తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Leads Festive Sales: పండుగ సీజన్ అమ్మకాల్లో ‘ఓలా ఎలక్ట్రిక్’ రికార్డు; ఒక్క నెలలోనే 24 వేల ఎలక్ట్రిక్ స్కూటర్స్ సేల్

Ola leads festive sales: పండుగ సీజన్ అమ్మకాల్లో ‘ఓలా ఎలక్ట్రిక్’ రికార్డు; ఒక్క నెలలోనే 24 వేల ఎలక్ట్రిక్ స్కూటర్స్ సేల్

HT Telugu Desk HT Telugu

31 October 2023, 19:44 IST

google News
    • Ola leads festive sales: దసరా, దీపావళి పండుగ సీజన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మకాల్లో ‘ఓలా ఎలక్ట్రిక్’ రికార్డు సృష్టించింది. ఒక్క అక్టోబర్ నెలలోనే 24 వేల ఎలక్ట్రిక్ స్కూటర్లను సేల్ చేయగలిగింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ola leads festive sales: ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మకాల్లో భారత్ లో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మరోసారి లీడర్ గా అవతరించింది. ఈ పండుగ సీజన్ లో మిగతా కంపెనీల కన్నా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను సేల్ చేసింది. భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ కేటగిరీలో 35% మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్ గా మరోసారి తన స్థానాన్ని నిలుపుకుంది.

24 వేల ఎలక్ట్రిక్ స్కూటర్స్

ఈ అక్టోబర్ నెలలో ఓలా ఎలక్ట్రిక్ మొత్తం 24 వేల ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను అమ్మగలిగింది. గత సంవత్సరం ఇదే సీజన్ లో అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ కన్నా ఇది రెండున్నర రెట్లు అధికం. దీపావళి మరికొన్ని రోజులు ఉన్న నేపథ్యంలో, పండుగ ముగిసే లోపు, మరిన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను అమ్మాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. ఆ తరువాత కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మకాల్లో ఇదే వేగాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది.

పండుగ సీజన్ లో..

ఈ సందర్భంగా ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “పండుగ సీజన్ వాహనాల అమ్మకాలకు అద్భుతమైనది. ముఖ్యంగా, నవరాత్రి, దసరా, దీపావళి సమయంలో అమ్మకాలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. దీపావళి సమీపిస్తున్నందున, విక్రయాల ఊపు మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు.

2 లక్షలకు పైగా..

2023లోని ఈ 10 నెలల్లో 2,00,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించి మరో అద్భుతమైన మైలురాయిని ఓలా సాధించింది. భారతదేశంలో ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి EV కంపెనీగా ఓలా అవతరించింది. భారత్ లో కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించినప్పుడు కేవలం 10 నెలల్లోనే 1 లక్ష అమ్మకాలను నమోదు చేసిన విషయం గమనార్హం.

5 సంవత్సరాల బ్యాటరీ వారంటీ

పండుగ సీజన్ సందర్భంగా ఓలా పలు ఆఫర్స్ ను ప్రకటించింది. అందులో కొన్ని, రూ. 7 వేల విలువైన, 5 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, రూ. 5 వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌, భాగస్వామ్య బ్యాంకుల నుంచి గరిష్టంగా రూ. 7,500 వరకు తక్షణ డిస్కౌంట్ మొదలైనవి ఉన్నాయి. ఇవి కాకుండా, జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ EMI, జీరో-ప్రాసెసింగ్ ఫీజు మరియు 5.99% వడ్డీ రేట్ల వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

టెస్ట్ రైడ్ తో కూడా లాభాలు..

అంతేకాకుండా, ఈ పండుగ కాలంలో ఓలా స్కూటర్‌ను టెస్ట్-రైడ్ చేసే కస్టమర్‌లు ప్రతిరోజూ ఒక S1 X+ని గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు, ఇందులో Ola Care+ కోసం డిస్కౌంట్ కూపన్‌లు, అలాగే, రెండో S1 ప్రో కొనుగోలుపై తక్షణ తగ్గింపులు ఉన్నాయి. కంపెనీ తన ప్రస్తుత లైనప్‌లో ఉన్న S1 ప్రో, S1 ఎయిర్ మరియు S1 X+ స్కూటర్‌లకు పొడిగించిన ‘5-సంవత్సరాల బ్యాటరీ ప్రామిస్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తోంది.

ధరలు ఇలా..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ లైనప్ లోని ఎస్ 1 ప్రొ ధర రూ. 1,47,499 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, ఎస్ 1 ఎయిర్ రూ. 1,19,999 కి అందుబాటులో ఉంది. S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 1,09,999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, S1 X (3kWh) రూ. 99,999, S1 X (2kWh) రూ. 89,999 లకు లభిస్తాయి.

తదుపరి వ్యాసం