తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola S1 X Electric Scooter : ఓలా ఎస్​1 ఎక్స్​లో రెండు కొత్త వేరియంట్లు.. ధరలు ఎంతంటే..

Ola S1 X electric scooter : ఓలా ఎస్​1 ఎక్స్​లో రెండు కొత్త వేరియంట్లు.. ధరలు ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

03 February 2024, 6:38 IST

    • Ola S1 X variants : ఓలా ఎలక్ట్రిక్​ ఎస్​1 ఎక్స్​లో రెండు కొత్త వేరియంట్లు లాంచ్​ అయ్యాయి. వాటి ఫీచర్స్​, రేంజ్​, ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఓలా ఎస్​1 ఎక్స్​లో రెండు కొత్త వేరియంట్లు.. ధరలు ఎంతంటే..
ఓలా ఎస్​1 ఎక్స్​లో రెండు కొత్త వేరియంట్లు.. ధరలు ఎంతంటే..

ఓలా ఎస్​1 ఎక్స్​లో రెండు కొత్త వేరియంట్లు.. ధరలు ఎంతంటే..

Ola S1 X on road price in Hyderabad : దేశీయ దిగ్గజ 2 వీలర్​ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్​.. తన పోర్ట్​ఫోలియోను ఎక్స్​ప్యాండ్​ చేసుకునే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో.. ఓలా ఎస్​1 ఎక్స్​లో తాజాగా రెండు కొత్త వేరియంట్లను లాంచ్​ చేసింది. వీటి బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్స్​ ఫీచర్స్​, ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఓలా ఎస్​1 ఎక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు..

ఓలా ఎస్​1 ఎక్స్​లోని రెండు కొత్త వేరియంట్లకు డ్యూయెల్​ టోన్​ డిజైన్​ వస్తోంది. డ్యూయెల్​ పాడ్​ ఎల్​ఈడీ హెడ్​లైట్​, ఫ్లాట్​ ఫుట్​బోర్డ్​, రైజ్​డ్​ హ్యాండిల్​బార్​, ఫుల్లీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, సింగిల్​ పీస్​ సీట్​, 12 ఇంచ్​ స్టీల్​ వీల్స్​, స్లీక్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్​ వంటివి వస్తున్నాయి.

రైడర్​ సేఫ్టీ కోసం.. ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్స్​కు డ్రమ్​ బ్రేక్స్​ (ఫ్రెంట్​- రేర్​ వీల్స్​), కంబైన్డ్​ బ్రేకింగ్​ సిస్టెమ్​, టెలిస్కోపిక్​ ఫ్రెంట్​ ఫోర్క్స్​, డ్యూయెల్​ రేర్​ షాక్​ అబ్సార్బర్స్​ వంటివి వస్తున్నాయి.

Ola S1 X new variants : ఓలా ఎస్​1 ఎక్స్​ ఒక వేరియంట్​లో 3కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. ఇంకో దానిలో 4కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. ఈ రెండు కూడా.. 6కేడబ్ల్యూ ఎలక్ట్రిక్​ మోటార్​కి కనెక్ట్​ చేసి ఉంటాయి. మొదటి బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 143 కి.మీల దూరం ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది. రెండో వేరియంట్​ రేంజ్​ 190కి.మీలు అని అంటోంది.

ఓలా ఎస్​1 ఎక్స్​ కొత్త వేరియంట్లు- వాటి ధరలు..

ఓలా ఎస్​1 ఎక్స్​ 3కేడబ్ల్యూ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 89,999. 4కేడబ్ల్యూహెచ్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 1,09,999. బుకింగ్స్​ ఇప్పటికే మొదలవ్వగా.. ఈ ఏడాది ఏప్రిల్​లో డెలివరీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Best electric scooters in India : అంతేకాకుండా.. బ్యాటరీ వారెంటీపై కీలక ప్రకటన చేసింది ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ. తమ పోర్ట్​ఫోలియోలోని వాహనాలపై 8ఏళ్ల బ్యాటరీ వారెంటీని ఇస్తామని పేర్కొంది. ఇండియా ఆటోమొబైల్​లోని 2 వీలర్​ ఎలక్ట్రిక్​ సెగ్మెంట్​లో ఇదే తొలిసారి! క్వాలిటీ, సర్వీస్​కి కట్టుబడి, ఎక్స్​టెండెడ్​ వారెంటీని కూడా ఇస్తామని అంటోంది.

మరోవైపు.. తమ పబ్లిక్​ ఛార్జింగ్​ నెట్​వర్క్​ని ఎక్స్​ప్యాండ్​ చేస్తామని కూడా చెబుతోంది ఓలా ఎలక్ట్రిక్​. ప్రస్తుతం 1000 ఛార్జర్స్​ ఉండగా.. వచ్చే త్రైమాసికానికి దానిని 10,000 ఛార్జర్స్​గా మారుస్తామని చెప్పింది.

Ola electric latest launches : ఇవన్నీ చూస్తుంటే.. 2 వీలర్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ సెగ్మెంట్​లో పెరుగుతున్న పోటీని ఎదుర్కొని, నెంబర్​.1 గా కొనసాగేందుకు ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ తీవ్రంగా కృషి చేస్తోందని స్పష్టమవుతోంది!

తదుపరి వ్యాసం