తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric : ఈ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లపై ఇయర్​ ఎండ్​ స్పెషల్​ ఆఫర్స్​- త్వరపడండి!

Ola Electric : ఈ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లపై ఇయర్​ ఎండ్​ స్పెషల్​ ఆఫర్స్​- త్వరపడండి!

Sharath Chitturi HT Telugu

17 December 2023, 16:17 IST

    • Ola Electric year end offers : ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ.. ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​ని ఇస్తోంది. పూర్తి వివరాలు మీకోసం..
ఈ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లపై ఇయర్​ ఎండ్​ స్పెషల్​ ఆఫర్స్​- త్వరపడండి!
ఈ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లపై ఇయర్​ ఎండ్​ స్పెషల్​ ఆఫర్స్​- త్వరపడండి!

ఈ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లపై ఇయర్​ ఎండ్​ స్పెషల్​ ఆఫర్స్​- త్వరపడండి!

Ola Electric year end offers : ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ.. తమ స్కూటర్లపై ఇయర్​ ఎండ్​ స్పెషల్​ ఆఫర్స్​ని ప్రకటించింది. 'హైపర్​ వీకెండ్​' పేరుతో ఆఫర్స్​ని ఇస్తోంది. డిసెంబర్​ 15న మొదలైన ఈ ఆఫర్స్​.. ఆదివారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో ఆఫర్స్​ని చెక్​ చేద్దామని భావిస్తున్న వారు, పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లపై ఆఫర్స్​..

హైపర్​ వీకెండ్​ కింద.. ఓలా ఎస్​1 ఎయిర్​, ఎస్​1 ప్రో కొనాలని చూస్తున్న కస్టమర్లకు రూ. 5వేల అప్​గ్రేడ్​ బోనస్​ లభిస్తోంది. ఎస్​1 ప్రో కొంటున్న వారికి 5ఏళ్ల బ్యాటరీ వ్యారెంటీ లభిస్తుంది. క్రెడిట్​ కార్డులతో డబ్బులు కట్టే కస్టమర్లకు అదనంగా రూ. 5వేల తగ్గింపును ఇస్తోంది సంస్థ. జిరో డౌన్​పేమెంట్​, జీరో ప్రాసెసింగ్​ ఫీజుతో పాటు అతి తక్కువ వడ్డీ (6.99శాతం)కే వెహికిల్​ లోన్​ ఇస్తామంటోంది ఓలా ఎలక్ట్రిక్​.

వీటికి తోడు.. ఓలా ఎస్​1 ఎక్స్​+ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై ఇప్పటికే రూ. 20వేల డిస్కౌంట్​ నడుస్తోంది. ఫలితంగా.. ఈ-స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 89,999కు దిగొచ్చింది. ఈ ఆఫర్​ ఎన్ని రోజులు ఉంటుందో సంస్థ చెప్పలేదు. అందుకే కస్టమర్లు, ఎంత తొందరగా ప్లాన్​ చేస్తే అంత మంచిది!

Offers on Ola electric scooters : ఇక ఓలా ఎలక్ట్రిక్​ పోర్ట్​ఫోలియోలో అతి చౌకైన వెహికిల్​గా ఉంది ఓలా ఎస్​1 ఎక్స్​. దీని ఎక్స్​షోరూం ధర రూ. 89,999. ఇందలో మూడు వేరియంట్లు ఉంటాయి. ఇక ఎస్​1 ఎక్స్​+ వాస్తవ ధర రూ. 1.10లక్షలుగా ఉండేది. కానీ లిమిటెడ్​ పీరియడ్​ ఆఫర్స్​ కారణంగా రూ. 89,999కి పడింది. ఓలా ఎస్​1 ఎయిర్​, ఓలా ఎస్​1 ప్రో జెన్​2 ఎక్స్​షోరూం ధరలు వరుసగా రూ. 1.20లక్షలు, రూ. 1.47లక్షలుగా ఉన్నాయి.

ఇండియా ఎలక్ట్రిక్​ 2 వీలర్​ మార్కెట్​లో ఓలా ఎలక్ట్రిక్​ హవా కొనసాగుతోంది. అత్యధిక మార్కెట్​ షేరు కలిగిన సంస్థగా ఓలా ఎలక్ట్రిక్​ ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో టీవీఎస్​, ఏథర్​ ఎనర్జీలు కొనసాగుతున్నాయి.

తదుపరి వ్యాసం