తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 6 స్టాక్స్! డే ట్రేడింగ్ గైడ్ ఇదే

Stocks to Buy today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 6 స్టాక్స్! డే ట్రేడింగ్ గైడ్ ఇదే

01 December 2022, 7:50 IST

    • Day Trading guide for today: ట్రేడర్లు నేడు ఈ 6 స్టాక్స్ పై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. నేటి స్టాక్స్ టు బై లిస్ట్ ఇదే.
Stocks to Buy today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 6 స్టాక్స్..
Stocks to Buy today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 6 స్టాక్స్..

Stocks to Buy today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 6 స్టాక్స్..

Day Trading guide for today: భారత స్టాక్ మార్కెట్‍లు దూసుకెళుతున్నాయి. ఈక్విటీ సూచీలు కొత్త రికార్డులను చూస్తున్నాయి. బుధవారం సెషన్‍లోనూ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 140.30 పాయింట్లు బలపడి 18,758.35 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 417.81 పాయింట్ల లాభంతో 63వేల మార్కును తొలిసారి దాటింది. మొత్తంగా నవంబర్ లో నిఫ్టీ 4శాతం పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

స్టాక్ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, మిర్రర్ అప్పర్ షాడోతో డైలీ చార్టుపై లాంగ్ బుల్ క్యాండిల్ ఏర్పడింది. దీంతో మార్కెట్లు మరింత పైకి వెళతాయని టెక్నికల్‍గా అంచనా వేస్తున్నారు. గత రెండు సెషన్లలో సూచీలు బలంగా కొనసాగాయి . ఇది మార్కెట్‍కు పాజిటివ్‍గా ఉంది.

పడితే ముఖ్యమైన సపోర్ట్ ఇదే..

Day Trading guide for today: “ డైలీచార్ట్ పై పాజిటివ్ ప్యాటర్న్ ఉంది. సుమారు 18,800 టాప్ లెవెల్స్ కు చేరువలో గరిష్ఠం వద్ద ఉన్నా.. ఇంకా రివర్సల్ ప్యాటర్న్ సూచనలు ఏవీ లేవు. నిఫ్టీకి తక్షణ సపోర్ట్ 18,680 వద్ద ఉంది. అప్‍సైడ్ టార్గెట్ 18950-19000 గా కొనసాగుతోంది” అని హెచ్‍డీఎఫ్‍సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి విశ్లేషించారు.

Day Trading guide for today: ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ (Bank Nifty) 43,350 లెవెల్స్ ను కాపాడుకోగలిగితే.. 43,500, 43,700 లెవెల్స్ వరకు చేరగలదని యాక్సిస్ సెక్యూరిటీస్ టెక్నికల్, డెరివేటివ్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ పాల్వియా అంచనా వేశారు. కిందికి వస్తే బ్యాంక్ నిఫ్టీకి 43,150 వద్ద ముఖ్యమైన సపోర్ట్ ఉందని విశ్లేషించారు.

ఎస్‍జీఎక్స్ నిఫ్టీ

ఎస్‍జీఎక్స్ నిఫ్టీని బట్టి చూస్తే.. భారత స్టాక్ మార్కెట్లు గురువారం (డిసెంబర్ 1) కూడా లాభాలతో మొదలయ్యేలా కనిపిస్తోంది. ఉదయం.. ఎజ్‍జీఎక్స్ నిఫ్టీ 70పాయింట్లపైగా గ్రీన్‍లో ఉంది.

Day Trading Stocks for Today: నేటి స్టాక్స్ టు బై లిస్ట్

యూపీఎల్: ప్రస్తుత మార్కెట్ ప్రైజ్‍కు కొనాలి (బై కరెంట్ మార్కెట్ ప్రైజ్), టార్గెట్: రూ.810, రూ.820 స్టాప్ లాస్: రూ.775.

టాటా కన్జ్యూమర్స్: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, టార్గెట్: రూ.835, రూ.850, స్టాప్ లాస్: రూ.804

సుజ్‍లోని ఎనర్జీ: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, టార్గెట్: రూ.12, స్టాప్ లాస్: రూ.8

డిష్ టీవీ: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, టార్గెట్: రూ.24, స్టాప్ లాస్: రూ.17.50

ఎన్‍టీపీసీ: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, టార్గెట్: రూ.182, స్టాప్ లాస్: రూ.165

టాటా మోటార్స్: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, టార్గెట్: రూ.455, స్టాప్ లాస్: రూ.432

(గమనిక:- ఇవి నిపుణులు తెలిపిన అభిప్రాయలు మాత్రమే. ఇది సమాచారం, అవగాహన కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం, రీసెర్చ్ చేయడం శ్రేయస్కరం.)​