తెలుగు న్యూస్  /  Business  /  Bajaj Pulsar P150 Launched Launched In India Know Price Specifications Colors Sale Details

Bajaj Pulsar P150 launched: నయా బజాజ్ పల్సర్ పీ150 వచ్చేసింది.. పూర్తి వివరాలివే

22 November 2022, 17:26 IST

    • Bajaj Pulsar P150 launched: బజాజ్ పల్సర్ పీ150 ఇండియా మార్కెట్‍లో లాంచ్ అయింది. స్టాండర్డ్ వెర్షన్‍కు ఇది అప్‍గ్రేడ్‍గా ఉంది. నయా లుక్‍తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ బైక్ ధర, స్పెసిఫికేషన్లతో పాటు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Bajaj Pulsar P150 launched: నయా బజాజ్ పల్సర్ పీ150 వచ్చేసింది.. పూర్తి వివరాలివే
Bajaj Pulsar P150 launched: నయా బజాజ్ పల్సర్ పీ150 వచ్చేసింది.. పూర్తి వివరాలివే (HT-Photo)

Bajaj Pulsar P150 launched: నయా బజాజ్ పల్సర్ పీ150 వచ్చేసింది.. పూర్తి వివరాలివే

Bajaj Pulsar P150 launched: ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న కొత్త జనరేషన్ పల్సర్ 150 మోడల్‍ను బజాజ్ ఆటో (Bajaj Auto) లాంచ్ చేసింది. బజాజ్ పల్సర్ పీ150 బైక్‍‍ను భారత మార్కెట్‍లోకి తీసుకొచ్చేసింది. సింగిల్ డిస్క్, డ్యుయల్ డిస్క్ వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. నయా లుక్‍లో బజాజ్ పల్సర్ పీ150 ఆకర్షణీయంగా ఉంది. మొత్తంగా 5 కలర్ వేరియంట్లలో లభించనుంది. రేసింగ్ రెడ్, కరీబియన్ బ్లూ, ఈబోనీ బ్లాక్ రెడ్, ఎబోనీ బ్లాక్ బ్లూ, ఎబోనీ బ్లాక్ వైట్ కలర్ ఆప్షన్‍లలో ఈ బైక్ వచ్చింది. Bajaj Pulsar P150 ధర, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

Bajaj Pulsar P150 Details: బజాజ్ పల్సర్ పీ150 వివరాలు

బజాజ్ పల్సర్ సింగిల్ డిస్క్ వేరియంట్.. సింగిల్ పీస్ సీట్‍తో, డబుల్ డిస్క్ వేరియంట్స్ స్ల్పిట్ సీట్ సెటప్‍తో వస్తున్నాయి. ముందు మోడల్స్ కంటే పల్సర్ పీ150 కొత్త డిజైన్‍తో మరింత స్పోర్టీ, షార్పర్ లుక్‍ను కలిగి ఉంది. సీట్‍కు తగట్టు ఫ్లో అయ్యే ఫ్యుయల్ ట్యాంక్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. మొత్తంగా ఈ నయా బజాజ్ పల్సర్ 150 స్టైలిష్‍గా ఉంది. ఈ బైక్ సీట్ ఎత్తు 790 మిల్లీమీటర్లుగా ఉంది.

149.48 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‍ను బజాజ్ పల్సర్ పీ150 కలిగి ఉంది. 8,500 ఆర్పీఎం వద్ద 14.5 హెచ్‍పీ పీక్ పవర్ ను, 6,000 ఆర్పీఎం వద్ద 13.5 Nm గరిష్ఠ టార్క్యూను ఇది జనరేట్ చేయగలదు. 5-స్పీడ్ గేర్ బాక్స్ తో ఈ బైక్ వస్తోంది. ఈ ఇంజిన్ ఎన్‍వీహెచ్ లెవెళ్లను బజాజ్ మెరుగుపరిచింది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లుగా ఉంటుంది. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్స్ సస్పెన్షన్‍ పని చేస్తాయి.

గేర్ ఇండికేటర్, క్లాక్, ఫ్లుయల్ ఎకానమీ, డీటీఈ (డిస్టెన్స్ టూ ఎంప్టీ) వివరాలు చూపించే సెమీ డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ కన్సోల్‍ డిస్‍ప్లేను బజాజ్ పల్సర్ పీ150 మోటార్ సైకిల్ కలిగి ఉంది. ఫుల్ ఎల్‍డీఈ ప్రొజెక్టర్ హెడ్‍ల్యాంప్ ఉంటుంది. ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్ ఉంటాయి. అలాగే యూఎస్‍బీ చార్జింగ్ పోర్ట్ అదనపు ఫీచర్ గా ఉంది.

Bajaj Pulsar P150 Price: బజాజ్ పల్సర్ పీ150 ధర

బజాజ్ పల్సర్ పీ150 సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1.16,755 లక్షలు (ఎక్స్-షోరూమ్), డ్యుయల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,19,757 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కోల్‍కతాలో ఇప్పటికే ఈ బైక్ అందుబాటులోకి రాగా.. అతిత్వరలో దేశంలోని అన్ని నగరాల్లో లభిస్తుంది. యమహా ఎఫ్‍జెడ్-ఎఫ్ఐ, టీవీఎస్ అపాచె ఆర్టీఆర్ 160 2వీ, హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ బైక్‍లకు ఈ నయా పల్సర్ పీ150 పోటీ పడనుంది.

టాపిక్