తెలుగు న్యూస్  /  Business  /  Coca-cola Branded Smartphone Launching In India Soon. Will You Buy It?

Coca-Cola smartphones!: త్వరలో భారత్ లోకి కొకా కోలా స్మార్ట్ ఫోన్?

HT Telugu Desk HT Telugu

27 January 2023, 22:50 IST

  • Coca-Cola smartphones!: ప్రముఖ బేవరేజెస్ సంస్థ కొకా కోలా (Coca-Cola) స్మార్ట్ ఫోన్స్ విభాగంలోకి వస్తోందా? అంటే, అవుననే అంటున్నాడు టిప్ స్టర్ ముకుల్ శర్మ.

కొకా కోలా స్మార్ట్ ఫోన్ ఇదేనా?
కొకా కోలా స్మార్ట్ ఫోన్ ఇదేనా? (Twitter/Mukul Sharma)

కొకా కోలా స్మార్ట్ ఫోన్ ఇదేనా?

Coca-Cola smartphones!: ప్రముఖ సాఫ్ట్ వేర్ బ్రాండ్ కొకా కోలా (Coca-Cola) త్వరలో స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ను భారత్ లో ప్రవేశ పెట్టనుందా? అన్న ప్రశ్నకు అవునని చెబుతూ, రుజువుగా ఒక ఫొటోను కూడా ముకుల్ శర్మ తన ట్విటర్ లో షేర్ చేశారు. భారత్ లో కొకా కోలా (Coca-Cola) స్మార్ట్ ఫోన్ ను ఈ మార్చి నెలలో లాంచ్ చేయనున్నారని వెల్లడించారు. ఇందు కోసం ఒక స్మార్ట్ ఫోన్ మ్యానుఫాక్చరర్ తో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. అయితే, ఈ విషయమై కొకా కోలా (Coca-Cola) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Coca-Cola smartphones!: కొకా కోలా..

కొకా కోలా (Coca-Cola) నుంచి వస్తున్న స్మార్ట్ ఫోన్ ఫోటోను కూడా ముకుల్ శర్మ షేర్ చేశారు. డ్యుయల్ కెమెరా సెటప్ తో కొకాకోలా (Coca-Cola) సిగ్నేచర్ కలర్ రెడ్ లో, నిలువుగా కొకా కోలా (Coca-Cola) పేరుతో వెనుకవైపు కనిపిస్తూ ఉన్న ఫోటోను ఆయన షేర్ చేశారు. అయితే, అది గత సంవత్సరం నవంబర్ నెలలో భారత్ లో లాంచ్ అయిన రియల్ మి 10 4 జీ అని తెలుస్తోంది.

Coca-Cola smartphones!: గతంలో కూడా..

వేరే విభాగంలో మార్కెట్లో లీడర్ గా ఉన్న సంస్థ.. పూర్తిగా కొత్తదైన మరో విభాగం మార్కెట్ లోకి ప్రవేశించడం అసాధారణమే కానీ కొత్త కాదు. గతంలో స్మార్ట్ ఫోన్స్ మ్యాన్యుఫాక్చర్స్ అయిన వన్ ప్లస్ (OnePlus), ఒప్పొ (Oppo) కూడా మెక్ లారెన్ ఎడిషన్ (McLaren edition) అని, ఎవెంజర్స్ ఎడిషన్ (Avengers Edition) అని స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్లోకి విడుదల చేసి విజయవంతమయ్యాయి.

టాపిక్