Ola care subscription plans : ఓలా కేర్​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్ లాంచ్​.. లాభాలెన్నో!-ola electric launches ola care subscription plans for customers check all details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Care Subscription Plans : ఓలా కేర్​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్ లాంచ్​.. లాభాలెన్నో!

Ola care subscription plans : ఓలా కేర్​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్ లాంచ్​.. లాభాలెన్నో!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 29, 2023 01:53 PM IST

Ola care subscription plans : కేర్​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​లను లాంచ్​ చేసింది ఓలా. వాటి ఫీచర్స్​, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఓలా కస్టమర్ల కోసం ప్రత్యేక సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​!
ఓలా కస్టమర్ల కోసం ప్రత్యేక సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​!

Ola care subscription plans : కస్టమర్ల కోసం రెండు కొత్త సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​ను ప్రకటించింది ఓలా ఎలక్ట్రిక్​. అవి ఓలా కేర్​, ఓలా కేర్​+. వీటి ధరలు వరుసగా రూ. 1,999- రూ. 2,999గా ఉన్నాయి. అంతేకాకుండా.. మరికొన్ని రోజుల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో 200కుపైగా ఎక్స్​పీరియన్స్​ సెంటర్​లను ఓపెన్​ చేసేందుకు ప్రణాళికలు రచించింది. రానున్న రోజుల్లో కొత్త కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఓలా కేర్​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​..

ఈ ఓలా కేర్​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​తో ఎన్నో ఉపయోగాలు ఉన్నట్టు సంస్థ చెబుతోంది. సర్వీసింగ్​ సమయంలో ఫ్రీ లేబర్​ కాస్ట్​, థెఫ్ట్​ అసిస్టెన్స్​ హెల్ప్​లైన్​, రోడ్​సైడ్​- పంచర్​ అసిస్టెన్స్​ వంటి వెసులుబాట్లు ఇస్తోంది.

Ola care subscription plan prices : ఇక ఓలా కేర్​+లో.. ఓలా కేర్​తో పాటు యాన్యువల్​ కాంప్రిహెన్సివ్​ డైగ్నాస్టిక్​, ఫ్రీ హోం సర్వీస్​, పికప్​/ డ్రాప్​, ఫ్రీ కన్జ్యూమబుల్స్​, 24/7 డాక్టర్​ అండ్​ అంబులెన్స్​ సర్వీసులు అదనంగా లభిస్తుండటం విశేషం.

ప్రస్తుతం.. దేశంలోని 600కుపైగా నగరాల్లో సర్వీస్​ వ్యాన్స్​, ఫిజికల్​ స్టోర్స్​ను నడుపుతోంది ఓలా. వీటి ద్వారా.. కస్టమర్లకు సర్వీసులను వేగంగా అందిస్తోంది. కొన్ని కొన్నిసార్లు.. ఒక రోజులోపే కస్టమర్ల సమస్యలు, సర్వీసు కార్యకలాపాలు పూర్తవుతున్నట్టు ఓలా చెబుతోంది.

Ola care subscription plan in India : "మాది కస్టమర్ సెంట్రింగ్​ బ్రాండ్​. అందుకే.. సర్వీసు అనేది మా టాప్​ ప్రయారిటీ. ఈ క్రమంలోనే ఓలా కేర్​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​ తీసుకొచ్చాము. ది బెస్ట్​ సర్వీసులు అందించేందుకు కృషిచేస్తున్నాము." అని ఓలా ఎలక్ట్రిక్​ చీఫ్​ మార్కెటింగ్​ ఆఫీసర్​ అన్షుల్​ ఖండేల్వాల్​ తెలిపారు.

ఓలా ఎలక్ట్రిక్​కు సంబంధించిన రెండు స్కూటర్​లు ప్రస్తుతం మార్కెట్​లో ఉన్నాయి. అవి ఓలా ఎస్​1, ఎస్​1 ప్రో. ఎస్​1 ఎయిర్​ను లాంచ్​ చేసింది. 2023 ఏప్రిల్​లో వీటి డెలివరీలు మొదలవ్వొచ్చు. వీటితో పాటు ఆరు కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్స్​పై ఓలా పనిచేస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం