2023 Honda SP 125 vs TVS Raider : హోండా ఎస్పీ125 వర్సెస్ టీవీఎస్ రైడర్.. ది బెస్ట్ ఏది?
2023 Honda SP 125 vs TVS Raider : 2023 హోండా ఎస్పీ 125, టీవీఎస్ రైడర్లో ది బెస్ట్ ఏది? ఏ బైక్ వాల్యూ ఫర్ మనీ? ఇక్కడ తెలుసుకోండి.
2023 Honda SP 125 vs TVS Raider : 2023 ఎస్పీ 125 వర్షెన్‌ను ఇటీవలే ఇండియాలో లాంచ్ చేసింది హోండా సంస్థ. ఈ మోడల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ బైక్.. టీవీఎస్ రైడర్‌కు గట్టిపోటీనిస్తుంది మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చిచూసి.. వాల్యూ ఫర్ మనీ ఏది? అన్నది తెలుసుకుందాము..
హోండా ఎస్పీ 125 వర్సెస్ టీవీఎస్ రైడర్- లుక్స్..
2023 Honda SP 125 price : 2023 హోండా ఎస్పీ 125లో మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్ విత్ ఎక్స్టెన్షన్స్, సింగిల్ పస్ సీట్ విత్ బాడీ కలర్డ్ పిలియన్ గ్రాబ్ రెయిల్, క్రోమ్డ్ హీట్షీల్డ్తో కూడిన సైడ్ మౌంటెడ్ ఎగ్సాస్ట్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి లభిస్తున్నాయి. ఇందులో మొత్తం 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.
TVS Raider on road price : ఇక టీవీఎస్ రైడర్లో ఆరోహెడ్ షేప్ల మిర్రర్స్, స్ప్లిట్ స్టైల్ సీట్స్, సైడ్ మౌంటెడ్ ఎగ్సాస్ట్, ఆల్- ఎల్ఈడీ లైటింగ్ సెటప్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అలాయ్ రిమ్స్ లభిస్తున్నాయి.
హోండా ఎస్పీ 125 వర్సెస్ టీవీఎస్ రైడర్-డైమెన్షన్స్..
2023 Honda SP 125 launch : హోండా ఎస్పీ 125 వీల్‌బేస్ 1,25ఎంఎం. బరువు 116కేజీలు. 11.2 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ దీని సొంతం.
టీవీఎస్ రైడర్ బరువు 123కేజీలు. వీల్‌బేస్ 1,326ఎంఎం. 10 లీటర్ల్ ఫ్యూయెల్ ట్యాంక్ దీని సొంతం.
హోండా ఎస్పీ 125 వర్సెస్ టీవీఎస్ రైడర్- ఇంజిన్..
2023 Honda SP 125 on road price Hyderabad : 2023 హోండా ఎస్పీ 125లో 123.9సీసీ, 4 స్ట్రోక్ ఇంజిన్ వస్తోంది. ఇది 10.7 హెచ్‌పీ పీక్ పవర్‌ను, 10.9 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇక టీవీఎస్ రైడర్లో 124.8సీసీ, ఎయిర్- ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 15.3 హెచ్‌పీ పవర్‌ను, 11.2 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
TVS Raider on road price Hyderabad : ఈ రెండు బైక్స్‌లోనూ 5 స్పీడ్ గేర్‌బాక్స్ లభిస్తోంది.
హోండా ఎస్పీ 125 వర్సెస్ టీవీఎస్ రైడర్- సేఫ్టీ..
2023 Honda SP 125 : 2023 హోండా ఎస్పీ 125 ఫ్రెంట్ వీల్‌కు డిస్క్/ డ్రమ్ బ్రేక్ వస్తుండగా.. రేర్‌లో డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. హ్యాండ్లింగ్ మెరుగుపరిచేందుకు సీబీఎస్ ఉంది. టీవీఎస్ రైడర్లో సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ సిస్టెమ్ ఉంటుంది.
ఈ రెండు బైక్స్‌లోనూ టెలిస్కోపిక్ ఫ్రెంట్ ఫోర్క్స్ ఉన్నాయి. రేర్‌లో హైడ్రాలిక్ టైప్ స్ప్రింగ్స్, గ్యాస్ ఛార్జ్డ్ 5 స్టెప్ అడ్జెస్టెబుల్ మోనో షాక్ అబ్సార్బర్స్ వస్తున్నాయి.
హోండా ఎస్పీ 125 వర్సెస్ టీవీఎస్ రైడర్- ధర..
TVS Raider latest news : ఇండియాలో 2023 హోండా ఎస్పీ 125 ఎక్స్‌షోరూం ధర రూ. 85,131- రూ. 89,131గా ఉంది. ఇక టీవీఎస్ రైడర్ ఎక్స్‌షోరూం ధర రూ. 86,803- రూ. 1లక్ష వరకు ఉంది.
సంబంధిత కథనం