Ather 450X Gen 3 In pics: అథర్ 450ఎక్స్ జెన్ 3 ఈ స్కూటర్ ఫీచర్స్ ఇవిగో
- Ather Energy 450X Gen 3 e-scooter: అథర్ ఎనర్జీ అథర్ 450ఎక్స్ జెన్ 3 వెర్షన్ లాంచ్ చేసింది. దాని ధర, ఫీచర్లు ఇక్కడ తెలుసుకుందాం..
- Ather Energy 450X Gen 3 e-scooter: అథర్ ఎనర్జీ అథర్ 450ఎక్స్ జెన్ 3 వెర్షన్ లాంచ్ చేసింది. దాని ధర, ఫీచర్లు ఇక్కడ తెలుసుకుందాం..
(1 / 7)
Ather 450X Gen 3: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ అథర్ ఎనర్జీ సరికొత్త అథర్ 450ఎక్స్ జెన్ 3 ఈ స్కూటర్‌ను రూ. 1.39 లక్షల ధరతో లాంచ్ చేసింది. ఈ ధర ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర.
(2 / 7)
Ather 450X Gen 3: అథర్ ఎనర్జీ అథర్ 450 ప్లస్ జెన్ 3 స్కూటర్‌ను కూడా లాంచ్ చేసింది. దాని ధర రూ. 1.17 లక్షలు. ఫేమ్-2 స్కీమ్ ద్వారా వచ్చే మినహాయింపు పోను ఉండే ధర.
(3 / 7)
Ather 450X Gen 3: కొత్త అథర్ 450ఎక్స్ జెన్ 3 కంపెనీ ఫ్లాగ్‌షిప్ బ్యాటరీ పవర్డ్ స్కూటర్‌లో థర్డ్ జనరేషన్ వర్షన్
(4 / 7)
Ather 450X Gen 3: తాజా వర్షన్‌లో ఈ స్కూటర్ అలాయ్ వీల్స్‌పై పరుగులు తీస్తుంది. అలాగే డిస్క్ బ్రేకులు కలిగి ఉంటుంది.
(5 / 7)
Ather 450X Gen 3: అథర్ 450ఎక్స్ జెన్ 3 సరికొత్త బ్యాటరీతో వస్తోంది. ఇంతకుముందు 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉండగా ఇప్పుడది 3.7 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. సరికొత్త బ్యాటరీతో ఒకసారి ఛార్జింగ్ చేస్తే 146 కి.మీ. వరకు ప్రయాణం చేయొచ్చు. అయితే సిటీ కండిషన్స్‌లో 105 కి.మీ. వరకు ప్రయాణం చేయొచ్చు..
(6 / 7)
Ather 450X Gen 3: తాజా అప్‌డేట్లతో అథర్ 450ఎక్స్ జెన్ 3 ఈ స్కూటర్ ఇతర హైస్పీడ్ స్కూటర్స్ అయిన టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1 ప్రొతో పోటీపడుతుంది.
ఇతర గ్యాలరీలు