తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Day Trading Stocks Today: డే ట్రేడింగ్ స్టాక్స్: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 8 స్టాక్‍లు ఇవే

Day Trading Stocks Today: డే ట్రేడింగ్ స్టాక్స్: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 8 స్టాక్‍లు ఇవే

15 March 2023, 7:49 IST

    • Day Trading Stocks Today: నిపుణుల సూచనల ప్రకారం, ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ టు ట్రేడ్ లిస్ట్ ఇక్కడ చూడండి. అలాగే మార్కెట్లు నేడు ఎలా మొదలయ్యే అవకాశం ఉందంటే..
స్టాక్స్​ టు బై లిస్ట్​
స్టాక్స్​ టు బై లిస్ట్​

స్టాక్స్​ టు బై లిస్ట్​

Day Trading Guide for Today: అంతర్జాతీయ ప్రతికూలతలతో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగు సెషన్లలో నష్టాలను మూటగట్టుకున్నాయి. మంగవారం సెషన్‍లో ఎన్ఎస్ఈ నిఫ్టీ 111 పాయింట్ల నష్టపోయి 17,043 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 337.66 పాయింట్లు క్షీణించి 57,900 వద్ద స్థిరపడింది. అయితే మంగళవారం సెషన్‍లో అమెరికా మార్కెట్లు లాభపడడం నేడు (మార్చి 15, బుధవారం) భారత మార్కెట్లకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. నేడు సూచీలు ఎలా షురూ అయ్యే ఛాన్స్ ఉంది, ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ టు ట్రేడ్ లిస్టును ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Gold and silver prices today : రూ. 66వేల దిగువకు పసిడి ధర- మరింత పడిన వెండి రేటు..

First Bajaj CNG motorcycle: బజాజ్ నుంచి తొలి సీఎన్జీ మోటార్ సైకిల్; జూన్ 18 న లాంచ్

Bajaj Pulsar NS400Z: 2024 పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను లాంచ్ చేసిన బజాజ్; ధర కూడా తక్కువే..

‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

సానుకూలమే!

Stock Market Today: ఎస్‍జీఎక్స్ నిఫ్టీతో పాటు అంతర్జాతీయ మార్కెట్లను బట్టి చూస్తే నేడు భారత స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్‍జీఎక్స్ నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో ఉంది. మంగళవారం సెషన్‍లో అమెరికా మార్కెట్లు లాభపడ్డాయి.

నిఫ్టీ ముఖ్యమైన లెవెల్స్

Day Trading Guide for Today: నిఫ్టీ ప్రస్తుతం ఓవర్ సోల్డ్ జోన్‍లో ఉందని, 16,950 - 16,900 వద్ద బలమైన సపోర్ట్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. “షార్ట్ టర్మ్‌లో నిఫ్టీ బలహీనంగానే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఓవర్ సోల్డ్ జోన్‍లో ఉండటంతో 17,000 - 16,800 లెవెల్స్ మధ్య మళ్లీ నిఫ్టీ పెరిగే అవకాశం ఉంది. నిఫ్టీ పెరిగితే తక్షణ రెసిస్టెన్స్ 17,250 లెవెల్స్ వద్ద ఉంది” అని హెచ్‍డీఎఫ్‍సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి విశ్లేషించారు.

Day Trading Stocks: ట్రేడర్లు నేడు గమనించాల్సిన స్టాక్స్ ఇవే

  • యునైటెడ్ స్పిరిట్: బై అట్ రూ.769, టార్గెట్: రూ.790, స్టాప్ లాస్: రూ.755
  • ఎం&ఎం ఫైనాన్షియల్స్: బై అట్ రూ.243, టార్గెట్: రూ.254, స్టాప్ లాస్: రూ.234
  • టైటాన్: బై అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ (సీఎంపీ), టార్గెట్: రూ.2,450, స్టాప్ లాస్: రూ.2,290
  • బీపీసీఎల్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.345, స్టాప్ లాస్: రూ.309
  • కోల్ ఇండియా: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.233, స్టాప్ లాస్: రూ.213
  • కాన్‍కర్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.600 నుంచి రూ.610, స్టాప్ లాస్: రూ.575
  • ఇండియన్ హోటల్: బై అట్ రూ.315, టార్గెట్: రూ.325, స్టాప్ లాస్: రూ.310
  • కమిన్స్: బై అట్ రూ.1,682, టార్గెట్: రూ.1,717, స్టాప్ లాస్: రూ.1,655

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)