తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Casper Ev : హ్యుందాయ్​ కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​.. కాస్పర్​ ఈవీ ఇదే!

Hyundai Casper EV : హ్యుందాయ్​ కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​.. కాస్పర్​ ఈవీ ఇదే!

Sharath Chitturi HT Telugu

11 February 2024, 12:40 IST

    • Hyundai Casper EV price : కొత్త ఈవీని లాంచ్​ చేసేందుకు హ్యుందాయ్​ మోటార్​​ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ హ్యుందాయ్​ కాస్పర్​ ఈవీ టెస్ట్​ రన్​ ఇటీవలే జరిగింది. పూర్తి వివరాలు..
హ్యుందాయ్​ నుంచి బుడ్డి ఎలక్ట్రిక్​ వెహికిల్​.. కాస్పర్​ ఈవీ ఇదే!
హ్యుందాయ్​ నుంచి బుడ్డి ఎలక్ట్రిక్​ వెహికిల్​.. కాస్పర్​ ఈవీ ఇదే! (Automotive news Europe)

హ్యుందాయ్​ నుంచి బుడ్డి ఎలక్ట్రిక్​ వెహికిల్​.. కాస్పర్​ ఈవీ ఇదే!

Hyundai Casper EV test run : సరికొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ని లాంచ్​ చేసేందుకు ప్లాన్​ చేస్తోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్​ మోటార్​. దీని పేరు హ్యుందాయ్​ కాస్పర్​ ఈవీ. ఇదొక బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ. ఈ ఏడాది చివర్లో.. ఇది అంతర్జాతీయ మార్కెట్​లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు.. ఈ హ్యుందాయ్​ కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​కి సంబంధించి, ఓ వార్త బయటకు వచ్చింది. ఆస్ట్రేలియా వీధుల్లో.. హ్యుందాయ్​ కాస్పర్​ ఈవీ టెస్ట్​ రన్​ జరిగింది. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. వాటి ద్వారా.. ఈ ఈవీకి చెందిన పలు కీలక విషయాలు స్పష్టమవుతున్నాయి. వాటిని ఇక్కడ చూసేయండి..

హ్యుందాయ్​ కాస్పర్​ ఈవీ..

ఆన్​లైన్​లో లీక్​ అయిన ఫొటోలను గమనిస్తే.. హ్యుందాయ్​ కాస్పర్​ ఈవీ.. ఓ బుడ్డ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ అని స్పష్టమవుతోంది. అంతేకాకుండా.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న కాస్పర్​కి, త్వరలోనే లాంచ్​ అయ్యే ఈవీ వర్షెన్​ డిజైన్​కి మధ్య పెద్దగా తేడా కనిపించడం లేదు. కాస్పర్​ ఈవీలో సర్క్యులర్​ హెడ్​లైట్స్​, ఎల్​ఈడీ లైట్​ సిగ్నేచర్స్​పై పారామెట్రిక్​ పిక్సెల్​ పాటర్న్స్​, స్లీక్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​ వంటివి ఉన్నాయి. ఈ హ్యుందాయ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో స్పోర్టీ అలాయ్​ వీల్స్​, సీ పిల్లర్​ మౌంటెడ్​ రేర్​ డోర్​ హ్యాండిల్స్​, బ్లాక్​డ్​ ఔట్​ ఫంక్షనల్​ రూఫ్​ రెయిల్స్​ వంటివి కనిపిస్తున్నాయి.

Hyundai Casper EV price : రూమర్స్​ ప్రకారం.. పెట్రోల్​ వర్షెన్​తో పోల్చుకుంటే.. హ్యుందాయ్​ కాస్పర్​ ఈవీ వీల్​బేస్​ కాస్త ఎక్కువగానే ఉండొచ్చు. ఇదే నిజమైతే.. కేబిన్​ స్పేస్​ మరింత పెరుగుతున్నట్టు అవుతుంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో అడ్వాన్స్​డ్​ బ్యాటరీ ప్యాక్​ని హ్యుందాయ్​ వినియోగిస్తుందని టాక్​ నడుస్తోంది. ఈ బ్యాటరీ ప్యాక్​ రేంజ్​ 320 కి.మీలుగా ఉంటుందని సమాచారం. దీనిపై ప్రస్తుతం క్లారిటీ లేదు.

Hyundai Casper EV Australia : హ్యుందాయ్​ కాస్పర్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో భారీ 10 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​, హీటెడ్​ స్టీరింగ్​ వీల్​, హీటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, ఆర్టిఫీషియెల్​ లెథర్​ అప్​హోలిస్ట్రీ,​ వెంటిలేటెడ్​ డ్రైవర్​ సీట్​, సింగిల్​ పన్​ సన్​రూఫ్​, మూడ్​ ల్యాంప్​, బ్లూలింక్​ కనెక్టివిటీ వంటి ఫీచర్స్​ కూడా ఉంటాయని సమాచారం. హ్యుందాయ్​ కొత్త ఈవీలో ఆడాస్​ ఫీచర్స్​ కోసం ఫ్రెంట్​ రేడార్​ మాడ్యూల్​ ఉంటుందట.

హ్యుందాయ్​ కాస్పర్​ ఈవీ- ధర ఎంత?

ఆస్ట్రేలియా మార్కెట్​లో హ్యుందాయ్​ కాస్పర్​ ఈవీ ధర 40వేల ఏయూడీగా ఉండొచ్చు. అంటే.. ఇండియన్​ కరెన్సీలో అది సుమారు రూ. 21.55లక్షలు.

Hyundai Casper EV review : మరి ఈ కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. అంతర్జాతీయ మర్కెట్​లో ఎప్పుడు లాంచ్​ అవుతుంది? ఇతర ఫీచర్స్​ వివరాలేంటి? ఇండియాలో లాంచ్​ అవుతుందా? ఎప్పుడు లాంచ్​ అవుతుంది? వంటి అంశాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. త్వరలోనే.. వీటిపై హ్యుందాయ్​ మోటార్​ స్పందించే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం