తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ather 450 Apex Electric Scooter : ఏథర్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​- ధర ఎంతంటే..

Ather 450 Apex electric scooter : ఏథర్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​- ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

06 January 2024, 13:07 IST

google News
    • Ather 450 Apex electric scooter : ఏథర్​ 450 అపెక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ధర, రేంజ్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఏథర్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​- ధర ఎంతంటే..
ఏథర్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​- ధర ఎంతంటే..

ఏథర్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​- ధర ఎంతంటే..

Ather 450 Apex electric scooter : ఏథర్​ ఎనర్జీ నుంచి ఓ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​ అయ్యింది. దీని పేరు ఏథర్​ 450 అపెక్స్​. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర, రేంజ్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఏథర్​ 450 అపెక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​..

ఏథర్​ 450 అపెక్స్​ ఈ-స్కూటర్​లో 3.7 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఇది 157 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో వార్ప్​ ప్లస్​ రైడింగ్​ మోడ్​ ఉంటుంది. రీజనరేవిట్​ బ్రేకింగ్​ కోసం మేజిక్​ ట్విస్ట్​ నెగిటివ్​ థ్రాటిల్​, ఇండియమ్​ బ్లూ పెయింట్​ స్కీమ్​ వంటివి లభిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే.. ఈ కొత్త స్కూటర్​ ఇప్పటికే మార్కెట్​లో ఉన్న ఏథర్​ 450ఎక్స్​కి నెక్ట్స్​ వర్షెన్​లా కనిపిస్తుంది.

Ather 450 Apex electric scooter price in India : ఏథర్​ 450 అపెక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​కి ఎక్స్​టెండెడ్​ బ్యాటరీ వారెంటీ లభిస్తోంది. 5ఏళ్లు లేదా 60,000 కి.మీ వారెంటీ ఇది. ఏథర్​ 450ఎక్స్​లో ఇది 3ఏళ్లు లేదా 30వేల కి.మీలు మాత్రమే ఉంటుంది.

ఏథర్​ 450 అపెక్స్​ ధర ఎంతంటే..

ఏథర్​ 450 అపెక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.89లక్షలు. ఏథర్​ సంస్థ నుంచి వస్తున్న అతి ఖరీదైన వెహికిల్​ ఇదే! ఇందులో 7కేడబ్ల్యూ ఔట్​పుట్​ ఛార్జర్​ ఉంటుంది. దీని టాప్​ స్పీడ్​ 100 కేఎంపీహెచ్​. 0-40 కేఎంపీహెచ్​ని కేవలం 2.9 సెకన్లలో అందుకుంటుంది ఈ స్కూటర్​.

Ather 450 Apex launch : ఈ ఏథర్​ 450 అపెక్స్​.. ఒక లిమిటెడ్​ ఎడిషన్​ ఈ-స్కూటర్​ అని తెలుస్తోంది. బుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2024 మార్చ్​లో డెలివరీలు మొదలవుతాయని సమాచారం.

Ather 450 Apex price : ఇక ఏథర్​ 450 అపెక్స్​.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న ఓలా ఎస్​ ప్రో, టీవీఎస్​ ఎక్స్​, సింపుల్​ వన్​కి గట్టిపోటీనిస్తుందని మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తదుపరి వ్యాసం