Ola Electric scooter : ఓలా ఎలక్ట్రిక్ నుంచి కొత్త ఈ-స్కూటర్.. ధర తక్కువే! కానీ..
30 January 2024, 8:08 IST
- Ola Electric new e- scooter : కొత్త ఈ-స్కూటర్ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది ఓలా ఎలక్ట్రిక్ సంస్థ. కానీ ఇది ఒక కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ని తెలుస్తోంది.
ఓలా ఎలక్ట్రిక్ నుంచి కొత్త ఈ-స్కూటర్..
Ola Electric commercial e- scooter : ఓలా ఎలక్ట్రిక్ సంస్థ నుంచి ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. దీని ధర కూడా తక్కువగానే ఉండనుంది. కానీ.. సంస్థ పోర్ట్‌ఫోలియోలోని ఎస్1 ఈ-స్కూటర్ సిరీస్‌లా.. ఇది ప్రైవేట్ వాహనదారులకు కాదు! ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని.. పూర్తిగా కమర్షియల్ మార్కెట్ కోసం సంస్థ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఈ-స్కూటర్..
ఓలా ఎలక్ట్రిక్ కొత్త కమర్షియల్ స్కూటర్లో మినిమలిస్ట్ డిజైన్ ఉండబోతోంది. స్టైల్ కాకుండా.. ఫంక్షనాలిటీపై సంస్థ ఫోకస్ చేస్తుండటం ఇందుకు కారణం. లాస్ట్ మైల్ డెలివరీ, బీ2బీ సెక్టార్స్కు ఉపయోగపడే విధంగా ఈ వెహికిల్‌ని రూపొందిస్తోంది దిగ్గజ 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో కాంపాక్ట్ ఫ్రెంట్ ఏప్రాన్, సీట్ కింది షీల్డెడ్ ప్యానెల్స్, సాడిల్ వెనక లగేజ్ ర్యాక్‌లు ఉండొచ్చు. ఇందులో సింగిల్ సీట్ ఉంటుంది. కానీ పిలియన్ సీడ్ని యాడ్ చేసుకునే ఆప్షన్ని కూడా సంస్థ ఇస్తోంది. రెండు వీల్స్‌కి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. ఎస్1 ఎయిర్, ఎస్1 ఎక్స్ సిరీస్‌లో కనిపించే వీల్స్ లానే.. ఈ కొత్త వెహికిల్ వీల్స్ కూడా ఉంటాయి.
Ola Electric new scooter : ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో చిన్న డిజిటల్ డ్యాష్‌బోర్డ్ ఉంటుంది. యులు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో కనిపించే స్వాపెబుల్ బ్యాటరీలను ఈ స్కూటర్లో సంస్థ వాడే అవకాశం ఉంది. మోటార్, రేంజ్, ఛార్జింగ్ స్పీడ్, వెహికిల్ స్పీడ్ వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు.
ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఈ-స్కూటర్ ధర ఎంత ఉండొచ్చు..?
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ నుంచి రాబోతున్న కొత్త ఈ-స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 89,999గా ఉండే అవకాశం ఉంది. ఇదే నిజమైతే.. బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్స్‌లో ఈ మోడల్‌కి మంచి డిమాండ్ కనిపించే అవకాశం ఉంది.
Ola Electric new scooter price : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్, ధర వంటి వివరాలు ప్రస్తుతం రూమర్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. లాంచ్ డేట్‌పైనా ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్డేట్ వచ్చిన తర్వాత మేము మీకు షేర్ చేస్తాము. స్టే ట్యూన్డ్ టూ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.