Ola S1 Air Electric Scooter: ఓలా బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభం ఆ రోజే!-ola s1 air electric scooters payment window bookings may start on february 9 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola S1 Air Electric Scooter: ఓలా బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభం ఆ రోజే!

Ola S1 Air Electric Scooter: ఓలా బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభం ఆ రోజే!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 06, 2023 03:51 PM IST

Ola S1 Air Electric Scooter: ఓలా ఎస్1 ఎయిర్ గురించి ముఖ్యమైన ప్రకటన రానుంది. ఈవెంట్ తేదీని ఓలా ఫిక్స్ చేసింది. పూర్తి వివరాలివే..

Ola S1 Air Electric Scooter: ఓలా బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభం ఆ రోజే!
Ola S1 Air Electric Scooter: ఓలా బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభం ఆ రోజే!

Ola S1 Air Electric Scooter: తదుపరి ఈవెంట్ కోసం ప్రముఖ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) సిద్ధమవుతోంది. ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఈవెంట్ మొదలుకానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో భవీష్ అగర్వాల్ (Ola Electric CEO Bhavish Aggarwal) అధికారికంగా వెల్లడించారు. ఓ ముఖ్యమైన ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. “చేంజ్, ఇట్ ఈజ్ ఇన్ ది ఎయిర్” (Change, it’s in the Air) అని పేర్కొంది. దీంతో ఈ అనౌన్స్‌మెంట్ ఓలా ఎస్1 ఎయిర్ గురించే అని తెలుస్తోంది. ఓలా ఎస్1 ఎయిర్ గతేడాది ఆగస్టులో లాంచ్ చేయగా.. అప్పటి నుంచి రిజర్వ్ మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పుడు బుకింగ్‍లకు ఈ బడ్జెట్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఓలా ప్లాన్ చేసుకుందని సమాచారం. పూర్తి వివరాలు ఇవే.

బుకింగ్ ఓపెన్!

Ola S1 Air Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‍లో ఓలా ఎస్1 ఎయిర్ చౌకైన స్కూటర్‌గా ఉంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.84,999గా ఉంది. రూ.999 చెల్లించి రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈనెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈవెంట్ ద్వారా ఓలా ఎస్1 ఎయిర్ బుకింగ్‍లను ఓలా ప్రారంభించే అవకాశం ఉంది. ఇది మొదలైతే, ఇప్పటికే రిజర్వ్ చేసుకున్న వారికి పేమెంట్ విండో ఓపెన్ అవుతుంది. పేమెంట్ చేసి వారు స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. అలాగే రిజర్వ్ చేసుకోని వారికి కూడా బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఓలా ఎస్1 ఎయిర్ స్పెసిఫికేషన్లు

Ola S1 Air Electric Scooter Specifications: ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.5 కిలోవాట్ హవర్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఎకో మోడ్‍లో 101 కిలోమీటర్ల వరకు ఈ స్కూటర్‌పై ప్రయాణించేలా రేంజ్ ఉంటుందని ఓలా పేర్కొంది. టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్ల (85 kmph) వేగం ఉంటుంది. 0 నుంచి 40 kmph వేగానికి ఈ స్కూటర్ 4.3 సెకన్లలోనే యాక్సలరేట్ అవుతుంది.

7 ఇంచుల టచ్ స్క్రీన్, జీపీఎస్, బ్లూటూత్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ ప్లే బ్యాక్ లాంటి మరిన్ని ఫీచర్లు ఉంటాయి. ఎకో, నార్మల్, స్పోర్ట్స్ రైడింగ్ మోడ్‍లతో ఓలా ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది.

ఇప్పటికే ఓలా స్కూటర్లు వాడుతున్న వారికి ఇటీవల రెండు సబ్‍స్క్రిప్షన్ ప్లాన్‍లను ఆ సంస్థ ఇటీవల తీసుకొచ్చింది. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కోసం ఓలా కేర్, ఓలా కేర్+ పేరుతో ఈ ప్లాన్‍లు ఉన్నాయి. ఈ ప్లాన్‍ల ధరలు రూ.1,999, రూ.2,999గా ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం