Hyundai Creta facelift : హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. వేరియంట్లు- వాటి ధరలు ఇవే!-2024 hyundai creta facelift launched check variants and prices ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Creta Facelift : హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. వేరియంట్లు- వాటి ధరలు ఇవే!

Hyundai Creta facelift : హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. వేరియంట్లు- వాటి ధరలు ఇవే!

Sharath Chitturi HT Telugu
Jan 16, 2024 03:15 PM IST

2024 Hyundai Creta : హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ అయ్యింది. ఈ ఎస్​యూవీ వేరియంట్లు, వాటి ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే..
హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే.. (HT Auto/Sabyasacha Dasgupta)

Hyundai Creta facelift launch date : 2024 మచ్​ అవైటెడ్ ఫేస్​లిఫ్ట్​​ల్లో హ్యుందాయ్​ క్రేటా ఒకటి. ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని సంస్థ తాజాగా లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్​. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ లాంచ్​..

హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​లో గ్రిల్​ని రీడిజైన్​ చేసింది సంస్థ. ఎలాంగేటెడ్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్​ స్ట్రిప్​, క్వాడ్​ బీమ్​ హెడ్​ల్యాంప్స్​, సిల్వర్​ స్కిడ్​ ప్లేట్​ వంటివి వస్తున్నాయి. రేర్​లో.. కనెక్టెడ్​ ఎల్​ఈడీ టెయిలైట్స్​, షార్క్​ ఫిన్​ యాంటీనా, వైపర్​, హై మౌంటెడ్​ స్టాప్​ ల్యాంప్​లు ఉంటాయి. ఈ ఎస్​యూవీలోని ప్రీమియం వేరియంట్స్​కి రీడిజైన్డ్​ 17 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ లభిస్తున్నాయి.

2024 హ్యుందాయ్​ క్రేటా 5 సీటర్​ కేబిన్​లో యాంబియెంట్​ లైటింగ్​, 10.25 ఇంచ్​ డ్యూయెల్​ స్క్రీన్స్​, డిజిటల్​ క్లస్టర్​, అప్పర్​ డాష్​బోర్డ్​పై పియానో బ్లాక్​ ప్యానెల్​, మల్టీ స్పోక్​ స్టీరింగ్​ వీల్​ వంటివి వస్తున్నాయి. ఏసీ ప్యానెల్​, టచ్​ ఆధారిత డ్యూయెల్​ జోన్​ క్లైమేట్​ కంట్రోల్​లు కొత్తగా వస్తున్నాయి.

Hyundai Creta facelift on road price in Hyderabad : ఇక ఈ ఎస్​యూవీలో 360 డిగ్రీ వ్యూ కెమెరా, వయర్​లెస్​ ఛార్జింగ్​, వాయిస్​ ఎనేబుల్డ్​ వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, వాయిస్​ ఎనేబుల్డ్​ పానోరమిక్​ సన్​రూఫ్​, 8 వే అడ్జెస్టెబుల్​ డ్రైవర్​ సీట్​, రేర్​ విండో కర్టైన్స్​, 8 స్పోక్​ బోస్​ సిస్టెమ్​ వంటివి కూడా వస్తున్నాయి.

2024 హ్యుందాయ్​ క్రేటా- ఇంజిన్​.. సేఫ్టీ ఫీచర్స్​..

హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​లో 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​, 1.5 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​, 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. 6 స్పీడ్​ మేన్యువల్​, ఐవీటీ, 7 స్పీడ్​ డీసీటీ, 6 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ లభిస్తున్నాయి.

ఈ ఎస్​యూవీలో హ్యుందాయ్​ స్మార్ట్​సెన్స్​ లెవల్​ 2 అడాస్​కు చెందిన 19 ఫీచర్స్​ ఉంటాయి. మొత్తం మీద చూసుకుంటే.. ఈ 2024 హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీలో 70కిపైగా సేఫ్టీ ఫీచర్స్​ ఉండటం విశేషం. ఇక 6 మోనో టోన్​ కలర్​ ఆప్షన్స్​ ఈ ఎస్​యూవీకి లభిస్తున్నాయి. ఒక డ్యూయెల్​ టోన్​ కలర్​ కూడా ఉంది.

2024 హ్యుందాయ్​ క్రేటా వేరియంట్లు- వాటి ధరలు..

హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​లో 7 వేరియంట్లు ఉన్నాయి. వాటి ఎక్స్​షోరూం ధరలు..

హ్యుందాయ్​ క్రేటా ఈ (1.5 ఎంపీఐ పెట్రోల్ 6 ఎంటీ​)- రూ. 10,99,900.

Hyundai Creta facelift price : ఈఎక్స్​ (1.5 ఎంపీఐ పెట్రోల్​ 6 ఎంటీ)- రూ. 12,17,700

ఎస్​ (1.5 ఎంపీఐ పెట్రోల్​ 6 ఎంటీ)- రూ. 13,2,200.

ఎస్​ (ఓ) (1.5 ఎంపీఐ పెట్రోల్​ 6 ఎంటీ)- రూ. 14,32,400

ఎస్​ (ఓ) (1.5 ఎంపీఐ పెట్రోల్​ ఐవీటీ)- రూ. 15,82,400

ఎస్​ఎక్స్​ (1.5 ఎంపీఐ పెట్రోల్​ 6 ఎంటీ)- రూ. 15,26,900

ఎస్​ఎక్స్​ టెక్​ (1.5 ఎంపీఐ పెట్రోల్​ 6 ఎంటీ)- రూ. 15,94,900

ఎస్​ఎక్స్​ టెక్​ (1.5 ఎంపీఐ పెట్రోల్​ ఐవీటీ) - రూ. 17,44,900

ఎస్​ఎక్స్​ (ఓ) (1.5 ఎంపీఐ పెట్రోల్​ 6 ఎంటీ)- రూ. 17,23,800

ఎస్​ఎక్స్​ (ఓ) (1.5 ఎంపీఐ పెట్రోల్​ ఐవీటీ)- రూ. 18,69,800

ఎస్​ ఎక్స్​ (ఓ) (1.5 టీ-జీడీఐ పెట్రోల్​ 7 డీసీటీ)- రూ. 19,99,900

ఈ (1.5 యూ2 సీఆర్​డీఐ డీజిల్​ 6 ఎంటీ)- రూ. 12,44,900

ఈఎక్స్​ (1.5 యూ2 సీఆర్​డీఐ డీజిల్​ 6 ఎంటీ)- రూ. 13,67,700

2024 Hyundai Creta facelift : ఎస్​ (1.5 యూ2 సీఆర్​డీఐ డీజిల్​ 6 ఎంటీ)- రూ. 14,89,200

ఎస్​ (ఓ) (1.5 యూ2 సీఆర్​డీఐ డీజిల్​ 6 ఎంటీ)- రూ. 15,82,400

ఎస్​ (ఓ) (1.5 యూ2 సీఆర్​డీఐ డీజిల్​ 6 ఏటీ)- రూ. 17,32,400

ఎస్​ఎక్స్​ టెక్​ (1.5 యూ2 సీఆర్​డీఐ డీజిల్​ 6 ఎంటీ)- రూ. 17,44,900

ఎస్​ఎక్స్​ (ఓ) (1.5 యూ2 సీఆర్​డీఐ డీజిల్​ 6 ఎంటీ)- రూ. 18,73,900

ఎస్​ఎక్స్​ (ఓ) (1.5 యూ2 సీఆర్​డీఐ డీజిల్​ 6 ఏటీ)- రూ. 19,99,900.

* ఇవి ఇంట్రొడక్టరీ ప్రైజ్​లు మాత్రమే. రానున్న నెలల్లో ఈ హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ ధరలను హ్యుందాయ్​ పెంచే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం