తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tvs X Vs Ather 450x : టీవీఎస్​ ఎక్స్​ వర్సెస్​ ఏథర్​ 450ఎక్స్​.. ఈ-స్కూటర్స్​లో ఏది బెస్ట్​?

TVS X vs Ather 450X : టీవీఎస్​ ఎక్స్​ వర్సెస్​ ఏథర్​ 450ఎక్స్​.. ఈ-స్కూటర్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

25 August 2023, 9:19 IST

    • TVS X vs Ather 450X : టీవీఎస్​ ఎక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ వర్సెస్​ ఏథర్​ 450ఎక్స్​. ఈ రెండిట్లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? ఇక్కడ తెలుసుకుందాము..
టీవీఎస్​ ఎక్స్​ వర్సెస్​ ఏథర్​ 450ఎక్స్​..
టీవీఎస్​ ఎక్స్​ వర్సెస్​ ఏథర్​ 450ఎక్స్​.. (HT AUTO)

టీవీఎస్​ ఎక్స్​ వర్సెస్​ ఏథర్​ 450ఎక్స్​..

TVS X vs Ather 450X : ప్రీమియం ఎలక్ట్రిక్​ స్కూటర్​ "ఎక్స్​"ను తాజాగా లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టీవీఎస్​ మోటార్​. క్రియాన్​ స్కూటర్​ ఆధారంగా రూపొందించిన ఈ ఈవీ.. ఏథర్​ 450ఎక్స్​కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ఈ రెండు ఈ-స్కూటర్స్​​ లుక్స్ ఎలా ఉన్నాయి?

ఏథర్​ 450ఎక్స్​లో ఎల్​ఈడీ హెడ్​లైట్​, యాంగ్యులర్​ బాడీ ప్యానెల్స్​, ఫ్లష్​ ఫిట్టెడ్​ సైడ్​ స్టాండ్​, స్లీక్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్​, 12 ఇంచ్​ అలాయ్​ వీల్స్​, 7.0 ఇంచ్​ టీఎఫ్​టీ టచ్​స్క్రీన్​ వంటివి వస్తున్నాయి.

TVS X electric scooter : ఇక టీవీఎస్​ ఎక్స్​లో కార్నరింగ్​ లైట్స్​ విత్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, వైడ్​ హ్యాండిల్​బార్​, షార్ప్​ లుకింగ్​ సైడ్​ ప్యానెల్స్​, స్లిమ్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్​, 10.2 ఇంచ్​ టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​లు లభిస్తున్నాయి.

ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో స్మార్ట్​​ఫోన్​ కనెక్టివిటీ, ఇన్​-బిల్ట్​ నేవిగేషన్​ వంటివి ఉన్నాయి.

ఇదీ చూడండి:- TVS Raider 125: మార్వెల్ సూపర్ హీరోస్ స్ఫూర్తితో టీవీఎస్ రైడర్ 125 బైక్స్ కొత్త డిజైన్

ఈ రెండు స్కూటర్స్​ బ్యాటరీ, రేంజ్​ వివరాలివే..

ఏథర్​ 450ఎక్స్​లో 3.7 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో కూడిన 6.4కేడబ్ల్యూ ఎలక్ట్రిక్​ మోటర్​ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఇది 150కి.మీల రేంజ్​ ఇస్తుంది.

Ather 450X on road price Hyderabad : ఇక టీవీఎస్​ ఎక్స్​లో 3.8 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​తో కూడిన 11కేడబ్ల్యూ మిడ్​ మౌంటెడ్​ మోటర్​ వస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 140కి.మీల రేంజ్​ ఇస్తుందని సంస్థ చెబుతోంది. దీని టాప్​ స్పీడ్​ 105కేఎంపీహెచ్​.

ఇక రైడర్​ సేఫ్టీ కోసం ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్స్​ ఫ్రెంట్​, రేర్​ వీల్స్​కు డిస్క్​ బ్రేక్స్​, కంబైన్డ్​ బ్రేకింగ్​ సిస్టెమ్​ (సీబీఎస్​), రీజెనరేటివ్​ బ్రేకింగ్​, మల్టిపుల్​ రైడర్​ మోడ్స్​ వస్తున్నాయి. ఈ రెండు ఈవీల ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో ప్రీలోడ్​ అడ్జెస్టెబుల్​ మోనో షాక్​ యూనిట్​లు సస్పెన్షన్స్​ కింద లభిస్తున్నాయి.

ఈ రెండు ఈ-స్కూటర్ల్​ ధర వివరాలు..

TVS X electric scooter on road price Hyderabad : ఇండియాలో ఏథర్​ 450ఎక్స్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.45లక్షలుగా ఉంది. ఇక క్రియాన్​ ఆధారిత టీవీఎస్​ ఎక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 2.5లక్షలుగా ఉంది.

తదుపరి వ్యాసం