తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lectrix Electric Scooter : రూ. 50వేలకే హై-స్పీడ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​..

Lectrix electric scooter : రూ. 50వేలకే హై-స్పీడ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​..

Sharath Chitturi HT Telugu

08 April 2024, 12:45 IST

google News
    • Lectrix EV new scooter :  సరికొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ని ఇండియాలో లాంచ్​ చేసింది లెక్ట్రిక్స్​ ఈవీ సంస్థ. ఈ మోడల్​ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
లెక్ట్రిక్స్​ ఈవీ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​..
లెక్ట్రిక్స్​ ఈవీ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​..

లెక్ట్రిక్స్​ ఈవీ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​..

Lectrix EV : దిగ్గజ ఎస్​ఏజీ గ్రూప్​నకు చెందిన లెక్ట్రిక్స్​ ఈవీ సంస్థ.. తాగాజా ఓ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ని లాంచ్​ చేసింది. దీని ఎక్స్​షోరూం ధర కేవలం రూ. 49,999! అంతేకాకుండా.. సర్వీస్​లో భాగంగా ఈ ఈ-స్కూటర్​కి బ్యాటరీని కూడా అందిస్తోంది లెక్ట్రిక్స్​ ఈవీ. అంటే.. సబ్​స్క్రిప్షన్​ బేసిస్​ కింద, కస్టమర్లు బ్యాటరీ సర్వీస్​కి కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

లెక్ట్రిక్స్​ ఈవీ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​- హైలైట్స్​ ఇవే!

"ఈ బ్యాటరీ సర్వీస్​ కాన్సెప్ట్​ చాలా సింపుల్​ అండ్​ ఎఫెక్టివ్​. బ్యాటరీని వెహికిల్​ నుంచి డీలింక్​ చేసి, సర్వీస్​ ప్రొవైడ్​ చేస్తాము. దీని ద్వారా.. యాక్సెసబులిటీ, అఫార్డబిలిటీలో కస్టమర్ల ఎక్స్​పీరియెన్స్​ మెరుగుపడుతుంది. బ్యాటరీ వ్యవహారంలో అనిశ్చితి, దాని అధిక ధర.. ఈవీ అడాప్షన్​కు సవాలుగా మారింది. ఈ బ్యాటరీ సర్వీస్​తో.. ఆ రెండు సవాళ్లను అధిగమించాము," అని లెక్ట్రిక్స్​ ఈవీ బిజినెస్​ ప్రెసిడెంట్​ ప్రతీశ్​ తల్వార్​ తెలిపారు.

"ఐసీఈ ఇంజిన్​ స్కూటర్​ కొనాలంటే కనీసం రూ. 1 లక్ష పెట్టాలి. కానీ మేము రూ. 49,999కే ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇస్తున్నాము. అంటే.. సగం ధరే! అంతేకాకుండా.. ప్రతి నెలా పెట్రోల్​ బిల్లులపై ఖర్చులు పెరిగిపోతున్నాయి. మా సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​తో ఎలక్ట్రిక్​ స్కూటర్ కొంటే.. ఎకనామికల్​గా ఉంటుంది," అని తల్వార్​ చెప్పుకొచ్చారు.

New electric scooter launch in India : ఇతర మోడల్స్​తో పోల్చుకుంటే.. బ్యాటరీ-ఆస్​-ఏ సర్వీస్​ (బీఏఏఎస్​) ప్రోగ్రామ్​ ద్వారా విక్రయిస్తున్న తమ లెక్ట్రిక్స్​ ఈవీ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర 40శాతం తక్కువని సంస్థ చెబుతోంది. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 100కి.మీల దూరం ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. ఈ స్కూటర్​ టాప్​ స్పీడ్​ 50కేఎంపీహెచ్​. లైఫ్​ టైమ్​ బ్యాటరీ వారెంటీ కూడా లభిస్తోంది.

ఇదీ చూడండి:- Ather Rizta launch: ఎలక్ట్రిక్ స్కూటర్స్ లోకి మరో స్టైలిష్ ఎంట్రీ; ఎథర్ రిజ్టా లాంచ్

ఈ ఏడాది ఫిబ్రవరిలో.. ఎల్​ఎక్స్​ఎస్​ 2.0 పేరుతో ఓ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని లాంచ్​ చేసింది సంస్థ. దీని రేంజ్​ 98కి.మీలు. ఇందులో 2.3 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 79,999. ఇది చాలా యునీక్​ బండి అని సంస్థ చెబుతోంది. రేంజ్​, క్వాలిటీ, వాల్యూకి ప్రిఫరెన్స్​ ఇచ్చే కస్టమర్లకు ఈ స్కూటర్​ బెస్ట్​ ఆప్షన్​ అని అంటోంది.

Lectrix EV LXS G 2.0 : ఈ ఎల్​ఎక్స్​ఎస్​ 2.0 ఎలక్ట్రిక్​ స్కూటర్​పై 3ఏళ్లు లేదా 30వేల కి.మీల వారెంటీ ఇస్తోంది సంస్థ. ఇందులో.. యాంటీ థెఫ్ట్​ సిస్టెమ్​, ఎమర్జెన్సీ ఎస్​ఓఎస్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి. డోర్​స్టెప్​ సర్వీస్​ని కూడా ప్రొవైడ్​ చేస్తోంది సంస్థ.

తదుపరి వ్యాసం