తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Electric Scooter : 98కి.మీ రేంజ్​తో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​- ధర ఎంతంటే..

New electric scooter : 98కి.మీ రేంజ్​తో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​- ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

10 February 2024, 7:20 IST

google News
    • Lectrix EV LXS 2.0 : ఈవీ తయారీ సంస్థ లెక్ట్రిక్స్​.. ఓ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ని లాంచ్​ చేసింది. దాని ఫీచర్స్​, రేంజ్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
98కి.మీ రేంజ్​తో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​- ధర ఎంతంటే..
98కి.మీ రేంజ్​తో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​- ధర ఎంతంటే..

98కి.మీ రేంజ్​తో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​- ధర ఎంతంటే..

Lectrix EV LXS 2.0 electric scooter price in India : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ సెగ్మెంట్​కు డిమాండ్​ మామూలుగా లేదు. మరీ ముఖ్యంగా.. 2 వీలర్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ సెగ్మెంట్​కు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. దానిని క్యాష్​ చేసుకునేందుకు.. ఆటోమొబైల్​ సంస్థలు పోటీపడి మరీ కొత్త కొత్త ఈవీలను లాంచ్​ చేస్తున్నాయి. ఎస్​ఏఆర్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీలో భాగమైన 2 వీలర్​ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ లెక్ట్రిక్స్​ ఈవీ.. తాజాగా ఓ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని లాంచ్​ చేసింది. దాని పేరు ఎల్​ఎక్స్​ఎస్​ 2.0. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, రేంజ్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మార్కెట్​లో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​..

ఈ లెక్ట్రిక్స్​ సంస్థకు ఇప్పటికే మార్కెట్​లో.. ఎల్​ఎక్స్​ఎస్​ 3.0 ఈవీ ఉంది. తాజాగా లాంచ్​ అయిన ఎల్​ఎక్స్​ఎస్​ 2.0.. దాని కింది వరుసలో ఉంటుంది. కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 2.3 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. బీఎల్​డీసీ హబ్​ మోటార్​ ఈ వెహికిల్​లో ఉంది. దీని టాప్​ స్పీడ్​ 60 కేఎంపీహెచ్​. బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ ఎల్​ఎక్స్​ఎస్​ 2.0 ఈ-స్కూటర్​.. 98 కి.మీలు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది.

Lectrix EV LXS 2.0 range : 25 లీటర్ల అండర్​ సీట్​ స్టోరేజ్​, ఫాలో-మీ హెడ్​ల్యాంప్​ ఫంక్షన్​, 90/100 ఫ్రెంట్​- 110/90 10- ఇంచ్​ టైర్స్​తో పాటు మరిన్ని ఫీచర్స్​ వస్తున్నాయి.

రేంజ్​, క్వాలిటీ, వాల్యూ కోసం చూసే కస్టమర్లకు తమ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఎల్​ఎక్స్​ఎస్​ 2.0 సూట్​ అవుతుందని లెక్ట్రిక్స్​ చెబుతోంది.

"వాల్యూ కోసం చూసే కస్టమర్ల ఆలోచనలను మేము అర్థం చేసుకోగలము. అందుకు తగ్గట్టుగా మేము ఓ కొత్త ఈవీని తీసుకొచ్చాము. వాల్యూ- అఫార్డెబులుటీని సరిగ్గా బ్యాలెన్స్​ చేస్తుంది ఈ ఈ-స్కూటర్​. ఇన్నోవేషన్​, క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడలేదు," అని సార్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీ ఎండీ, సీఈఓ క విజయ కుమార్​ తెలిపారు.

లెక్ట్రిక్స్​ ఎల్​ఎక్స్​ఎస్​ 2.0 ధర ఎంతంటే..

Best electric scooter in India : ఈ లెక్ట్రిక్స్​ ఎల్​ఎక్స్​ఎస్​ 2.0 ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 79,999గా ఉంది. బుకింగ్స్​ మొదలయ్యాయి. మార్చ్​లో డెలివరీలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ స్కూటర్​ కొన్న వారికి 3ఏళ్లు లేదా 3000 కి.మీల వరకు వారెంటీని ఇస్తోంది సంస్థ. ఇందులో యాంటీ థెఫ్ట్​ సిస్టెమ్​ కూడా ఉంది. ఎమర్జెన్సీ ఎస్​ఓఎస్​ కూడా ఉంది. డోర్​ స్టెప్​ సర్వీస్​ని కూడా ఇస్తామని సంస్థ చెబుతోంది.

లెక్ట్రిక్స్​ సంస్థకు ఇండియాలో సేల్స్​ బాగా పెరుగుతున్నాయి. తన పోర్ట్​ఫోలియోలోని వెహికిల్​ని ఇప్పటికే దేశవ్యాప్తంగా 10వేలకుపైగా మందికి విక్రయించామని సంస్థ చెబుతోంది.

తదుపరి వ్యాసం