Ather Rizta electric scooter : ఏథర్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ‘రిజ్టా’ వచ్చేస్తోంది..
18 February 2024, 8:00 IST
- Ather Rizta family scooter : ఏథర్ ఎనర్జీ నుంచి ఓ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోంది. అది.. ఏథర్ రిజ్టా. ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
ఏథర్ రిజ్టాతో ప్రముఖ కమీడియన్ అనుభవ్ సింగ్ బస్సి..
Ather Rizta e- scooter : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌కు మంచి డిమాండ్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా.. 2 వీలర్ ఈవీ సెగ్మెంట్లో అటు డిమాండ్‌తో పాటు ఇటు పోటీ కూడా తీవ్రంగానే ఉంటోంది. ఇక ఇప్పుడు.. పోటీని మరింత పెంచుతూ.. ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది ఏథర్ ఎనర్జీ. ఈ ఈ-స్కూటర్ పేరు రిజ్టా! భారతీయ కుటుంబాలకు సూట్ అయ్యే విధంగా.. ఈ ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ని సంస్థ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ మోడల్.. లాంచ్ అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో.. ఈ ఈవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ ఇవే..!
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సంబంధించిన టీజర్‌ని తాజాగా విడుదల చేసింది.. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ. టీజర్ ద్వారా పలు కీలక వివరాలు స్పష్టమైయ్యాయి. ఏథర్ రిజ్టా ఈ-స్కూటర్ లోవర్ ఆప్రాన్లో ఎల్ఈడీ హెడ్‌లైట్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. ఫ్రెంట్లో భారీ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కూడా ఉంది. అది టచ్‌స్క్రీన్ అయ్యే అవకాశం ఉంది.
Ather Rizta family scooter : ఏథర్ 450ఎస్‌లో ఉన్న ఎల్సీడీ ప్యానెల్‌నే కొత్త ఈవీలో కూడా కొనసాగించవచ్చు. తద్వారా.. ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్లూటూత్ కనెక్టివిటీ, నేవిగేషన్ ఫీచర్స్‌కు కొదవే ఉండదు! స్టైలిష్ టర్న్ ఇండికేటర్స్‌తో పాటు ఫుల్లీ డీజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కూడా వస్తాయి.
ఇదీ చూడండి:- Tata EV's price cut : ‘ఈవీ’ ధరలను భారీగా తగ్గించిన టాటా మోటార్స్.. రూ. 1.2 లక్షల వరకు!
కొత్త ఈవీలో లాంగ్, వైడ్ సీట్, డీసెంట్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటాయి. ఏథర్ 450ఎక్స్‌తో పోల్చితే.. ఈ ఏథర్ రిజ్టాలో కొత్త మోటర్తో పాటు పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఇందులో ఉండొచ్చు.
ఏథర్ రిజ్టా- లాంచ్ ఎప్పుడు? ధర ఎంత?
Ather Rizta launch date in India : 2024 జూన్‌లో ఏథర్ కమ్యూనిటీ డే జరగనుంది. ఆ ఈవెంట్లోనే.. ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ని సంస్థ లాంచ్ చేస్తుందని టాక్ నడుస్తోంది. ఈ మోడల్ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ.. ఈ ఈవీ ఎక్స్‌షోరూం ధర రూ. 1.25 లక్షలు- రూ. 1.35 లక్షల మధ్యలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఏథర్ రిజ్టాకి చెందిన ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు ప్రముఖ స్టాండప్ కమీడియన్ అనుభవ్ సింగ్ బస్సి.
ఇక ఈ ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇతర ఫీచర్స్, ధర వివరాలపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.