TVS Raider 125: మార్వెల్ సూపర్ హీరోస్ స్ఫూర్తితో టీవీఎస్ రైడర్ 125 బైక్స్ కొత్త డిజైన్-tvs raider 125 super squad edition launched is inspired by marvel super heroes ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tvs Raider 125: మార్వెల్ సూపర్ హీరోస్ స్ఫూర్తితో టీవీఎస్ రైడర్ 125 బైక్స్ కొత్త డిజైన్

TVS Raider 125: మార్వెల్ సూపర్ హీరోస్ స్ఫూర్తితో టీవీఎస్ రైడర్ 125 బైక్స్ కొత్త డిజైన్

HT Telugu Desk HT Telugu
Aug 11, 2023 03:37 PM IST

TVS Raider 125: పిల్లలు, యువతలో గొప్ప క్రేజ్ సంపాదించిన మార్వెల్ సూపర్ హీరోస్ స్ఫూర్తితో సరికొత్త రైడర్ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ బైక్ లను టీవీఎస్ డిజైన్ చేసింది. రైడర్ 125 తో పాటు ఎన్ టార్క్ 125 బైక్స్ ను కూడా సూపర్ స్క్వాడ్ ఎడిషన్ డిజైన్ లో రూపొందించింది. అయితే, ఇవి లిమిటెడ్ ఎడిషన్ బైక్స్.

టీవీఎస్ రైడర్ 125 సూపర్ స్క్వాడ్ స్పెషల్ ఎడిషన్
టీవీఎస్ రైడర్ 125 సూపర్ స్క్వాడ్ స్పెషల్ ఎడిషన్

TVS Raider 125: పిల్లలు, యువతలో గొప్ప క్రేజ్ సంపాదించిన మార్వెల్ సూపర్ హీరోస్ స్ఫూర్తితో సరికొత్త రైడర్ 125 సూపర స్క్వాడ్ ఎడిషన్ బైక్ లను టీవీఎస్ సంస్థ డిజైన్ చేసింది. రైడర్ 125 తో పాటు ఎన్ టార్క్ 125 బైక్స్ ను కూడా మార్వెల్ సూపర్ హీరోస్ డిజైన్ లో రూపొందించింది. అయితే, ఇవి లిమిటెడ్ ఎడిషన్ బైక్స్. మార్వెల్ సూపర్ హీరోస్ నుంచి స్ఫూర్తి పొంది ఈ స్పెషల్ ఎడిషన్ బైక్స్ ను రూపొందించినట్లు టీవీఎస్ ప్రకటించింది.

మార్వెల్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్

ఈ మార్వెల్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి మార్వెల్ సూపర్ హీరోస్ లో ఒకరైన ఐరన్ మ్యాన్ స్ఫూర్తితో రూపొందినది. కాగా, మరొకటి బ్లాక్ పాంథర్ స్ఫూర్తితో డిజైన్ తో రూపొందినది. ఈ సరికొత్త టీవీఎస్ రైడర్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ ఎక్స్ షో రూమ్ ధర ఢిల్లీలో రూ. 98,919 గా నిర్ణయించారు. ఐరన్ మ్యాన్ సూపర్ స్క్వాడ్ వేరియంట్ లో రెడ్, బ్లాక్ కలర్ స్కీమ్ ను ఉపయోగించారు. అలాగే, బ్లాక్ పాంథర్ సూపర్ స్క్వాడ్ వేరియంట్ లో బ్లాక్, పర్పుల్ కలర్ స్కీమ్ ను ఉపయోగించారు.

గతంలో కూడా..

గతంలో కూడా టీవీఎస్ సంస్థ మార్వెల్ సిరీస్ స్ఫూర్తితో స్పెషల్ ఎడిషన్ బైక్స్ ను డిజైన్ చేసింది. ఇదే డిజైన్ తో ఇప్పటికే ఎన్ టార్క్ 125 బైక్స్ మార్కెట్లో ఉన్నాయి. ఇవి ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, థోర్, స్పైడర్ మ్యాన్ లతో స్ఫూర్తి పొంది నాలుగు కలర్ స్కీమ్స్ లో అందుబాటులో ఉన్నాయి.

మెకానికల్ మార్పులేవీ లేవు..

ఈ సూపర్ స్క్వాడ్ స్పెషల్ ఎడిషన్ రైడర్ 125 బైక్ ల్లో మెకానికల్ మార్పులేవీ చేయలేదు. కేవలం ఔట్ లుక్ డిజైన్ ను మాత్రం మార్చారు. ఈ స్పెషల్ ఎడిషన్ బైక్స్ లో కూడా 124.8 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 11.22 బీహెచ్పీ గరిష్ట పవర్ ను, 11.2 ఎన్ఎం పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేయగలదు. ఇందులో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ బైక్ లో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుకవైపు 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. ఈ బైక్ లో 17 ఇంచ్ ల అలాయ్ వీల్స్ ఉంటాయి.

Whats_app_banner