కలిగి ఉన్న గ్రూప్ మధ్య నుంచి దీర్ఘకాలిక భవిష్యత్తు వ్యూహాన్ని సమీక్షించారు. హ్యుందాయ్ ఇండియా కోసం వ్యూహాన్ని వివరిస్తూ, ప్రస్తుత సంవత్సరం చివరిలో రాబోయే హ్యుందాయ్ ఈవీ భారీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని వాహన తయారీ సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది ప్రారంభంలో అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వివరించింది.
Hyundai Creta EV launch date in India : అంతేకాకుండా, కియా ఇండియా 2025 లో తన మొదటి స్థానిక ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. మరింత స్థానికంగా నిర్మించిన ఎలక్ట్రిక్ వాహనాలతో తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తుంది. ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరించడంపై కూడా రెండు కంపెనీలు దృష్టి పెట్టనున్నాయి. హ్యుందాయ్ ఇండియా తన సేల్స్ నెట్వర్క్ హబ్‌లను ఉపయోగించుకుంటుంది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 485కు పెంచుతుంది.
హ్యుందాయ్ తన ఈవీ పోర్ట్‌ఫోలియోను ప్రారంభించడానికి క్రెటా ఈవీని మొదటి లాంచ్‌గా ఫిక్స్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. మునుపటి స్ప షాట్లు రీడిజైన్ చేసిన ఫ్రంట్‌ని వెల్లడించాయి. ఇది ప్రామాణిక క్రెటా, క్రెటా ఎన్-లైన్ నుంచి భిన్నంగా ఉంటుంది. ఇది ఐసీఈ వెర్షన్ల నుంచి చాలా ఫీచర్లను కలిగి ఉంటుంది. అయినప్పటికీ ఈవికి ప్రత్యేకమైన కొన్ని విలువలను జోడిస్తోంది సంస్థ. స్పెసిఫికేషన్లపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. కానీ క్రెటా ఈవీ సుమారు 400-500 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని భావిస్తున్నారు.
Kia Seltos EV launch in India : కొంతకాలంగా సెల్టోస్ ఈవీని పరీక్షిస్తున్న కియా ఇండియా విషయంలోనూ ఇదే పరిస్థితి. కియా సెల్టోస్ ఈవీ కూడా ఐసీఈ డెరివేటివ్స్తో పాటు తన సొంత గుర్తింపును స్థాపించడానికి విజువల్ మార్పులు పొందుతుందని భావిస్తున్నారు. క్రెటా ఈవీ, సెల్టోస్ ఈవీలలో ఒకే విధమైన పవర్ట్రెయిన్లను ఆశించవచ్చు. బ్యాటరీ ప్యాక్లను కూడా పంచుకోవచ్చు.
హ్యుందాయ్ క్రెటా ఈవీ, కియా సెల్టోస్ ఈవీ ధరలు రూ.20-30 లక్షల శ్రేణిలో ఉంటాయి. మహీంద్రా ఎక్స్ యూవీ400, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టాటా కర్వ్, మారుతీ సుజుకీ ఈవీఎక్స్, బీవైడీ అటో 3 తదితర మోడళ్లతో ఈ మోడల్స్ పోటీ పడనున్నాయి.