తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Ipo : త్వరలోనే మార్కెట్​లోకి రానున్న ఓలా ఎలక్ట్రిక్​ ఐపీఓ పూర్తి వివరాలు..

Ola Electric IPO : త్వరలోనే మార్కెట్​లోకి రానున్న ఓలా ఎలక్ట్రిక్​ ఐపీఓ పూర్తి వివరాలు..

Sharath Chitturi HT Telugu

23 December 2023, 8:55 IST

    • Ola Electric IPO news : ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ.. ఐపీఓగా రానుంది. ఈ నేపథ్యంలో సెబీకి డీఆర్​హెచ్​పీని సమర్పించింది. దాని ద్వారా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..
త్వరలోనే మార్కెట్​లోకి రానున్న ఓలా ఎలక్ట్రిక్​ ఐపీఓ పూర్తి వివరాలు..
త్వరలోనే మార్కెట్​లోకి రానున్న ఓలా ఎలక్ట్రిక్​ ఐపీఓ పూర్తి వివరాలు.. (Bloomberg)

త్వరలోనే మార్కెట్​లోకి రానున్న ఓలా ఎలక్ట్రిక్​ ఐపీఓ పూర్తి వివరాలు..

Ola Electric IPO news : ప్రముఖ ఈ-స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ప్రాథమిక ముసాయిదా పత్రాలను (డీఆర్​హెచ్​పీ).. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి సమర్పించింది. ఒక భారతీయ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ నుంచి మార్కెట్​లోకి వస్తున్న మొదటి ఐపీఓ ఇదే! ఈ నేపథ్యంలో డీఆర్​హెచ్​పీలోని కీలక విషయాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ- డీఆర్​హెచ్​పీ


ఐపీఓ వివరాలు: ఫ్రెష్​ ఇష్యూ కింద రూ. 5,500 కోట్లు విలువ చేసే 95,191,195 ఈక్వీటీ షేర్లను విక్రయిస్తోంది సంస్థ. ఒక్కో షేరు ఫేస్​ వాల్యూ 10. ఓలా ఎలక్ట్రిక్​ ఫౌండర్​ భవిశ్​ అగర్వాల్​.. ఈ ఐపీఓ ద్వారా తన 47.4 మిలియన్​ షేర్లను విక్రయిచనున్నారు.

Ola Electric IPO date : ఐపీఓ తేదీలు: ఓలా ఎలక్ట్రిక్ తన డీఆర్​హెచ్​పీలో.. ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ ప్రారంభ- ముగింపు తేదీలను ఇంకా ప్రకటించలేదు. అయితే పబ్లిక్ ఇష్యూ.. 2024 తొలినాళ్లల్లో ప్రారంభమవుతుందని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇష్యూకు సంబంధించిన ఆఫర్ ధర, ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను కూడా సంస్థ ఇంతవరకు ప్రకటించలేదు.

ఐపీఓ రిజర్వేషన్: ఈ ఇష్యూలో 75 శాతానికి తగ్గకుండా అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు (క్యూఐబీ) ప్రొపోషనేట్​ బేసిస్​ కింద కేటాయింపులకు అందుబాటులో ఉంటుందని, ఇష్యూలో 15 శాతానికి మించకుండా నాన్ ఇన్​స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (ఎన్ఐఐ) కేటాయింపులకు అందుబాటులో ఉంటుందని, ఇష్యూలో 10 శాతానికి మించి రిటైల్ వ్యక్తిగత బిడ్డర్లకు కేటాయించడానికి అందుబాటులో ఉండదని తెలిపింది.

Ola Electric IPO DRHP : ఐపీఓ లక్ష్యాలు: డీఆర్​హెచ్​పీ ప్రకారం ఓలా ఎలక్ట్రిక్​ ఐపీఓ తాజా ఇష్యూ ద్వారా రూ.1226.4 కోట్ల వరకు నికర ఆదాయాన్ని ఓలా గిగాఫ్యాక్టరీ ప్రాజెక్టు కోసం అనుబంధ సంస్థ ఓలా సెల్ టెక్నాలజీస్ (ఓసీటీ) మూలధన వ్యయానికి వినియోగిస్తారు. వీటితో పాటు రూ.1,600 కోట్లను పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లో పెట్టుబడులకు, రూ.350 కోట్లను ఆర్గానిక్ గ్రోత్ ఇనిషియేటివ్స్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు. అనుబంధ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ (ఓఈటీ) చేసిన రుణాన్ని తిరిగి చెల్లించడానికి మరో రూ.800 కోట్లు వినియోగించనున్నారు.

బిజినెస్ మోడల్: ఓలా ఎలక్ట్రిక్​ బిజినెస్ మోడల్ మూడు విషయాలు కీలకంగా ఉన్నాయి. మొదటిది.. EV టెక్నాలజీ- ఆర్​ అండ్​ డీ ప్లాట్​ఫామ్​. రెండవది, అడాప్టబుల్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చైన్ ప్లాట్​ఫామ్​. మూడవది.. అక్టోబర్ 31, 2023 నాటికి 414 సేవా కేంద్రాలతో సహా భారతదేశం అంతటా ఉన్న 935 ఎక్స్​పీరియెన్స్​ సెంటర్స్​తో కూడిన డీ 2 సీ ఓమ్నిఛానెల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్​ఫామ్​.

Ola Electric IPO details : కంపెనీ ఫైనాన్షియల్స్: 2023 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా ఓలా ఎలక్ట్రిక్​ ఆదాయం.. 7 రెట్లు పెరిగి రూ.373.42 కోట్ల నుంచి రూ.2,630.93 కోట్లకు చేరింది. 2023 జూన్ 30తో ముగిసిన త్రైమాసికం నాటికి కార్యకలాపాల ద్వారా రూ.1,242.75 కోట్ల ఆదాయం సమకూరింది.

2023 ఆర్థిక సంవత్సరంలో నష్టాలు: ఖర్చులు గణనీయంగా పెరగడంతో ఓలా ఎలక్ట్రిక్ నికర నష్టం.. 2023 ఆర్థిక ఏడాదిలో రెట్టింపు అయ్యింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ .784.1 కోట్లుగా ఉండగా.. 2023 ఫైనాన్షియల్​ ఇయర్​లో అది రూ .1,472 కోట్లకు చేరింది. ఐపీఓకు వెళ్లే ఎలక్ట్రిక్ వాహన కంపెనీ మొత్తం వ్యయాలు రూ.1,240 కోట్ల నుంచి రూ.3,383 కోట్లకు పెరగడంతో రూ.1,318 కోట్ల ఈబీఐటీడీఏ నష్టాన్ని ప్రకటించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టాలు దాదాపు 293 శాతం పెరిగి రూ.784 కోట్లకు చేరుకున్నాయి.

తదుపరి వ్యాసం