తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Investment Plans : అధిక రాబడి,తక్కువ రిస్క్- బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే!

Best Investment Plans : అధిక రాబడి,తక్కువ రిస్క్- బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే!

23 July 2024, 13:49 IST

google News
    • Best Investment Plans : మీరు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే భారతదేశంలోని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పథకాలను మీకు తెలియజేస్తున్నాం. వీటిల్లో రాబడితో పాటు రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుంది.
అధిక రాబడి,తక్కువ రిస్క్- బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే!
అధిక రాబడి,తక్కువ రిస్క్- బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే!

అధిక రాబడి,తక్కువ రిస్క్- బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే!

Best Investment Plans : మీరు ఆర్థికంగా బలపడేందుకు నిర్ణయించుకుంటే... పెట్టుబడి పెట్టడం చక్కటి నిర్ణయం. అయితే ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక స్థిరత్వంతో భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునేందుకు రాబడి వచ్చే పెట్టుబడి అంశాలను ఎంచుకోవాలి. భారతదేశంలో పెట్టుబడి ఎంపికలు చాలా పుష్కలంగా ఉన్నాయి . మీరు ఆర్థిక స్థిరత్వాన్ని పొందేందుకు ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఉపయోగపడతాయి. ఇవి ప్రధానంగా మూడు రకాలు. తక్కువ రిస్క్ పెట్టుబడులు, మీడియం రిస్క్ పెట్టుబడులు, హై రిస్క్ పెట్టుబడులు.

తక్కువ రిస్క్ పెట్టుబడులు

లో రిస్క్ పెట్టుబడి పథకాల్లో పెట్టుబడిదారులకు రిస్క్ టాలరెన్స్ తక్కువగా ఉంటుంది. పెట్టుబడిదారుడు తన ఇన్వెస్ట్మెంట్ కు ఎలాంటి రిస్క్ లేకుండా ఉండేందుకు ఈ పథకాలు ఎంచుకోవచ్చు. పదవీ విరమణ చేసినవారు, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేనివాళ్లు ఈ స్కీమ్స్ ను ఎంచుకుంటారు. ఈ పెట్టుబడుల నుంచి రాబడి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది.

  • ఫిక్స్ డ్ డిపాజిట్లు - ఇందులో పెట్టుబడికి ఢోకా ఉండదు. నిర్ణీత కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు. వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల ద్వారా అధిక రాబడిని పొందవచ్చు . మీ ఫండ్స్ ఎల్లప్పుడూ భద్రంగా ఉంటాయి. మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం మీ పెట్టుబడులపై ఉండదు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌ లో ప్రిన్సిపల్ అమౌంట్ విలువ తగ్గదు.
  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ ప్రభుత్వ-ఆధారిత పెట్టుబడి ఎంపిక. ఇందులో రిస్క్ లేకుండా రాబడి వస్తుంది. ఇది ఉత్తమ పెట్టుబడి ఎంపికలలో ఒకటి. ఈ పథకాలపై వడ్డీని ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సవరించి చెల్లిస్తుంది.
  • మనీ మార్కెట్ ఫండ్స్ - మనీ మార్కెట్ ఫండ్స్ షార్ట్ టర్మ్ రుణ నిధులు. హైలెవల్ లిక్విడిటీని కొనసాగిస్తూ ఒక సంవత్సరం వరకు మంచి రాబడిని అందించడానికి ఈ పథకాలు ఉపయోగపడతాయి. మనీ మార్కెట్ ఫండ్ సగటు మెచ్యూరిటీ ఒక సంవత్సరం.
  • మున్సిపల్ బాండ్ - మున్సిపల్ బాండ్ దేశంలోని మున్సిపల్ కార్పొరేషన్లు లేదా అనుబంధ సంస్థలు జారీ చేసే రుణ బాండ్లు. స్థానిక ప్రభుత్వ సంస్థలు ఈ బాండ్ల ద్వారా సేకరించిన నిధులను వంతెనలు, పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించడం, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి ఉయోగిస్తారు.
  • సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ - డిపాజిట్ సర్టిఫికేట్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు అందించే ప్రీ మెచ్యూర్ రిడెంప్షన్ టర్మ్ డిపాజిట్. డిపాజిట్ సర్టిఫికేట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ మధ్య ఉన్న తేడా ఏమిటంటే, డిపాజిట్ సర్టిఫికేట్ ను ఎప్పుడైనా రిడెంప్షన్ చేసుకోవచ్చు.
  • ట్రెజరీ బిల్లులు - 365 రోజుల వరకు నిధులను సేకరించేందుకు భారత ప్రభుత్వం ట్రెజరీ బిల్లులను జారీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వీటిని జారీ చేస్తుంది కాబట్టి సురక్షితంగా పరిగణించవచ్చు. అయితే ట్రెజరీ బిల్లుల నుంచి తక్కువ రాబడి వస్తుంది. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ కంటే ట్రెజరీ బిల్లులపై రాబడి తక్కువగా ఉంటుంది.

మీడియం రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్

పెట్టుబడిదారులు కాస్త రిస్క్ తీసుకునే ఆలోచన ఉంటే మీడియం రిస్క్ పెట్టుబడి పథకాలు సౌకర్యంగా ఉంటాయి. లో రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్‌లతో పోల్చినప్పుడు మీడియం రిస్క్ పథకాల్లో రాబడి ఎక్కువగా ఉంటుంది.

  • బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్ - బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్స్ మన దేశంలోని ఉత్తమ పెట్టుబడి మార్గం. మార్కెట్ రిస్క్ లు సైతం అదే స్థాయిలో ఉంటాయి. మీరు రిస్క్ తక్కువగా ఉండి అధిక రాబడిని పొందాలనుకున్నప్పుడు ఫిక్స్ డ్ ఇన్ కమ్ మ్యూచువల్ ఫండ్ లేదా నెలవారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఉత్తమ పెట్టుబడి మార్గం.
  • రుణ నిధులు - డెబిట్ ఫండ్స్ అంటే బాండ్లు, ట్రెజరీ బిల్లులు వంటి స్థిర ఆదాయ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్. ఈ నెలవారీ ఆదాయ ప్రణాళికలు కొంత లాక్-ఇన్ మనీ హామీ ఇస్తాయి. హై రిస్క్ పెట్టుబడులతో పోలిస్తే వీటిల్లో కాస్త తక్కువ రిస్క్ తో రాబడి ఉంటుంది.
  • డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ - ఈ స్టాక్స్ ...స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఒక అద్భుతమైన మార్గం. వీటిని హై ఈల్డ్ బాండ్లు లేదా బ్లూ చిప్ బాండ్లు అని పిలుస్తారు. ఈ డివిడెండ్ పేయింగ్ స్టాక్‌లు పెట్టుబడిదారులకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి ఒక మార్గాన్ని అందిస్తాయి. వీటిని మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ వంటి సంస్థలు కొనుగోలు చేసే అవకాశం ఉంటాయి.
  • ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్- ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌ ఇవీ స్టాక్ లాగా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో వ్యాపారం చేసే సెక్యూరిటీల బాస్కెట్‌గా పిలుస్తారు. ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్‌లను ఆర్థిక వనరులను సేకరించడానికి, షేర్లు బాండ్లు, డెరివేటివ్‌ల వంటి రుణ సెక్యూరిటీల ట్రేడబుల్ ద్రవ్య ఆస్తులను కొనుగోలకు ఉపయోగిస్తాయి. చాలా ETFలు సెబీలో రిజిస్టర్ అయ్యి ఉంటాయి.
  • కార్పొరేట్ బాండ్లు - కార్పొరేట్ బాండ్ ఫండ్ లో మొత్తం ఆర్థిక వనరులలో 80 శాతం కంటే ఎక్కువ కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్. వ్యాపార సంస్థలు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ప్రకటనలు, బీమా ప్రీమియం చెల్లింపులు మొదలైన వాటి కోసం వీటిని విక్రయిస్తాయి. బ్యాంకు రుణాల కంటే తక్కువ వ్యయాలు అవసరమైనప్పుడు కార్పొరేట్ బాండ్ ఫండ్‌లు ఉపయోగిస్తారు.

హై రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్

అధిక రిస్క్ పెట్టుబడికి కచ్చితంగా హామీ, రాబడి ఉండదు. సరైనా అవగాహనతో హై రిస్క్ పెట్టుబడులలో ఇన్వెస్ట్ చేస్తే సందేహం లేకుండా రాబడి ఉంటుంది. మార్కెట్ రిస్క్ అధికంగా ఉంటాయి. వస్తే రాబడి కూడా ఆ స్థాయిలోనో ఉంటుంది. లేకుండా పూర్తి నష్టాలు చూస్తారు. వీటిల్లో పెట్టుబడి పెట్టే ముందు సరైన అవగాహన తప్పనిసరి.

  • డైరెక్ట్ ఈక్విటీలు - లాంగ్ టర్మ్ ప్రయోజనాల కోసం డైరెక్ట్ ఈక్విటీలు ఉత్తమ పెట్టుబడి మార్గం. కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన చట్టపరమైన నిబంధనలకు కట్టుబడి ఉన్న కంపెనీ ఈక్విటీ షేర్. మీరు ఈక్విటీ షేర్‌ని కొనుగోలు చేస్తే ఆ కంపెనీ నిర్ణయం తీసుకోవడంలో పాలుపంచుకునేందుకు మీకు హక్కు లభిస్తుంది. కానీ రిస్క్ విషయానికి వస్తే ఈక్విటీలలో చాలా హైరిస్క్ ఉంటుంది.
  • ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ - ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ప్రధానంగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్. మీ డబ్బును స్టాక్‌లలో సిప్ ద్వారా కొద్దికొద్దిగా లేదా మొత్తంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో హై రిస్క్ ఉంటుంది. మార్కెట్‌లో నిపుణులైన వారు మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిది.
  • ఫారెక్స్ ట్రేడింగ్/ఫారిన్ ఎక్స్ఛేంజ్ - ఫారెక్స్ లేదా ఫారిన్ ఎక్స్ఛేంజ్ అంగీకరించిన ధరతో కరెన్సీలను మార్పిడి చేసే నెట్‌వర్క్‌. విదేశీ కరెన్సీ ట్రేడింగ్ అనేది వ్యక్తులు, సంస్థలు, కేంద్ర బ్యాంకులు ఒక కరెన్సీకి మరొక కరెన్సీని మార్చుకునే ప్రక్రియ ఇది.

Disclaimer : ఈ ఆర్టికల్ లోని సమాచారం కేవలం రీడర్ అవగాహన కోసం మాత్రమే. ఈ పెట్టుబడి పథకాల్లో హై రిస్క్ ఉంటుంది. పెట్టుబడి అంశాలపై నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం