TVS X vs Ather 450X : టీవీఎస్ ఎక్స్ వర్సెస్ ఏథర్ 450ఎక్స్.. ఈ-స్కూటర్స్‌లో ఏది బెస్ట్?
TVS X vs Ather 450X : టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ వర్సెస్ ఏథర్ 450ఎక్స్. ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ? ఇక్కడ తెలుసుకుందాము..
TVS X vs Ather 450X : ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ "ఎక్స్"ను తాజాగా లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటార్. క్రియాన్ స్కూటర్ ఆధారంగా రూపొందించిన ఈ ఈవీ.. ఏథర్ 450ఎక్స్‌కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు ఈ-స్కూటర్స్ లుక్స్ ఎలా ఉన్నాయి?
ఏథర్ 450ఎక్స్‌లో ఎల్ఈడీ హెడ్‌లైట్, యాంగ్యులర్ బాడీ ప్యానెల్స్, ఫ్లష్ ఫిట్టెడ్ సైడ్ స్టాండ్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 12 ఇంచ్ అలాయ్ వీల్స్, 7.0 ఇంచ్ టీఎఫ్టీ టచ్‌స్క్రీన్ వంటివి వస్తున్నాయి.
TVS X electric scooter : ఇక టీవీఎస్ ఎక్స్‌లో కార్నరింగ్ లైట్స్ విత్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, వైడ్ హ్యాండిల్‌బార్, షార్ప్ లుకింగ్ సైడ్ ప్యానెల్స్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 10.2 ఇంచ్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లు లభిస్తున్నాయి.
ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఇన్-బిల్ట్ నేవిగేషన్ వంటివి ఉన్నాయి.
ఇదీ చూడండి:- TVS Raider 125: మార్వెల్ సూపర్ హీరోస్ స్ఫూర్తితో టీవీఎస్ రైడర్ 125 బైక్స్ కొత్త డిజైన్
ఈ రెండు స్కూటర్స్ బ్యాటరీ, రేంజ్ వివరాలివే..
ఏథర్ 450ఎక్స్‌లో 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో కూడిన 6.4కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటర్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఇది 150కి.మీల రేంజ్ ఇస్తుంది.
Ather 450X on road price Hyderabad : ఇక టీవీఎస్ ఎక్స్‌లో 3.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన 11కేడబ్ల్యూ మిడ్ మౌంటెడ్ మోటర్ వస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140కి.మీల రేంజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది. దీని టాప్ స్పీడ్ 105కేఎంపీహెచ్.
ఇక రైడర్ సేఫ్టీ కోసం ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఫ్రెంట్, రేర్ వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టెమ్ (సీబీఎస్), రీజెనరేటివ్ బ్రేకింగ్, మల్టిపుల్ రైడర్ మోడ్స్ వస్తున్నాయి. ఈ రెండు ఈవీల ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో ప్రీలోడ్ అడ్జెస్టెబుల్ మోనో షాక్ యూనిట్లు సస్పెన్షన్స్ కింద లభిస్తున్నాయి.
ఈ రెండు ఈ-స్కూటర్ల్ ధర వివరాలు..
TVS X electric scooter on road price Hyderabad : ఇండియాలో ఏథర్ 450ఎక్స్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.45లక్షలుగా ఉంది. ఇక క్రియాన్ ఆధారిత టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 2.5లక్షలుగా ఉంది.
సంబంధిత కథనం