Retro bikes in India : బైక్​ నడిపితే ‘రెట్రో’ ఫీల్​ రావాలా? ఇవి బెస్ట్​..!-retro inspired bikes under 5 lakh in india check out honda to royal enfield ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Retro Inspired Bikes Under 5 Lakh In India : Check Out Honda To Royal Enfield

Retro bikes in India : బైక్​ నడిపితే ‘రెట్రో’ ఫీల్​ రావాలా? ఇవి బెస్ట్​..!

Sharath Chitturi HT Telugu
Mar 26, 2023 12:44 PM IST

Retro bikes in India under 5 Lakh : ఇండియాలో చాలా మంది బైక్​ లవర్స్​ ఉన్నారు. వారిలో.. రెట్రో బైక్​ లవర్స్​ది ప్రత్యేక స్థానం. వారిలో మీరూ ఒకరా? అయితే.. రూ. 5లక్షలలోపు ధరలో లభిస్తున్న కొన్ని బెస్ట్​ రెట్రో వైబ్​ బైక్స్​పై ఓ లుక్కేయండి..

బైక్​ నడిపితే రెట్రో ఫీల్​ రావాలా? ఇవి బెస్ట్​..!
బైక్​ నడిపితే రెట్రో ఫీల్​ రావాలా? ఇవి బెస్ట్​..! (HT AUTO)

Retro bikes in India under 5 Lakh : 'రెట్రో'.. ఈ పదానికి చాలా క్రేజ్​ ఉంది. రెట్రో కార్స్​ అన్నా, రెట్రో బైక్స్​ అన్నా యువతకు మహా ఇష్టం. ప్రపంచమంతా ఇప్పుడు ఇదే ట్రెండ్​. "బైక్​ నడిపితే రెట్రో ఫీల్​ ఉండాలి" అని అనుకునే వారిలో మీరు ఒకరా? అయితే ఇది మీకోసమే. రూ. 5లక్షల బడ్జెట్​లోపు.. రెట్రో వైబ్స్​ ఇచ్చే కొన్ని బైక్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

కావాసాకీ డబ్ల్యూ175..

Kawasaki W175 price in India : రెట్రో ఇన్​స్పైర్డ్​ కావాసాకీ డబ్ల్యూ175లో డ్యూయెల్​ క్రాడిల్​ ఛాసిస్​, టియర్​​డ్రాప్​ షేప్​లో ఫ్యుయెల్​ ట్యాంక్​, సింగిల్​ పీస్​ సీట్​, పీ-షూటర్​ ఎగ్సాస్ట్​, వైర్​- స్పోక్డ్​ వీల్స్​, సర్క్యులర్​ హాలాజెన్​ హెడ్​లైట్​ ఉంటాయి.

ఫ్రెంట్​ వీల్​కి డిస్క్​ బ్రేక్​, రేర్​ వీల్​కి డ్రమ్​ బ్రేక్​, సింగిల్​ ఛానెల్​ ఏబీఎస్​, టెలిస్కోపిక్​ ఫ్రెంట్​ ఫోర్క్స్​, డ్యూయెల్​ రేర్​ షాక్​ అబ్సార్బర్స్​ వంటివి సేఫ్టీ ఫీచర్స్​ కింద వస్తున్నాయి.

ఈ కావాసాకీ డబ్ల్యూ175లో 175 సీసీ సింగిల్​ సిలిండర్​ ఎయిర్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 12.8 హెచ్​పీ పవర్​ను, 13.2 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 1.47లక్షలు.

కీవే ఎస్​ఆర్​ 125..

Keeway SR 125 on road price Hyderabad : కీవే ఎస్​ఆర్​ 125లో మస్క్యులర్​ 14.5 లీటర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, రౌండ్​ హెడ్​ల్యాంప్​ యూనిట్​, రిబ్బ్​డ్​ పాటర్న్​ సీట్​, సర్క్యులర్​ టెయిల్​ల్యాంప్​, 17 ఇంచ్​ వైర్​ స్పోక్​డ్​ వీల్స్​ ఉంటాయి.

సేఫ్టీ విషయానికొస్తే.. రెండు వీల్స్​కి డిస్క్​ బ్రేక్స్​, కంబైన్డ్​ బ్రేకింగ్​ సిస్టెమ్​, టెలిస్కోపిక్​ ఫ్రెంట్​ ఫోర్క్స్​, డ్యూయెల్​ రేర్​ షాక్​ అబ్సార్బర్స్​ వస్తున్నాయి.

ఈ కీవే ఎస్​ఆర్​ 125లో 125సీసీ సింగిల్​ సిలిండర్​, ఎస్​ఓహెచ్​సీ ఎయిర్​కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 9.7 హెచ్​పీ పవర్​ను, 8.2 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 1.19లక్షలు.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ హంటర్​ 350..

Royal Enfield Hundet 350 specifications : రెట్రో వైబ్స్​ గురించి మాట్లాడుకుంటూ.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ గురించి ప్రస్తావించకపోతే ఎలా? ముఖ్యంగా ఈ కేటగిరీలో హంటర్​ 350 బెస్ట్​! ఇందులో టియర్​డ్రాప్​ షేప్​లోని ఫ్యూయెల్​ ట్యాంక్​, రౌండ్​ హాలోజెన్​ హెడ్​ల్యాంప్​, రిబ్​డ్​ పాటర్న్​ సీట్​, అప్​స్వెప్ట్​ ఎగ్సాస్ట్​, సర్క్యులర్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్​ ఉంటాయి.

సేఫ్టీపరంగా చూసుకుంటే.. ఇందులోని రెండు వీల్స్​కు డిస్క్​ బ్రేక్స్​, సింగిల్​/ డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​, టెలిస్కోపిక్​ ఫ్రెంట్​ ఫోర్క్స్​, డ్యూయెల్​ రేర్​ షాక్​ అబ్సార్బర్స్​ లభిస్తున్నాయి.

ఈ మోడల్​లో 349సీసీ, ఎయిర్​ కూల్డ్​, జే- సిరీస్​, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంది. ఇది 20.2 హెచ్​పీ పవర్​ను, 27ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 1.5లక్షలు.

జోంటెస్​ జీకే350..

Zontes GK350 on road price Hyderabad : నియో రెట్రో లుక్స్​తో వస్తున్న జోంటెస్​ జీకే350లో మస్క్యులర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, రేటియేటటర్​ ష్రౌడ్స్​, ఓవల్​ షేప్​ ప్రొజెక్టర్​ ఎల్​ఈడీ హెడ్​లైట్, స్లీక్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్​, వయర్​ స్పోక్​ వీల్స్​, ఫుల్​ కలర్​ టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ లభిస్తున్నాయి.

రెండు వీల్స్​కు డిస్క్​ బ్రేక్స్​, డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​, ఇన్​వర్టెడ్​ ఫ్రంట్​ ఫ్రోక్స్​, రేర్​ మోనో షాక్​ యూనిట్​ వంటివి సేఫ్టీ ఫీచర్స్​ కింద వస్తున్నాయి.

ఈ బైక్​లో 348సీసీ, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 38.8 హెచ్​పీ పవర్​ను, 32.8 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. దీని ధర రూ. 3.47లక్షలు.

హోండా సీబీ350ఆర్​ఎస్​..

Honda CB350RS price : ఇందులో స్కల్ప్​టెడ్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, రౌండ్​ ఎల్​ఈడీ హెడ్​లైట్​, సింగిల్​ పీస్​ సీట్​, సైడ్​ మౌంటెడ్​ ఎక్సాస్ట్​, అలాయ్​ వీల్స్​ వంటివి ఉంటాయి.

సేఫ్టీ ఫీచర్స్​ విషయానికొస్తే.. ఈ హోండా సీబీ350ఆర్​ఎస్​లో రెండు వీల్స్​కు డిస్క్​ బ్రేక్స్​, హెచ్​ఎస్​టీసీ (హోండా సెలక్టెబుల్​ టార్క్​ కంట్రోల్​), టెలిస్కోపిక్​ ఫ్రెంట్​ ఫోర్క్స్​, డ్యూయెల్​ రేర్​ షాక్​ అబ్సార్బర్స్​ లభిస్తున్నాయి.

ఈ బైక్​లో 348సీసీ, ఎయిర్​కూల్డ్​, ఫ్యుయెల్​ ఇంజెక్టెడ్​, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 20.8 హెచ్​పీ పవర్​ను, 30ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. దీని ధర రూ. 2.14లక్షలు.

WhatsApp channel

సంబంధిత కథనం