Rapido cab service: ర్యాపిడో నుంచి క్యాబ్ సర్వీస్; ఉబర్, ఓలాలకు పోటీగా..
Rapido cab service: బైక్ టాక్సీ అగ్రిగేటర్ ర్యాపిడో (Rapido) క్యాబ్ సర్వీసులను కూడా ప్రారంభించింది. 2024 జూన్ నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు ఈ సర్వీసును విస్తరిస్తామని చెబుతోంది.
Rapido cab service: ఉబర్, ఓలాలకు పోటీగా ర్యాపిడో కూడా లేటెస్ట్ గా క్యాబ్ సర్వీస్ ను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీసు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుల్లో అందుబాటులో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు ఈ సర్వీసును విస్తరిస్తామని ర్యాపిడో చెబుతోంది.
లక్ష కార్లతో..
ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుల్లో తమ ప్లాట్ ఫామ్ పై లక్ష క్యాబ్స్ అందుబాటులో ఉన్నాయని ర్యాపిడో కో ఫౌండర్ పవన్ గుంటుపల్లి వెల్లడించారు. బైక్ టాక్సీ సెగ్మెంట్లో ర్యాపిడో మార్కెట్ లీడర్ గా ఉంది. బైక్ టాక్సీ సెగ్మెంట్లో ఆ కంపెనీ వాటా 60 శాతానికి పైగానే ఉంది. తమ క్యాబ్ సర్వీసులో డ్రైవర్ల నుంచి మిగతా అగ్రిగేటర్లు ఉపయోగించే కమిషన్ విధానం ద్వారా కాకుండా, తక్కువ మొత్తంలో సాఫ్ట్ వేర్ వినియోగ చార్జీని వసూలు చేస్తామని, తద్వారా, డ్రైవర్ కు ఎక్కువ మొత్తం మిగులుతుందని ర్యాపిడో చెబుతోంది. డ్రైవర్ల నుంచి వసూలు చేసే సబ్ స్క్రిప్షన్ ఫీజు కూడా నామమాత్రంగా ఉంటుందని తెలిపింది. కస్టమర్లకు కూడా ‘లోయెస్ట్ ప్రైస్ గ్యారెంటీ’ ని ఇస్తామని వెల్లడించింది.
130 మిలియన్ డాలర్లు..
2022 లో వివిధ సోర్స్ ల నుంచి ర్యాపిడో 130 మిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ర్యాపిడో సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఈ కంపెనీకి ప్రస్తుం 2.5 కోట్ల మంది కస్టమర్లు, 15 లక్షల మంది పార్ట్ నర్ డ్రైవర్లు ఉన్నారు.