Equity mutual fund inflow : ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి రెండింతల నిధుల ప్రవాహం
10 October 2022, 18:03 IST
- Equity mutual fund inflow : ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సెప్టెంబర్ నెలలో నిధుల ప్రవాహం మామూలుగా లేదు! ఆగస్టుతో పోల్చుకుంటే సెప్టెంబర్‌లో పెట్టుబడులు 2.3శాతం పెరిగాయి.
దుమ్మురేపిన ఈక్వీటీ మ్యూచువల్ ఫండ్స్..!
Equity mutual fund inflow : ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి నిధుల ప్రవాహం కొనసాగుతోంది. సెప్టెంబర్‌లో రూ. 14,000 కోట్లు మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చి చేరాయి. ఆగస్టు నెల నిధుల ప్రవాహంతో పోల్చుకుంటే ఇది 2.3శాతం ఎక్కువగా ఉండటం విశేషం.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్వైపు మదుపర్లు గత కొంతకాలంగా దృష్టిసారించారు. ఆగస్టులో టాప్ స్థానంలో నిలిచి డెట్ మ్యూచువల్ ఫండ్స్.. సెప్టెంబర్‌లో పతనమయ్యాయి. సెప్టెంబర్‌లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ. 65,300కోట్ల నగదును ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో బంగారం, ఇతర ఈటీఎఫ్‌లకు డిమాండ్ పుంజుకుంది. మొత్తం మీద సెప్టెంబర్ 30 నాటికి నెట్ ఏయూఎం(అసెట్ అండర్ మేనేజ్మెంట్).. రూ. 38.42లక్షల కోట్లుగా నిలిచింది.
- ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Mutual funds latest news : ఏఎంఎఫ్ఐ డేటా ప్రకారం.. సెప్టెంబర్‌లో ఈక్వీటీ స్కీమ్స్ ఇన్‌ఫ్లో రూ. 14,099.73కోట్లుగా ఉంది. ఆగస్టులో అది రూ. 6,119.58కోట్లు మాత్రమే.
ఇక ఈక్విటీలో మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌కు గిరాకీ విపరీతంగా పెరిగింది! మిడ్‌క్యాప్‌లోకి రూ. 2,151.15కోట్లు వచ్చి చేరాయి. స్మాల్ క్యాప్‌లోకి రూ. 1,825.48కోట్లు చేరాయి. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ కాంబీనేషన్ ఫండ్సలోకి రూ. 1,468.82కోట్ల నిధుల ప్రవాహం జరిగింది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లోకి రూ. 2,401.20కోట్లు చేరాయి. అన్నింటికన్నా.. సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ. 4,418.61కోట్ల నిధులు వచ్చి చేరాయి. ఆగస్టులో ఇక్కడ రూ. 1,266.67కోట్ల నిధులు ఔట్‌ఫ్లో అయ్యాయి.
- మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు ముందు తెలుసుకోవాల్సిన విషయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
"అంతర్జాతీయ మార్కెట్లతో పోల్చుకుంటే.. దేశీయ మార్కెట్లు మెరుగ్గా ఉన్నాయని మదుపర్లకు అర్థమైంది. అందుకే ఎఫ్ఐఐలు అమ్ముతున్నా.. డీఐఐలు కొనుగోళ్లు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్‌ఫ్లో పెరుగుతుందని ఆశిస్తున్నాము," అని మోతిలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది అన్నారు.
Mutual funds inflow in september : ఇక డెట్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే.. ఆగస్టులో ఇక్కడ రూ. 49,164.29కోట్ల ఇన్‌ఫ్లో జరిగింది. కానీ ఈసారి రూ. 65,372.40కోట్ల ఔట్‌ఫ్లో జరిగింది. వీటిల్లో లిక్విట్ ఫండ్స్(రూ. 59,970.30కోట్లు) నుంచి ఎక్కువ నగదు ఉపసంహరణ జరిగింది.
డెట్ మార్కెట్లో అమ్మకాల కారణంగా.. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్‌లో సెప్టెంబర్ నెల రూ. 41,404.30కోట్ల నిధుల ఉపసంహరణ జరిగింది. ఆగస్టులో రూ 65,077.46కోట్ల నిధులు చేరాయి.
2022 సెప్టెంబర్ 30 నాటికి నెట్ ఏయూఎం.. రూ. 38,42,350.73కోట్లుగా ఉంది.