Ather electric scooter : ఏథర్ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలోనే లాంచ్!
24 September 2023, 10:20 IST
- Ather electric scooter : ఏథర్ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఏథర్ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలోనే లాంచ్!
Ather 450S HR : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ నుంచి మరో ఈ-స్కూటర్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. దీని పేరు ఏథర్ 450ఎస్ హెచ్ఆర్! ఏథర్ లైనప్‌లో ఇది అతి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, బ్యాటరీ ప్యాక్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు..
త్వరలో లాంచ్‌కానున్న ఏథర్ 450ఎస్ హెచ్ఆర్లో 7 ఇంచ్ డీప్‌వ్యూ ప్యానెల్, నాన్-టచ్ ఆధారిత డిస్ప్లే, బ్లూటూత్- స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నేవిగేషన్ వంటి ఫీచర్స్ ఉంటాయని సమాచారం.
ఈ ఈవీలో అడ్వాన్స్డ్ 7 ఇంచ్ టీఎఫ్టీ టచ్‌స్క్రీన్ సిస్టెమ్ ఉండనుంది. గూగుల్ మ్యాప్స్‌తో పాటు 450ఎక్స్ జెన్ 3 మోడల్లో ఉన్న అనేక ఫీచర్స్‌కు ఈ మోడల్ సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.
Ather 450S HR price : ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో నికిల్- కోబాల్ట్ ఆధారిత ఎల్ఐ- ఐయాన్ బ్యాటరీ ఉండనుంది. 3 ఫేస్ పీఎంఎస్ మోటార్‌కు ఇది కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ ఇంజిన్ 7.24 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇదొక 3.67 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 156కి.మీలు ప్రయాణిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 450ఎక్స్ జెన్ 3 కన్నా దీని రేంజ్ 10కి.మీలు ఎక్కువే!
ఇదీ చూడండి:- Xiaoma mini EV: సింగిల్ చార్జ్ తో 1200 కిమీలు. ధర 3.5 లక్షలు మాత్రమే.. ఇవీ ఈ ఈవీ ప్రత్యేకతలు
స్పోర్ట్స్ మోడ్‌తో పాటు మరికొన్ని రైడింగ్ మోడ్స్ ఇందులో ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 80 కేఎంపీహెచ్గా ఉండొచ్చు.
ధర ఎంత ఉంటుంది?
ఈ ఏథర్ 450ఎస్ హెచ్ఆర్ని 450ఎస్ మోడల్ ఆధారంగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మార్కెట్లో ఈ ఈవీ ఎక్స్‌షోరూం ధర రూ. 1.4లక్షలుగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
Ather 450S HR price in Hyderabad : లాంచ్ తర్వాత ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ వాహనం.. ఓలా ఎస్ఓఎక్స్+ కు గట్టిపోటీనిస్తుదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 1.45లక్షలుగా ఉంది.
ఇక ఈ ఏథర్ 450ఎస్ హెచ్ఆర్ లాంచ్, ధర, ఇతర ఫీచర్స్ గురించి సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.