తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Flora Electric Scooter : ఫ్లోరా ఎలక్ట్రిక్​ స్కూటర్​ రీ-లాంచ్​.. 100 కి.మీ రేంజ్​- ధర ఎంతంటే!

Flora electric scooter : ఫ్లోరా ఎలక్ట్రిక్​ స్కూటర్​ రీ-లాంచ్​.. 100 కి.మీ రేంజ్​- ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu

08 March 2024, 8:10 IST

google News
    • Komaki Flora electric scooter : కొమాకి ఫ్లోర్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రీ-లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ చూసేయండి.
కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్​ స్కూటర్​ రీ-లాంచ్
కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్​ స్కూటర్​ రీ-లాంచ్

కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్​ స్కూటర్​ రీ-లాంచ్

Flora electric scooter range : ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లోకి ఫ్లోరా ఎలక్ట్రిక్​ స్కూటర్​ని రీ-లాంచ్​ చేసింది కొమాకి ఎలక్ట్రిక్​ సంస్థ. ఈ ఈ- స్కూటర్​ ఎలక్ట్రిక్​ ఎక్స్​షోరూం ధర రూ. 69,000. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, రేంజ్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్​ స్కూటర్​..

కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్​ స్కూటర్​లో రెట్రో స్టైల్​ డిజైన్​ కనిపిస్తుంది. మొత్తం మూడు కలర్స్​లో ఈ-స్కూటర్​ లభిస్తుంది. అవి.. గార్మెట్​ రెడ్​, జెట్​ బ్లాక్​, సాక్రామెంటో గ్రే.

ఫ్లోరా ఎలక్ట్రిక్​ స్కూటర్​లో డిటాచెబుల్​ ఎల్​ఐపీఓ4 బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని రేంజ్​ 80కి.మీ నుంచి 100కి.మీల మధ్యలో ఉంటుంది. 0-100శాతం ఛార్జింగ్​కి 4 గంటల 55 నిమిషాల సమయం పడుతుంది. ఇక 0-90శాతం ఛార్జింగ్​కి 4 గంటల సమయం పడుతుందని సంస్థ చెబుతోంది.

Komaki Flora electric scooter price : ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఫ్లోరింగ్​ ఫ్లాట్​గా ఉంటుంది. ఫలితంగా.. గ్రోసరీ, బ్యాగ్స్​ని స్టోర్​ చేసుకోవచ్చు. రేర్​ పిలియన్​ ప్యాసింజర్​ కోసం డ్యూయెల్​ ఫుట్​రెస్ట్​లు ఉండటం విశేషం. సీట్​ కూడా చాలా పెద్దగానే ఉంది. ఇద్దరు మనుషులు సౌకర్యవంతంగా కూర్చుని జర్నీ చేయొచ్చు. 18 లీటర్ల బూట్​ స్పేస్​ కూడా వస్తుండటం విశేషం.

బ్లూటూత్​ కనెక్టివిటీ, రేడీయో ఎఫ్​ఎంతో కూడిన సౌండ్​ సిస్టెమ్​ కూడా ఈ కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఉంది. కీలెస్​ ఎంట్రీ, కీఫాబ్​, ఎస్​ఓఎస్​ బటన్​ వంటివి ఈ స్కూటర్​ ఇతర ఫీచర్స్​. ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ ల్యాంప్​, ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​ వంటివి ఉన్నాయి.

ఈ స్కూటర్​లో పార్కింగ్​ అసిస్ట్​ ఫీచర్​ కూడా ఉంది. క్రూజ్​ కంట్రోల్​ ఫీచర్​ కూడా ఉంది. ఇందులో మొత్తం 3 రైడింగ్​ మోడ్స్​ ఉన్నాయి. అవి.. ఈకో, స్పోర్ట్​, టర్బో. మల్టిపుల్​ సెన్సార్స్​, వయర్​లెస్​ అప్డేట్స్​, స్మార్ట్​ డాష్​బోర్డ్​ వంటివి ఇతర ఫీచర్స్​గా ఉన్నాయి.

ఓలా ఈ-స్కూటర్లపై డిస్కౌంట్లు..

ఓలా ఎలక్ట్రిక్ సంస్థ 2024 ప్రారంభం నుంచి వినియోగదారులకు పలు ఆఫర్స్ లేదా ప్రయోజనాలను అందిస్తోంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్​లో మార్కెట్ లీడర్​గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ వినియోగదారులకు మరో శుభవార్త తెలిపింది. తన లైనప్​లోని ఎలక్ట్రిక్ స్కూటర్స్​పై డిస్కౌంట్ , ఆఫర్స్​ని ఈ నెలాఖరు (మార్చి 31) వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం