Investment | 6 కామన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మిస్టేక్స్‌ ఇవే..-avoid these common investment mistakes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Avoid These Common Investment Mistakes

Investment | 6 కామన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మిస్టేక్స్‌ ఇవే..

Praveen Kumar Lenkala HT Telugu
Dec 28, 2021 04:46 PM IST

భవిష్యత్‌ అవసరాల కోసం రకరకాల సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాం. అయితే ఇందులో కొన్నిసార్లు అధిక రాబడుల కోసం ప్రయత్నించి కొన్ని తప్పిదాలు చేస్తుంటాం. ఇన్వెస్ట్‌మెంట్‌ చేసే సమయంలో చాలా మంది సాధారణంగా చేసే తప్పులు తెలుసుకోవడం వల్ల మీ డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయి.

ప్రతీకాత్మక చిత్రం: పెట్టుబడుల్లో పొరపాట్లు వద్దు
ప్రతీకాత్మక చిత్రం: పెట్టుబడుల్లో పొరపాట్లు వద్దు (unsplash)

Investment | సాధారణంగా చేసే ఇన్వెస్ట్‌మెంట్ మిస్టేక్స్ ఇవిగో..

1. పొదుపు కోసం బీమా పాలసీలు తీసుకోవడం..

చాలా మంది కేవలం పొదుపు కోసమే బీమా పాలసీలు తీసుకుంటారు. వాస్తవానికి జీవిత బీమా పాలసీని టర్మ్‌ ఇన్సూరెన్స్‌ రూపంలో తీసుకుంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ జీవిత బీమా పొందవచ్చు. నాన్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను పొదుపు పథకాలుగా చూడొద్దు. ఎందుకంటే ఇవి ఇచ్చే రాబడులు ఇతర పొదుపు సాధనాలతో పోల్చినా చాలా తక్కువగా ఉంటాయి.

2. రిస్క్‌ విస్మరించి రాబడులనే చూడడం..

కొన్నిసార్లు రాబడినే చూస్తాం. కానీ దాని వెనక ఉన్న రిస్క్‌ చూడం. ఎక్కడ పెట్టుబడి పెట్టినా అందులో ఉన్న రిస్క్‌ను గమనించాలి. ఓ స్టాక్‌ బాగా పెరిగిందని దానిని కొనడమో, ఒక ప్రాంతంలో బాగా రేట్లు పెరుగుతున్నాయని స్థలం కొనడమో చేయొద్దు. బాగా పరిశీలించి.. ఇంకా అక్కడ పెరుగుదలకు అవకాశం ఉందా లేదా చూడాలి. బాగా పెరిగిన స్టాక్‌ ఇంకా పెరుగుతుందని ఆశించడం సరైనది కాదు. ముఖ్యంగా స్టాక్‌మార్కెట్‌పై అవగాహన లేకుండా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్న పని. ప్రత్యామ్నాయంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం నయం.

3. సలహాలతో పెట్టుబడి పెట్టడం..

మీరు పెట్టుబడి పెట్టబోయే స్టాక్‌ లేదా స్థలం ఇంకా ఏదైనా వనరు కావొచ్చు. దానిపై మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఉచితంగా వచ్చే సలహాను గుడ్డిగా నమ్మితే నష్టం ఎదురుకావొచ్చు. అందుకే ఉచితంగా వచ్చే టిప్స్‌ను విస్మరించడమే మేలు.

4. ఒకేరకమైన పెట్టుబడి సాధనంలో ఇన్వెస్ట్‌ చేయడం..

కేవలం బంగారంలోనో, రియల్‌ ఎస్టేట్‌లోనో, స్టాక్‌మార్కెట్లోనో పెట్టుబడులు పెట్టడం కాకుండా.. విభిన్న పెట్టుబడి సాధనాలను ఎంచుకోవడం నష్టభయాలను తగ్గిస్తుంది. ఒకే పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోవద్దు.

5. ఆర్థిక ప్రణాళిక లేకపోవడం..

మీ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి కాలాన్ని, పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. పిల్లల చదువులకు, వివాహానికి, రిటైర్‌మెంట్‌కు, ఇంటి కొనుగోలుకు, కారు కొనుగోలుకు.. ఇలా విభిన్న రకాల అవసరాలకు విభిన్న రకాల పెట్టుబడి సాధనాలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక అవసరాల కోసం దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలు మేలు చేస్తాయి.

6. పన్ను మినహాయింపు కోసం పెట్టుబడులు పెట్టడం..

సెక్షన్‌ 80సీ కింద కేవలం రూ. 1,50,000 వరకు మాత్రమే పన్ను మినహాయింపు కోరవచ్చు. అలాగే ఎన్‌పీఎస్‌లో పొదుపు చేయడం ద్వారా 80సీసీడీ(1బీ) కింద మరో రూ. 50 వేల ఆదాయాన్ని పన్ను మినహాయింపు కోరవచ్చు. కానీ పన్ను మినహాయింపుల కోసమని అడ్డగోలుగా పాలసీలు కొనుగోలు చేయడం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయడం వంటి వాటి వల్ల మీ రాబడిపై ప్రభావం చూపుతుంది. 

పిల్లల స్కూలు ఫీజులు, పీఎఫ్‌ వంటివి పోగా, మిగిలిన పన్ను మినహాయింపు పరిమితిని పూర్తిచేసేందుకు ఈఎల్‌ఎస్‌ఎస్‌ వంటి మ్యూచువల్‌ ఫండ్స్‌ గానీ, గృహరుణం గానీ తీసుకోవచ్చు. 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియాన్ని మినహాయించుకోవచ్చు. ఆరోగ్య బీమా చాలా అవసరమైన రక్షణ కవచమైనందున ఈ పాలసీ తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. 

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్