తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Meil Electric Tipper : Iew - 2023లో స్పెషల్ అట్రాక్షన్ గా 'ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్'

Meil Electric Tipper : IEW - 2023లో స్పెషల్ అట్రాక్షన్ గా 'ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్'

HT Telugu Desk HT Telugu

08 February 2023, 19:30 IST

    • Olectra's First Electric Tipper News: దేశంలోనే మొట్ట‌మొద‌టి ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్.. ఇండియా ఎన‌ర్జీ వీక్ -2023లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సందర్శకులు, పలువురు ప్రతినిధులు వాహన ప్రత్యేకతలను తెలుసుకునేందుకు ఆసక్తి  కనబర్చారు.  
ఎంఈఐఎల్‌  ఎలక్ట్రిక్ టిప్పర్‌
ఎంఈఐఎల్‌ ఎలక్ట్రిక్ టిప్పర్‌

ఎంఈఐఎల్‌ ఎలక్ట్రిక్ టిప్పర్‌

MEIL Electric Tipper: బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియా ఎన‌ర్జీ వీక్‌-2023లో ఎంఈఐఎల్‌ ఎలక్ట్రిక్ టిప్పర్‌ సత్తా చాటింది. ప్రధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభ‌మైన ఈ సదస్సులో ఎంఈఐఎల్‌ అనుబంధ డ్రిల్‌మెక్ ఇంటర్నేషనల్, పెట్రివెన్ ఎస్‌పిఏ, ఒలెక్ట్రా, మెగా గ్యాస్ (MCGDPL ), ఐకామ్ (ICOMM) సంస్థలు పాల్గొన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

First Bajaj CNG motorcycle: బజాజ్ నుంచి తొలి సీఎన్జీ మోటార్ సైకిల్; జూన్ 18 న లాంచ్

Bajaj Pulsar NS400Z: 2024 పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను లాంచ్ చేసిన బజాజ్; ధర కూడా తక్కువే..

‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

ఒక్క ఛార్జ్..250 కి.మీ జర్నీ

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ త‌యారుచేసిన ఇండియాలోనే మొట్ట‌మొద‌టి ఎలక్ట్రిక్ టిప్పర్ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ టిప్ప‌ర్ బ్యాట‌రీ ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 250 కిమీ వ‌ర‌కు ప్రయాణం చేయ‌వ‌చ్చు, రెండు గంటల్లోనే ఈ టిప్ప‌ర్ బ్యాట‌రీ పూర్తిగా ఛార్జింగ్ అవుతుంది. ఈ వాహన ప్రత్యేకలను చూసిన సందర్శకులు, పలువురు ప్రతినిధులు ఫిదా అయ్యారు. టిప్ప‌ర్ ఫీచ‌ర్స్‌, ప‌నిత‌నం స్వ‌యంగా చూసి ఆశ్చ‌ర్యం, ఆనందం వ్య‌క్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కంపెనీలు ఇప్ప‌టివ‌ర‌కు ఎలక్ట్రిక్ బైక్‌లు, సైకిళ్లు, కార్లు, ఆటోలు, మీడియం వాహనాల తయారీపై దృష్టి సారించాయి. వాటికి భిన్నంగా, ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ తయారీ చేయటంపై ఈవెంట్‌లో ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. ప్రపంచం నలుమూలల నుంచి ఈవెంట్‌కు హాజరైన ప్రతినిధులు... ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ‌ల ఉత్ప‌త్తుల వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌తినిధుల సందేహాలను మేఘా ప్ర‌తినిధులు నివృత్తి చేశారు. ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన రెండు స్టాళ్ల వ‌ద్ద సందర్శకులు సందడి కనిపించింది.

ఐకామ్ (ICOMM) టెలి లిమిటెడ్ త‌యారు చేస్తున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-సంబంధిత ఉత్పత్తులు-పవర్ టవర్లు, టెలికాం టవర్లు, కండక్టర్లు మరియు ఫాస్టెనర్‌లు, సోలార్ మాడ్యూల్ మౌంటింగ్ స్ట్రక్చర్‌లు, రోడ్ ఇన్‌ఫ్రా ఫర్నిచర్, షెల్టర్‌లు, పోర్టబుల్ క్యాబిన్‌లు, ప్రీ-ఇంజనీరింగ్ భవన నిర్మాణాల స్ట్రక్చర్‌ల ఎగ్జిబిష‌న్ కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఎంఈఐఎల్‌ హైడ్రోకార్బన్స్ విభాగం సంస్థలైన‌ డ్రిల్‌మెక్ ఎస్‌పిఏ (Drillmec SpA), పెట్రోవెన్ ఎస్‌పిఏ (Petreven SpA) రిగ్ తయారీ, సర్వీసింగ్‌లో ప్ర‌పంచ‌స్థాయి నాణ్య‌తా ప్ర‌మాణాలు, వాటి సామ‌ర్థ్యాలు, బ‌లాల‌ను కూడా స‌ద‌స్సుకు హాజ‌రైన‌వారి దృష్టిని ఆక‌ర్షించాయి. డ్రిల్‌మెక్ ఎస్‌పిఏ,పెట్రెవెన్ సామర్థ్యాలు ఇన్-ట్రెండ్‌కు ఎలా సరిపోతాయి,ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ కార్యకలాపాలకు సంబంధించిన సందేహాలు, ప్ర‌శ్న‌ల‌కు సంబంధించి ఫలవంతమైన చర్చ జరిగింది.

మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ (MCGDPL), 80 సిఎన్జీ(CNG) స్టేషన్‌లతో భారతదేశపు రెండవ అతిపెద్ద సిజిడి (CGD) కంపెనీగా కొన‌సాగుతోంది. దేశంలోని 22 భౌగోళిక ప్రాంతాలలో పది రాష్ట్రాల్లో మేఘా గ్యాస్ సేవ‌లు విస్త‌రించాయి. ఒలెక్ట్రా త‌యారు చేసిన ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు 90,000 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించ‌డం సాధ్య‌మైంది. 13 రాష్ట్రాలలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఈ -బ‌స్సులు రోడ్ల‌పై ప్ర‌యాణిస్తున్నాయి.