తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే.. స్టాక్స్ టు బై లిస్ట్

Stocks to Buy Today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే.. స్టాక్స్ టు బై లిస్ట్

23 November 2022, 8:23 IST

    • Stocks to buy today November 23: ట్రేడర్లు నేడు కొనాల్సిన స్టాక్స్ లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. నేటి స్టాక్స్ టు బై లిస్ట్‌ను చూడండి.
Stocks to Buy Today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే
Stocks to Buy Today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే

Stocks to Buy Today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే

Stocks to buy today భారత ఈక్విటీ సూచీలు మంగళవారం (నవంబర్ 22) స్వల్ప లాభాలను చూశాయి. మూడు రోజుల నష్టాల తర్వాత కాస్త ఉపశమనం కలిగించాయి. ఐటీ, మెటల్, కంజప్షన్ స్టాక్‍లను కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపారు. దీంతో మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 274 పాయింట్లు పెరిగి.. 61,418.9 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 84.25 పాయింట్లు పెరిగి 18,244 పాయింట్ల వద్ద రోజును ముగించింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.48శాతం పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Gold and silver prices today : రూ. 66వేల దిగువకు పసిడి ధర- మరింత పడిన వెండి రేటు..

First Bajaj CNG motorcycle: బజాజ్ నుంచి తొలి సీఎన్జీ మోటార్ సైకిల్; జూన్ 18 న లాంచ్

Bajaj Pulsar NS400Z: 2024 పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను లాంచ్ చేసిన బజాజ్; ధర కూడా తక్కువే..

‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

SGX Nifty: ఎస్‌జీఎక్స్ నిఫ్టీ పాజిటివ్‍గా..

నేటి (నవంబర్ 23) విషయానికి వస్తే, ఎస్‍జీఎక్స్ నిఫ్టీ 60 పాయింట్ల లాభంలో ఉంది. దీంతో బుధవారం భారత మార్కెట్లు లాభాలతో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

“మార్కెట్లు షార్ట్ టర్మ్ దిగువ కరెక్షన్ వద్ద స్థిరపడినట్టు కనిపిస్తున్నాయి. కనిష్ఠాల నుంచి మళ్లీ అప్‍సైడ్‍కు కదలడం మొదలుపెట్టాయి. ఒకవేళ నిఫ్టీ మళ్లీ 18,450 పాయింట్లకు చేరుకుంటే.. రూ.18,600+ లెవెల్స్ కు ఎగబాకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నిఫ్టీకి ఇమిడియేట్ సపోర్ట్ 18,100 పాయింట్ల వద్ద ఉంది” అని హెచ్‍డీఎఫ్‍సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి చెప్పారు.

Stocks to Buy Today: నేటి స్టాక్స్ టు బై లిస్ట్ ఇదే

టాటా మోటార్స్ : ప్రస్తుత మార్కెట్ ధరకు కొనండి (బై కరెంట్ మార్కెట్ ప్రైజ్), స్టాప్ లాస్ రూ.412, టార్గెట్ రూ.440

ఎస్‍బీఐ: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ.578, టార్గెట్ రూ.620

శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫిన్: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్: రూ.1,300, టార్గెట్ రూ.1,400-రూ.1,425

ఎన్‍టీపీసీ: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్: రూ.164, టార్గెట్: రూ.171 - రూ.174

అమరరాజ్ బ్యాటరీస్: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్: రూ.635 , టార్గెట్: రూ.657

గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ : బై కరెంట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ.834, టార్గెట్: రూ.856

(గమనిక:- ఇవి నిపుణులు తెలిపిన అభిప్రాయలు మాత్రమే. ఇది సమాచారం, అవగాహన కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం, రీసెర్చ్ చేయడం శ్రేయస్కరం.)​