తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Scooter Price Cut : ఈ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర భారీగా తగ్గింది! ఎంతంటే..

Ola electric scooter price cut : ఈ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర భారీగా తగ్గింది! ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

03 December 2023, 7:20 IST

google News
    • Ola electric scooter price cut : ఓలా ఎస్​1 ఎక్స్​+ ధరను తగ్గించింది సంస్థ. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఈ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర భారీగా తగ్గింది! ఎంతంటే..
ఈ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర భారీగా తగ్గింది! ఎంతంటే..

ఈ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర భారీగా తగ్గింది! ఎంతంటే..

Ola electric scooter price cut : ఆటోమొబైల్​ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచే పనిలో ఉండగా.. ఓలా ఎలక్ట్రిక్​ మాత్రం కస్టమర్లకు గుడ్​ న్యూస్​ని అందించింది. తమ పోర్ట్​ఫోలియోలోని ఓలా ఎస్​1 ఎక్స్​+ ఈవీ ధరను తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఆ వివరాలు..

ఓలా ఎస్​1 ఎక్స్​+ ధర ఎంతంటే..

ఓలా ఎస్​1 ఎక్స్​+ ఎక్స్​షోరూం ధర రూ. 1,09,999. కానీ ఇప్పుడు, ఈ మోడల్​పై రూ. 20వేలను తగ్గించింది సంస్థ. ఫలితంగా.. ఇప్పుడు ఈ ఈ-స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 89,999కి దిగొచ్చింది. రానున్న రోజుల్లో ఈ స్కూటర్​ని కొనే వారికి అదనపు బెనిఫిట్స్​ కూడా ఉండనున్నాయి. అయితే.. ఈ ప్రైజ్​ కట్​ అనేది డిసెంబర్​కు మత్రమే పరిమితం అని సంస్థ వెల్లడించింది. జనవరిలో ధరలు పెరుగుతాయని స్పష్టం చేసింది.

Ola S1 X+ electric scooter price cut : "నవంబర్​లో 30వేలకు పైగా ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లు అమ్ముడుపోయాయి. ఇది ఇండస్ట్రీలోనే రికార్డు. ఓలా ఎస్​1 ఎక్స్​+ ధరను తగ్గించడంతో, ఇతర ఐసీఈ స్కూటర్ల సరసన నిలుస్తుంది. ఫలితంగా.. ప్రజలు ఐసీఈని కాకుండా ఎలక్ట్రిక్​ని ఎంచుకుంటారని విశ్వసిస్తున్నాము," అని ఓలా ఎలక్ట్రిక్​ చీఫ్​ మార్కెటింగ్​ ఆఫీసర్​ అన్షుల్​ ఖండేల్వాల్​ అభిప్రాయపడ్డారు.

ఈ ఓలా ఎస్​1 ఎక్స్​+ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 3కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 151 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. 500వాట్​ ఛార్జర్​తో ఈ వెహికిల్​ బ్యాటరీని 7.4 గంటల్లో పూర్తిగా ఛార్జ్​ చేసుకోవచ్చు.

Ola S1 X+ electric scooter price in Hyderabad : ఈ స్కూటర్​లో హబ్​ మౌంటెడ్​ ఎలక్ట్రిక్​ మోటార్​ ఉంటుంది. దీని టాప్​ స్పీడ్​ 90 కేఎంపీహెచ్​. 0-40 కేఎంపీహెచ్​ని కేవలం 3.3 సెకన్లలో చేరుకుంటుంది. 0-60 కేఎంపీహెచ్​ కోసం 5.5 సెకన్ల సమయం పడుతుంది. ఈకో మోడ్​, నార్మల్​ మోడ్​, స్పోర్ట్​ మోడ్​ వంటి 3 మోడ్స్​ ఇందులో ఉన్నాయి.

ఈ ఓలా ఎస్​1 ఎక్స్​+ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 5 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే, ఎల్​ఈడీ లైటింగ్​, సైడ్​ స్టాండ్​ అలర్ట్​, రివర్స్​ మోడ్​, రిమోట్​ బూట్​ అన్​క్లాక్​, నేవిగేషన్​ వంటివి ఉన్నాయి. బ్లూటూత్​, జీపీఎస్​ కనెక్టివిటీతో పాటు ఓటీఏ అప్డేట్స్​ కూడా పొందొచ్చు.

Ola S1 X+ price : మరోవైపు.. డిసెంబర్​లో మూవ్​ఓఎస్​ 4ని లాంచ్​ చేయనున్నట్టు ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఇది బీటా వర్షెన్​ దశలో ఉన్నట్టు పేర్కొంది.

తదుపరి వ్యాసం