Ola electric Diwali offers: దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్-ola rolls out limited time offers for diwali announces exciting warranty and exchange deals ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Diwali Offers: దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్

Ola electric Diwali offers: దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్

HT Telugu Desk HT Telugu
Nov 09, 2023 03:26 PM IST

Ola electric diwali offers: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola electric) దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అదనపు వారంటీ ప్రయోజనాలను, ఎక్స్చేంజ్ డీల్స్ ను కూడా ప్రకటించింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్

Ola electric diwali offers: భారతదేశంలో అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ (Ola electric) భారత్ EV ఫెస్ట్‌లో భాగంగా ఈరోజు నుండి అద్భుతమైన దీపావళి ఆఫర్‌లను ప్రకటించింది. ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, సమగ్ర వారంటీపై భారీ తగ్గింపులు, లాభదాయకమైన ఫైనాన్సింగ్ డీల్స్, నవంబర్ 10 నుండి అన్ని స్కూటర్ల పై అదనపు రూ. 2,000 నుంచి రూ. 26,500 వరకు విలువైన ఆఫర్‌లను కస్టమర్‌లు ఇప్పుడు పొందవచ్చు.

బ్యాటరీ వారంటీ

S1 Pro Gen-2 కొనుగోలు పై కస్టమర్‌లు ఇప్పుడు INR 7,000 విలువైన ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీని పొందవచ్చు. S1 Air మరియు S1 X+ కొనుగోలు పై ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ, కాంప్రెహెన్సివ్ ఎక్స్టెండెడ్ వారంటీ పై 50% వరకు తగ్గింపు పొందవచ్చు. S1 Pro Gen-2ని కొనుగోలు చేసే కస్టమర్‌లు ఇప్పుడు కేవలం రూ. 2,000 చెల్లించడం ద్వారా కాంప్రెహెన్సివ్ ఎక్స్టెండెడ్ వారంటీకి (రూ. 9,000 విలువ) అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది.

అప్ గ్రేడ్ సదుపాయం

కస్టమర్‌లు తమ పాత ICE టూ వీలర్ ను మార్చుకొని S1 Pro Gen-2 కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 10,000 వరకు ఎక్స్చేంజ్ బెనిఫిట్ లభిస్తుంది. అలాగే, S1 Air, S1 X+ కొనుగోలుపై రూ. 5,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ పొందవచ్చు. కొనుగోలుదారులు తమ సమీపంలోని ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఫైనాన్స్ ఆఫర్లు

కొనుగోలుదారులు కొన్ని బ్యాంక్ ల క్రెడిట్ కార్డ్ లతో ఈఎంఐ విధానంలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ లను కొనుగోలు చేస్తే రూ. 7,500 వరకు తగ్గింపును పొందవచ్చు. అలాగే, జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ EMI, జీరో-ప్రాసెసింగ్ ఫీజు, 5.99% తక్కువ వడ్డీ రేటు వంటి ఇతర ఆఫర్స్ కూడా ఉన్నాయి. అయితే, ఈ ఆఫర్లు దీపావళి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

లక్కీ-బూట్ ఆఫర్‌లు

కస్టమర్‌లు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఓలా స్కూటర్‌ని టెస్ట్-రైడ్ చేయవచ్చు. లక్కీ కూపన్ ద్వారా ప్రతిరోజూ ఒక కస్టమర్ S1 X+ గెలుచుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఉచిత ఓలా మర్చండైస్, Ola Care+ డిస్కౌంట్ కూపన్‌లు, S1 ప్రో (జెన్ 2) కొనుగోలు పై రూ. 1,000 విలువైన డిస్కౌంట్ కూపన్స్ పొందవచ్చు.

WhatsApp channel