Free Rapido Rides: పోలింగ్ రోజు ర్యాపిడోలో ఉచిత రైడ్స్-free ride on rapido to vote in telangana assembly elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Free Rapido Rides: పోలింగ్ రోజు ర్యాపిడోలో ఉచిత రైడ్స్

Free Rapido Rides: పోలింగ్ రోజు ర్యాపిడోలో ఉచిత రైడ్స్

HT Telugu Desk HT Telugu
Nov 28, 2023 08:55 AM IST

Free Rapido Rides: నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ర్యాపిడోలో పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ఉచిత రైడ్ ఆఫర్ అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

పోలింగ్‌ రోజు  ర్యాపిడోలో ఉచిత రైడ్‌
పోలింగ్‌ రోజు ర్యాపిడోలో ఉచిత రైడ్‌

Free Rapido Rides: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లే వారికి ఉచిత ప్రయాన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ర్యాపిడో ప్రకటించింది. నగరంలోని ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవలనే ఉద్దేశంతో పోలింగ్ రోజు ఉచిత రైడ్ సేవలను అందుబాటులో ఉంచినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం 2600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు ర్యా పిడో ప్రకటించింది. ఈ అవకాశాన్ని ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని సంస్థ కోరింది. ఐటి ఉద్యోగులు మొదలు, రూట్ తెలియని వారు, బస్సు సదుపాయం లేని వారు, సొంత వాహనాలు లేని వారు...ఇలా అనేక మంది ర్యా పిడో ను ఉపయోగించుకుంటున్నారు. .

హైదరాబాద్ నగరంలో అధికంగా పోలింగ్ శాతం నమోదు కావడమే లక్ష్యంగా ఫ్రీ రైడ్ ఆఫర్ చేస్తున్నట్లు ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుండపల్లి తెలిపారు. నగరంలో ఫ్రీ రైడ్ నిర్ణయం ద్వారా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు.

పోలింగ్ రోజున హైదరాబాద్‌లోని 2600 పోలింగ్ బూత్లకు ఉచిత రైడ్లను అందించను న్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికిపైగా పోలింగ్ నమోదవుతుంటే గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం 55 శాతానికి పోలింగ్‌ మించడం లేదని, అందుకే తాము ఈ కార్యక్రమం చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. ర్యాపిడో కెప్టెన్లంతా ఈ నెల 30న ఉదయం నుంచే సిద్ధంగా ఉంటారని, ఓటర్లు రైడ్ కోరిన వెంటనే వారిని పోలింగ్ కేంద్రాల వద్ద ఉచితంగా దిగబెడతారని సంస్థ ప్రకటించింది.

రైడ్ పొందడం ఇలా..

పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీన ర్యాపిడో యాప్‌లో ఉచిత రైడ్ సేవల వినియోగానికి సంబంధించిన వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఓటు వేయాల్సిన పోలింగ్ బూత్ ఎక్కడుందో టైప్ చేసిన తర్వాత అప్లై కూపన్ కోడ్ ఉన్న చోట 'Vote Now' అనే వన్ టైమ్ కూపన్‌ కోడ్ నమోదు చేస్తే ఉచిత రైడ్ బుక్ అవుతుందని వివరించారు.

(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)

Whats_app_banner