Ola Electric Bike: 2023లో ఓలా నుంచి ఎలక్ట్రిక్ బైక్‍లు, 2024లో కారు: వివరాలు వెల్లడించిన సీఈవో-ola electric to launch electric motorbikes in 2023 electric car in 2024 ceo bhavish aggarwal revealed ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Bike: 2023లో ఓలా నుంచి ఎలక్ట్రిక్ బైక్‍లు, 2024లో కారు: వివరాలు వెల్లడించిన సీఈవో

Ola Electric Bike: 2023లో ఓలా నుంచి ఎలక్ట్రిక్ బైక్‍లు, 2024లో కారు: వివరాలు వెల్లడించిన సీఈవో

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 29, 2022 12:15 PM IST

Ola Electric Bikes to launch in 2023: ఇంతకాలం ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చిన ఓలా.. ఇక ఎలక్ట్రిక్ బైక్‍లను లాంచ్ చేసేందుకు రెడీ అయింది. 2023లో విభిన్నమైన ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‍లను తీసుకొస్తామని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిశ్ అగర్వాల్ చెప్పారు. మరిన్ని వివరాలను వెల్లడించారు.

Ola Electric Bike: 2023లో ఓలా నుంచి ఎలక్ట్రిక్ బైక్, 2024లో కారు
Ola Electric Bike: 2023లో ఓలా నుంచి ఎలక్ట్రిక్ బైక్, 2024లో కారు (HT Auto)

Ola Electric Motorbikes to launch in 2023: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric Scooters) విభాగంలో ఓలా అదరగొడుతోంది. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో సేల్స్‌లో దూసుకెళుతుండగా.. ఈ ఏడాది ఓలా ఎస్1 ఎయిర్ కూడా లాంచ్ అయింది. ఇటీవల మూవ్ఓఎస్ 3 (MoveOS 3) సాఫ్ట్‌వేర్ అప్‍డేట్‍ను కూడా ఓలా రిలీజ్ చేసింది. ఇక వచ్చే ఏడాది 2023తో పాటు భవిష్యత్తు కోసం భారీ ప్లాన్ చేసుకుంది ఓలా ఎలక్ట్రిక్. ఈ విషయాలను ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిశ్ అగర్వాల్ (Bhavish Aggarwal) వెల్లడించారు. 2022లో సుమారు 1,50,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇండియాలో తమ కంపెనీ అమ్మిందని చెప్పారు. భవిష్యత్తులో తీసుకురానున్న ప్రొడక్టుల వివరాలను ప్రకటించారు.

ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు బైక్‍లు కూడా..

Ola electric Bikes: 2023లో చాలా లాంచ్‍లు ప్లాన్ చేసినట్టు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిశ్ అగర్వాల్ వెల్లడించారు. ఓ ఎలక్ట్రిక్ స్కూటర్, ఓ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‍తో పాటు ప్రీమియమ్ రేంజ్‍లోనూ మోటార్‌బైక్‍లను తీసుకురానున్నట్టు చెప్పారు. స్పోర్ట్స్, క్రూజర్, అడ్వెంచర్ లాంటి ఎలక్ట్రిక్ బైక్‍లను లాంచ్ చేస్తామని చెప్పారు. “భారీ సంఖ్యలో టూవీలర్‌లను తయారు చేస్తుండటంతో సప్లయ్ చైన్, సాఫ్ట్ వేర్, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీతో పాటు చాలా విభాగాల్లో మాకు చాలా అనుకూలతలు ఉన్నాయి. దీని ద్వారా మేం ఫోర్ వీలర్ విభాగంలోకి కూడా సులువుగా అడుగుపెట్టవచ్చు. పోటీపడేలా ఉండే ధరలతో కార్లను తీసుకువస్తాం” అని భవిశ్ చెప్పారు.

అప్పటికల్లా ఆరు కార్లు

Ola Electric Car: 2024లో తమ తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేస్తామని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిశ్ వెల్లడించారు. 2027 కల్లా ఆరు విభిన్నమైన ప్రొడక్టులను మార్కెట్‍లో ఉంచుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. 2023 చివరి కల్లా బ్యాటరీ తయారీ యూనిట్‍ను కూడా నెలకొల్పుతామని అన్నారు.

మూవ్ ఓఎస్03 అప్‍డేట్ వచ్చేసింది

MoveOS 3 Update for Ola Scooters: ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మూవ్ ఓఎస్03 అందుబాటుకి వచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్‍ను అప్‍డేట్ చేసుకుంటే చాలా కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. ప్రాగ్జిమిటీ అన్‍లాక్, హైపర్ చార్జింగ్, హిల్ హోల్డ్ కంట్రోల్, పార్టీ మోడ్, రైడింగ్ మూడ్స్, హైబర్‌నేషన్ మోడ్‍తో పాటు ఇంకా చాలా ఫీచర్లు ఈ కొత్త మూవ్ఓఎస్ 3లో ఉంటాయి. పిన్ ఎంటర్ చేయకుండా/ మొబైల్ అప్లికేషన్‍ను ఓపెన్ చేయకుండానే స్కూటర్‌ను అన్‍లాక్ చేసేందుకు ప్రాగ్జిమిటీ అన్‍లాక్ ఉపయోగపడుతుంది. లాగిన్ అయిన స్మార్ట్ ఫోన్‍ను బైక్ దగ్గరికి తీసుకెళితే చాలా అది అన్‍లాక్ అవుతుంది.

మూవ్ఓఎస్ 3 ఫీచర్ల గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

WhatsApp channel