Ola Electric Scooters: అమ్మకాల్లో అదరగొట్టిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. కొత్త రికార్డు-ola electric sold 25000 electric scooter in december 2022 market share also grew ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Scooters: అమ్మకాల్లో అదరగొట్టిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. కొత్త రికార్డు

Ola Electric Scooters: అమ్మకాల్లో అదరగొట్టిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. కొత్త రికార్డు

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 03, 2023 04:15 PM IST

Ola Electric Scooters Sales: 2022 డిసెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ పెరిగాయి. ఆ కంపెనీ మార్కెట్ షేర్ కూడా అధికమైంది.

Ola Electric Scooters: అమ్మకాల్లో అదరగొట్టిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు
Ola Electric Scooters: అమ్మకాల్లో అదరగొట్టిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు

Ola Electric Scooters Sales: 2022 సంవత్సరాన్ని ఓలా ఎలక్ట్రిక్ అద్భుతంగా ముగించింది. డిసెంబర్ నెలలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ గణనీయంగా పెరిగాయి. మార్కెట్ షేర్ కూడా అధికమైంది. డిసెంబర్ నెలలో మొత్తంగా 25 వేలకు పైగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. దీంతో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‍లో ఓలా 30శాతం వాటాను దక్కించుకుంది. ఒకే నెలలో 25వేల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడవడం ఇదే తొలిసారి. ఇది ఓలా ఎలక్ట్రిక్‍కు కొత్త రికార్డుగా ఉంది. దీనిపై ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ స్పందించారు.

2023లో మరింత భారీగా..

Ola Electric Scooters Sales: తమ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ పెరగడంపై ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మరింత భారీగా ఉంటుందని ట్వీట్ చేశారు. “ ఎ డిసెంబర్ టు రిమెంబర్ (ఎప్పటికీ గుర్తుంచువాల్సిన డిసెంబర్)!. మేం 25,000 స్కూటర్లను విక్రయించాం. మా మార్కెట్ షేర్ 30 శాతానికి పెరిగింది. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం దూసుకెళుతోంది. 2023లో మరింత ఎక్కువగా ఉండనుంది. వృద్ధి చెందడం, ముందుసాగడమే ఉంటుంది” భవీశ్ అగర్వాల్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ నుంచి మూడు స్కూటర్లు భారత మార్కెట్‍లో లభిస్తున్నాయి. ఓలా ఎస్1 (Ola S1) , ఓలా ఎస్1 ప్రో(Ola S1 Pro), ఓలా ఎస్1 ఎయర్ (Ola S1 Air) మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. గతేడాది ఓలా ఎస్1 ఎయిర్ లాంచ్ అయింది. ఓలా ఎస్1 ధర రూ.99,999, ఓలా ఎస్1 ప్రో ధర రూ.1,39,999గా ఉంది. రూ.84,999 ధరతో ఎస్1 ఎయిర్ అడుగుపెట్టింది.

ఎక్స్‌పీరియన్స్ సెంటర్లపై ఫోకస్

మరోవైపు ఆన్‍లైన్‍తో పాటు ఆఫ్‍లైన్‍ సేల్స్ మీద కూడా ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల దృష్టి సారించింది. అందుకే ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల (Ola Experience Centers) సంఖ్యను క్రమంగా పెంచుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఉండగా.. ఈ ఏడాదిలో మరో 200 ఏర్పాటు చేయాలని ఓలా ఎలక్ట్రిక్ ప్లాన్ చేసుకుంటుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో స్కూటర్లను టెస్ట్ రైడ్ చేయటంతో పాటు కొనుగోలు చేయవచ్చు. స్కూటర్ డెలివరీలు కూడా వెంటనే చేస్తోంది ఓలా.

ఇటీవల ఓలా ఎస్‍1, ఓలా ఎస్1 ప్రో స్కూటర్లకు మూవ్ఓఎస్3 (MoveOS 3) అప్‍డేట్‍ను ఓలా రిలీజ్ చేసింది. ఈ అప్‍డేట్‍తో చాలా ఫీచర్లు ఈ స్కూటర్లకు యాడ్ అయ్యాయి.

మరోవైపు, 2023లో ఎలక్ట్రిక్ బైక్‍లను కూడా లాంచ్ చేసేందుకు ఓలా ప్లాన్ చేస్తోంది. 2024లో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్టు చెప్పింది.

Whats_app_banner

సంబంధిత కథనం