Ather 450S electric scooter : ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ కళకళలాడిపోతోంది. మరీ ముఖ్యంగా.. 2 వీలర్ ఈవీ సెగ్మెంట్లో డిమాండ్‌తో పాటు పోటీ కూడా విపరీతంగా ఉంది. పోటీని తట్టుకుని, సేల్స్ నెంబర్లను పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న ఆటోమొబైల్ సంస్థలను ధరలను తగ్గించి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ జాబితాలోకి ఏథర్ ఎనర్జీ కూడా చేరింది. తన ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏతర్ 450ఎస్ ధరను తగ్గించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 20వేలు తగ్గించింది ఆటోమొబైల్ సంస్థ. ఫలితంగా.. ఇప్పుడు ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 1,09,999గా ఉంది. ఇందులో ప్రో ప్యాక్ కలిపి లేదు. రూ. 10వేలు ఎక్కువ ఖర్చు చేస్తే.. ప్రో ప్యాక్ కూడా లభిస్తుంది. ఇందులో వివధ కనెక్టివిటీ, స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి.
Ather 450S electric scooter price : ధర తగ్గడంతో.. బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1 ఎయిర్ వంటి మోడల్స్ కన్నా ఈ ఏథర్ 450ఎస్ చౌకగా లభిస్తున్నట్టు అయ్యింది. బజాజ్ చేతక్ అర్బేన్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.15లక్షలు. టీవీఎస్ ఐక్యూబ్ బేస్ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.23లక్షలు. ఓలా ఎస్1 ఎయిర్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.20లక్షలు.
ఈ ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 2.9 కేడబ్ల్యూహెచ్ ఐపీ67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. స్మార్ట్ఈకో మోడల్లో 115 కి.మీల దూరం ప్రయాణిస్తుది. దీని టాప్ స్పీడ్ 90 కేపీహెచ్. ఇది.. 7.24 హెచ్‌పీ పవర్, 22 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 0-80శాతం ఛార్జ్ అవ్వడానికి 6 గంటల 36 నిమిషాల సమయం పడుతుంది.
దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్స్ రేంజ్ పై రూ. 15,000 వరకు విలువైన ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్ జనవరి 15వ తేదీ వరకు అమలులో ఉంటుంది.
ఈ ఆఫర్‌లలో ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ కొనుగోలుపై రూ. 6,999 వరకు విలువైన ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ, రూ. 3,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, ఇతర ఆకర్షణీయమైన ఫైనాన్స్ డీల్‌లు ఉన్నాయి. అదనంగా, ఎస్1 ఎక్స్+ పై రూ. 20,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దాంతో ఎస్1 ఎక్స్+ రూ. 89,999 లకు లభిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.
సంబంధిత కథనం